Friday, November 11, 2011

రామాయణాలపై రగడ


ప్రజాశక్తి నేటి వ్యాసం: ఆర్‌. రఘు   Thu, 10 Nov 2011

1990 తరువాత మన దేశానికి పట్టిన ఒక జాఢ్యం మతోన్మాదం. అంతకు ముందు సమస్య లేదని కాదు. 1990 తరువాత దేశ రాజకీయాల్లో మతోన్మాద శక్తులు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే స్థితికి చేరుకున్నాయి. 1988 దాకా పార్లమెంటులో ఏనాడూ రెండంకెల సీట్లు సంపాదించలేని బిజెపి 1992లో బాబ్రీ మసీదుని కూల్చేసి మత ఉద్రిక్తతలను రాజేయడం ద్వారా తరువాత జరిగిన ఎన్నికల్లో తన బలాన్ని మూడంకెలకు పెంచుకుంది. ఆరు సంవత్సరాలు కేంద్రంలో అధికారం చెలాయించింది. స్వాతంత్య్రం కోసం వీసమెత్తు పనిచేయని, పైగా బ్రిటీషువారికి గులాంగిరీ చేసిన కాషాయ పరివార్నేడు స్థితికి రావడం ఆందోళనకరమే కాదు, దేశానికి ప్రమాదకరం కూడా. పాలక బూర్జువాపార్టీలకు మతోన్మాద ప్రమాద తీవ్రత అర్థం కాకపోవడం ఒక సమస్య అయితే పాలకవర్గాల్లో ఒక బలమైన సెక్షన్‌ 1990 తరువాత బిజెపిని భుజాన వేసుకోవడం మరో సమస్య. వీటికి తోడు 1990 నుండి మనదేశంలో ఊపందుకున్న ప్రపంచీకరణ లేక ఉదాదరవాద ఆర్థిక విధానాలతో హిందూ మతోన్మాదం పెనవేసుకోవడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. దేశంలో రెండు బలమైన రాజకీయ కూటములకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి ఆర్థిక విధానాలు దాదాపు ఒకటిగానే ఉన్నాయి. పరిస్థితి మతోన్మాదాన్ని వ్యతిరేకంచడంలో లౌకిక పార్టీలు మెతకపడటానికి దారి తీస్తుంది. పరిస్థితి తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కాషాయికూటమి లౌకిక వ్యవస్థపై దాడి చేస్తోంది.
అనవసర వివాదం
గతంలో రామజన్మభూమి, శిలాన్యాస్‌, కాశ్మీర్సమస్య వంటి సమస్యలు చుట్టూ చర్చలు పెట్టి మత కలహాలు సృష్టించిన కాషాయకూటమి తాజాగా రామయణంపై రగడ ప్రారంభించింది. ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్శిటీ బిఏ చరిత్ర పుస్తకంలో చికాగో యూనివర్శిటీ 'ప్రొఫెసర్ఎకె రామానుజన్‌' రామాయణంపై రాసిన పాఠ్యాంశంపై బిజెపి, దాని విద్యార్థి సంఘం ఎబివిపి, వారి ఉపాధ్యాయ సంఘం నేషనల్డెమెక్రాటిక్టీచర్స్ఫ్రంట్‌(ఎన్డిటిఎఫ్‌) వంటి సంస్థలు విషం గక్కనారంభించాయి. 2008లో వ్యాసం హిందువుల సెంటిమెంట్లు దెబ్బతీస్తున్నదని యూనివర్శిటీ చరిత్ర విభాగం కార్యాలయంపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. కాషాయ కూటమిలోని అంతర్భాగమైన 'శిక్షా బచావో ఆందోళన్సమితి' తరపున దీనానాద్బత్రా అనే ఆయన ఢిల్లీ కోర్టులో కేసు వేశాడు. కోర్టు ఇది యూనివర్శిటీ పరిధిలోని అంశమని, దానిపై తీర్పు చెప్పలేమని కేసు కొట్టివేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై ఒక నివేదిక తయారు చేసేందుకు నిపుణుల కమిటీని వేయాలని, కమిటీ ఇచ్చే నివేదికపై ఎకడమిక్కౌన్సిల్ఒక నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ యూనివర్సిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. యూనివర్శిటీ నలుగురు చరిత్ర విభాగం అధ్యాపకులతో ఒక కమిటీని వేసింది. కమిటీ శ్రీరామానుజం రాసిన '300 రామాయణాలు, ఐదు ఉదాహరణలు, అనువాదాలపై మూడు ఆలోచనలు' అన్న వ్యాసంలోని అంశాలను లోతుగా పరిశీలించిన మీదట వ్యాసం చాలా విలువైనదని, మన దేశంలో అనాదిగా ఉన్న భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తున్నదని, వ్యాసం చరిత్ర విద్యార్థులకు అవసరమని పేర్కొంది. నాల్గవ సభ్యుడు మాత్రం వ్యాసాన్ని అర్థం చేసుకునే శక్తి విద్యార్థులకు లేకపోవచ్చు, దాని పూర్వాపరాలు వివరించే సామర్థ్యం అధ్యాపకులకు లేకపోవచ్చు. మరీ ముఖ్యంగా హిందూయేతర అధ్యాపకులైతే ఇటువంటి వ్యాసాలను భోధించడం కష్టమవుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు రామాయణంలోని పాత్రలు దైవాంశాలు కాబట్టి వాటి గురించి చెడుగా రాయడాన్ని సహించలేరని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. నిపుణుల కమిటీ రిపోర్టుని అక్టోబర్తొమ్మిదిన హడావుడిగా వేసిన అకడమిక్కమిటీ ముందు పెట్టడం జరిగింది. ఎజెండా తెలియక కౌన్సిల్కి హడావుడిగా వచ్చిన సభ్యులు వివాదం నివారించడడానికి వ్యాసం తొలగించడం మంచిదని ఉచిత సలహా పడేశారు. వైస్ఛాన్స్లర్ మాత్రమూ ఆలోచించకుండా వ్యాసాన్ని పాఠ్యాంశం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కాషాయకూటమి దీనిని ఒక గొప్ప విజయంగా పేర్కొంది. ఆర్ఎస్ఎస్పత్రిక ఆర్గనైజర్లో దీనానాథ్బత్రా 'క్రిష్టియన్మిషనరీ సంస్థలు, దాని మిత్రులు మన దేవుళ్లను, దేవతలను అగౌరవ పరచడానికి ప్రయత్నించారు. ప్రయత్నాలు నాశనమ య్యాయి, మన దేవుళ్లు, దేవతల పవిత్రతను కాపాడటంలో యూనివర్శిటీలో సహకరించిన వారందరికీ అక్టోబర్‌ 18 సన్మానం జరుపుతున్నాము. వీరందరూ రానున్న కాలంలో కూడా ఎటువంటి పొరపాట్లూ జరగకుండా యూనివర్శిటీ సిలబస్పై ఒక కన్నేసి ఉంచాలి'' అని రాశాడు. ఎన్డిటిఎఫ్అధినేత ఫ్రంట్లైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో '.... దేశ వ్యాప్తంగా వామపక్ష చరిత్రకారులు, వారి తొత్తులు భారత పురాతన సంస్కృతి గురించి చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నాం' అని పేర్కొన్నాడు.
'కాషాయ కూటమి దాటేస్తున్న ప్రశ్నలు'
శ్రీరామనుజన్రాసిన వ్యాసంలో 300 రామాయణాలు గురించి విశ్లేషించారు, వీటిలో ఒక్కటైనా వీరు చదివారా ? అవి ఎన్ని శతాబ్దాలుగా వ్యతిరేకతా లేకుండా ఎలా కొనసాగించబడుతున్నాయి ? ఇన్ని రామాయణాలు ఉన్నా హిందువులలో రాముడిపై గౌరవం మాత్రమూ తగ్గలేదు ? కనీసం వీరు ప్రామాణికంగా తీసుకుంటున్న వాల్మీకి రామాయణాన్నైనా ఏనాడైనా విమర్శనాత్మకంగా విశ్లేషించారా ? రాముడు శంభూకుడిని ఎందుకు చంపాడు వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలగరా ? రావణుడు రాక్షసుడా ? బ్రాహ్మణుడా ? బ్రహ్మ మనువడు అయిన రావణాబ్రహ్మ రాక్షసుడు ఎలా అవుతాడు ? ఇటువంటి ప్రశ్నలకు కాషాయ కూటమి ఏం సమాధానం చెబుతుంది? ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్చెప్పినట్లు పురాణ పురుషులైన రాముడిని, కృష్ణుడిని కాషాయ కూటమి దైవాంశ సంభూతులుగా మార్చేసింది. హిందూ మత గ్రంథాల్లో పురాణేతిహాసాల్లో ఉన్న వైవిధ్యాన్ని సైతం భరించలేని స్థితికి కాషాయకూటమి చేరుకుంది. దీంతో గత చరిత్రనంతా రద్దుచేసి భోజనశాల స్థాయికి చరిత్రని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నది. పురాణేతిహాసాల్లో అనేక వైవిధ్యభరితమైన సామాజిక అంశాల ద్వారా ఆనాటి జనజీవనాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తున్నది.
'మూర్ఖత్వానికి పరాకాష్ట'
రొమిల్లా థాపర్‌(హిందూ పత్రిక ఇంటర్వ్యూలో) 'ఎవరో కొందరు ముఠా విధ్వంసాలు సృష్టించి పాఠాలు బోధించాలో నిర్ణయించే పరిస్థితి దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతుంది' అని ఆవేదనతో అడిగిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది. బుద్ధ జాతక కథలలో దశరథó జాతక కథ ముఖ్యమైనది. అందులో రాముడు సీత, అక్కాతమ్ముడు అని ఉంది. విమలసూరి అనే జైన పండితుడు రాసిన రామాయణంలో ఆయన 'ఇప్పటిదాకా మీరు వింటున్న రాముని కథలన్నీ తెలివితక్కువ వారు రాసిన అబద్ధాలు, అసత్యాలు. నేడు అసలు కథ చెబుతున్నాను' అని ఆరంభించాడు. అంతేకాకుండా ఇంతకు ముందున్న రామాయణాలలో చెప్పినట్లు రావణాసురుడు వగైరాలు రాక్షసులు కాదు, మామూలు మనుషులేనని తేల్చిచెప్పారు. నిజానికి వాల్మీకి రామయణానికి, కంభ రామాయణానికి మధ్య దాదాపు వెయ్యి సంవత్సరాలు తేడా ఉంది. కాలంలో ఆయా కాలమాన పరిస్థితులను బట్టి రామాయణంలోనే కాదు, ఇతర పురణేతిహాసాలలో అన్నిటిలోనూ అనేక అంశాలు చొప్పించబడుతూ వచ్చాయి. అనేక అంశాలు తొలగించబడుతూ వచ్చాయి. బౌద్ధ, జైన మతాలు ఇండో చైనా దేశాలలోకి విస్తరించడంతో దేశాలలో కూడా రకరకాలైన రామాయణాలు ప్రచారంలో ఉన్నాయి. ఇండోనేషియాలో ఉన్న రామాయణంలో సీత రావణాసురుడికి కూతురు అని చెప్పబడుతుంది. కాషాయ కూటమి మూకలు అక్కడికి కూడా వెళ్లి విధ్వంసం సృష్టిస్తాయా ? అని రొమిల్లా థాపర్ప్రశ్నిస్తున్నారు.
సంఘటన జరిగిన అనంతరం ఢిల్లీ యూనివర్శిటీ వైస్ఛాన్స్లర్నిర్ణయంపైనా, కాషాయ కూటమి ఆగడాలపైనా ప్రత్యేకించి చరిత్రని తాలిబనీకరణ చేస్తున్నారని ప్రముఖ చరిత్రకారులు, మేధావులు, తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధోరణి పచ్చి ఫాసిస్టు పోకడ అని వాదిస్తున్నారు. అయితే దీనిపై పాలకపార్టీలు మాత్రం నోరు మెదపడం లేదు.
'విష ప్రచారానికి ముసుగు'
చాపకింద నీరులా ముంచుకొస్తున్న కాషాయా కూటమి విష ప్రచారానికి ముసుగు వేస్తూ బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ జనచేతన రథయాత్ర చేపట్టాడు.. మరోపక్క మైనార్టీలను ఊచకోతకోసి ఘనత కెక్కిన గుజరాత్ముఖ్యమంత్రి నరేంద్రమోడి సద్భావనాదీక్షలు చేశాడు. అవినీతి వ్యతిరేకతను, అలాగే అభివృద్ధిని ప్రచారం చేయడానికే తతంగమంతా అని బిజెపి నేతలు పైకి చెబుతున్నా అసలు అంతర్యం అధికారం కోసం పాకులాటే. రాజకీయ వాతావరణంలో వస్తున్న మార్పులు 2014లో తమను ఢిల్లీ పీఠం ఎక్కిస్తాయని ఆశతో మతోన్మాద ఎజెండాను మరలా ముందుకు తెస్తున్నారు. కర్నాటకలో స్వయానా ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లాడు. లంచాల రేట్లను నిర్ణయించి మరీ వసూలు చేసిన ఉత్తరాఖండ్ముఖ్యమంత్రిని చడీచప్పుడు లేకుండా తొలగించింది. పంజాబ్లో తమపార్టీ మంత్రులు అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కోవడంతో వారిని మార్చుకోక తప్పలేదు. అవినీతిమయంలో ఇరుక్కున్న తమ పార్టీ మంత్రులైన గాలి సోదరులు కూడా జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. వీటిని కప్పిపుచ్చడానికే రథయాత్రలు, దీక్షలు ఒకవైపు. మతోన్మాదం రెచ్చగొట్టడం మరోవైపు ప్రారంభించారు.
సెప్టెంబర్అక్టోబర్నెలల్లో రాజస్థాన్లోని గోపాల్గఢ్పట్టణంలో చిన్న స్థల వివాదాన్ని అది కూడా మేజిస్ట్రేట్హోదాలో స్థలం ముస్లిం ప్రార్థనాస్థలానికి సంబంధించినదని స్పష్టంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దానిపై మత ఉద్రిక్తతలు సృష్టించింది. సందర్భంగా కాషాయ కూటమి, పోలీసులు కలిసి పదిమంది ముస్లిములను పొట్టనబెట్టుకున్నారు. నిజానికి పోలీస్కాల్పుల్లో చనిపోయింది వారు ముగ్గురని, మిగతా ఏడుగురిగి మతోన్మాదులే నరికి చంపారని ప్రాథమిక విచారణలో తేలింది. అంటే పోలీసుల పర్యవేక్షణలో గుజరాత్తరహా మారణకాండ ఇది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ప్రభుత్వం పైపైమాటలకే పరిమితమైంది తప్ప దీనిపై ఎటువంటి కఠిన చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
అలాగే బిజెపి పాలిస్తున్న ఉత్తరాఖండ్లోని రుద్రపూర్పారిశ్రామిక పట్టణంలో మసీదు వద్ద పవిత్ర ఖురాన్పేజీలు చించి అందులో పంది మాంసం పెట్టి పడేశారు. మొదటిసారి ముస్లిములు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇలాగే రెండోసారి జరగడంతో ఆగ్రహించిన ముస్లింలు పోలీసులను నిలేశారు. వీరిని శాంతింపజేయాల్సిన పోలీసులు చుట్టుపక్కల ఉన్న హిందూ మతోన్మాదుల సాయం కోరడంతో అక్టోబర్‌ 2 మతకలహాలు పెద్దఎత్తున జరిగాయి. ముగ్గురు ముస్లింలు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ప్రాంతంలో హిందూ ముస్లింల మధ్య పెద్ద విభజన రేఖ గీసింది కాషాయకూటమి. నేపథ్యంలో ప్రజాతంత్రవాదులనూ, లౌకికవాదులను కూడదీసి మరోసారి తెరపైకి వస్తున్న కాషాయకూటమి ఫాసిస్టు పోకడలను తిప్పికొట్టాల్సిన బాధ్యత వామపక్షాలదే.



No comments:

Post a Comment