Friday, December 2, 2011

యూరప్‌ ఆర్థిక సంక్షోభం - ఒక విశ్లేషణ


సంక్షోభం అంటే అప్పులను తిరిగి చెల్లించలేని అశక్తత లేదా రుణాలను పొడిగించడం సాధ్యం కాని పరిస్థితిగా అర్థం చేసుకోవాలి. ఆస్టరిటీ అంటే సంక్షోభాన్ని పరిష్కరించడం. కార్మికుల పరిభాషలో మరింతగా సంక్షోభంలో కూరుకుపోవడం. గ్రీసు సంక్షోభాన్ని బయటపడేసేందుకు ఉద్దేశించిన యూరోపియన్‌ పథకం ప్రజలు ఎంతకాలం పొదుపు చర్యలను అనుభ వించాలో వివరించదు. దాని సంకెళ్ల నుండి ఎలా బయటపడాలో తెలియజేయదు. ప్రజలు చేయాల్సిన త్యాగాలు ఏమిటో పేర్కొనదు. గ్రీక్‌ ప్రభుత్వానికి సమకూర్చిన రుణాలకు ఫైనాన్స్‌ పెట్టుబడి రక్షణ కల్పిస్తుంది. రుణం చెల్లించకపోవడం వల్ల ఎటువంటి సమస్య తలెత్తకుండా రక్షణ కల్పిస్తుంది.
దుబారా ఖర్చు కారణంగా తీవ్ర రుణభారంలో కూరుకుపోయిన అనేక యూరోపియన్‌ దేశాలు అసలు ఆ రుణాలు చేసేందుకు అర్హత విషయంలో విశ్వసనీయత కోల్పోయాయి. దుబారా ఖర్చుల వల్లే అవి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయనే అభిప్రాయం నెలకొంది. వ్యయాన్ని తగ్గించుకోవడం, పొదుపు చర్యలు పాటించడం ఈ సమస్యకు పరిష్కారం. తమకున్న ఆదాయ వనరుల పరిమితుల మేరకే జీవించాలి తప్ప లేనిపోని బేషజాలకు పోకూడదు. అందుబాటులో ఉన్న వస్త్రానికి అనుగుణంగానే కోటు కుట్టించుకోవాలి. మార్కెట్‌ గుర్తించిన ఈ సాధారణ సూత్రాలకు మనం పాటించి తీరాలి. ప్రామాణికమైనదిగా చెబుతున్న ఈ అభిప్రాయం బూర్జువా సిద్ధాంతాలను ప్రతిబింబించేదిగా ఉంది. మార్కెట్‌ అనేది మానవులు సృష్టించిన ఒక సంస్థే. ఇది మావవులకు సంబంధం లేని, మానవుల పొరపాట్లను సరిదిద్దగల తెలివితేటలున్న సంస్థగా పేరుగాంచాయి. అందువల్ల ఈ మార్కెట్‌లు గౌరవం, విధేయత పొందుతున్నాయనే అభిప్రాయం నెలకొంది. తమ ప్రభుత్వంపై విశ్వాసాన్ని పునురుద్ధరించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ ప్రతిపాదించిన పొదుపు చర్యలపై రిఫరెండం నిర్వహించాలని మాజీ ప్రధాని పపెండ్రో భావించారు. ఈ పొదుపు పథకం ప్రజలపై తీవ్ర భారం మోపుతుందని, అందువల్ల వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చేసిన ప్రకటన బూర్జువా శక్తుల్లో ఆందోళన రేకెత్తించింది. మన దేశంలో దిన పత్రికలు సైతం ఈ నిర్ణయంపై సంపాదకీయాలు రాశాయి. ఇది ఆచరణ సాధ్యం కాని మూర్ఖమైన చర్యగా అవి సూత్రీకరించాయి. అందువల్ల సంభవించే పరిణామాలేమైనా మార్కెట్‌ ఆదేశాలను ప్రభుత్వాలు వెన్నెముక లేకుండా అమలు చేయాల్సిందే. ఇందువల్ల తమ ప్రభుత్వానికే ప్రమాదం ఏర్పడనున్నదన్న విషయాన్ని గ్రహించిన పపెండ్రో రిఫరెండం ఆలోచనను విరమించుకున్నారు.
కొన్ని యూరోపియన్‌ దేశాలు ఉద్దేశపూర్వకంగా చేసిన దుబారాకు, రుణ బకాయిలు పేరుకు పోవడానికి సంబంధం లేదు. ఈ సంక్షోభం ఏర్పడటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అమెరికాలో గృహ నిర్మాణ రంగం సంక్షోభంలో చిక్కుకున్న సందర్భంగా బడ్జెట్‌ వనరుల నుండి ప్రయివేటు ఆర్థిక సంస్థలకు బెయిలవుట్లు ప్రకటించారు. మాంద్యం నెలకొన్నప్పటికీ దుబారాలను నివారించడంలో ఆ ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శించాయి. అయితే ఈ కారణాలు అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తించవు. ఉదాహరణకు గ్రీస్‌లో బెయిలవుట్‌ విధానం అంతగా ప్రచారానికి సంతరించుకోలేదు.
మార్కెట్‌లు పొదుపు చర్యలపైనే ప్రధానంగా పట్టుబడతాయి. ఖర్చుల విషయంలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలపై దృష్టి సారించడంతోపాటు తమ పాత విధానాలను విడనాడాలని ఆర్థిక సూత్రాలు బోధిస్తున్నాయి. బెయిలవుట్‌ విషయలో పొదుపు పాటించాలని ఆర్థిక వర్గాలు డిమాండ్‌ చేయడం లేదు. పాదుపు చర్యల్లో భాగంగా కార్మికులపై పెట్టే ఖర్చులను మాత్రమే తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. ప్రభుత్వాలు తిరోగమన విధానాలు పాటించరాదని, కార్మికులను నియంత్రించే విధానాలను అనుసరించాలని ఆర్థిక మార్కెట్లు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. సంక్షేమ పథకాల అవశేషాలేమైనా మిగిలి ఉంటే వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
తుది దాడి
ఇంకోవిధంగా చెప్పాలంటే, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యూరోపియన్‌ సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థపై, దాని సంక్షేమ రాజ్యంపై ఫైనాన్స్‌ పెట్టుబడి జరుపుతున్న దాడే యూరోపియన్‌ యూనియన్‌ ఆర్థిక సంక్షోభానికి కారణం. బూర్జువా దేశాలైనప్పటికీ పూర్తిగా వర్గతత్వంతో అంట కాగకుండా పెట్టుబడిదారీ వర్గాల, కార్పొరేట్‌ ఆర్థిక శక్తుల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా, కార్మికవర్గం అవసరాలకు అనుగుణంగా కూడా పనిచేస్తుంటాయి .ఫైనాన్స్‌ పెట్టుబడి పెత్తనం చెలాయిస్తోంది. ఫైనాన్స్‌ గ్లోబలైజేషన్‌ కారణంగా ప్రభుత్వాలపై దాడి కొనసాగుతూనే ఉంది, వర్గాలకు అతీతంగా, కార్మికుల పట్ల కొంతమేరకు ఆదరణతో, సోషల్‌ ప్రజాస్వామ్య ముద్రతో వ్యవహరించే గత బూర్జువా ప్రభుత్వ స్థానంలో ఫైనాన్స్‌ పెట్టుబడి నియంతృత్వానికి ప్రాతినిధ్యంవహించే ప్రభుత్వాన్ని ప్రతిష్టించేందుకు ప్రయత్నించడం తుది దాడిగా, అసలు సిసలు నియంతృత్వంగా పేర్కొనవచ్చు.
యూరోపియన్‌ ఆర్థిక సంక్షోభం అంటే ఏమిటి? అది చేసే హెచ్చరిక ఏమిటనే అంశాలను స్థూలంగా విశ్లేషిస్తే, కొన్ని విషయాలు స్పష్ట మవుతాయి. యూరప్‌లో ఒక దాని తరువాత మరో ప్రభుత్వాన్ని పతనం చేస్తున్న రుణ సంక్షోభం మూలాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యంలో ఉన్నాయి. అది ప్రభుత్వ ఖర్చులకు కూడా సరిపోని విధంగా ఆదాయాలను తగ్గించింది. ప్రభుత్వాలు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను గణనీయంగా బలహీనపరచి పొదుపు చర్యలు ప్రవేశపెట్టే పరిస్థితిని సృష్టించి దానిని తనకు అనుకూలంగా మలచుకుంటుంంది. సాధారణంగా ఈ మార్పులు దీర్ఘకాల ప్రభావం కలిగించేవిగానే ఉంటాయి.
యూరోపియన్‌ యూనియన్‌ పొదుపు ప్రణాళికపై రిఫరెండం నిర్వహించాలని పపెండ్రో ప్రతిపాదించడంపై నెలకొన్న ఆగ్రహం ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణకు సంకేతంగా నిలుస్తుంది. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ముందుగానే తెలిసిన వ్యవహారమే. ప్రజల ఆమోదం లేదా అనుమతి లేకుండా వారి వెనుక వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
సంక్షోభం అంటే అప్పులను తిరిగి చెల్లించలేని అశక్తత లేదా రుణాలను పొడిగించడం సాధ్యం కాని పరిస్థితిగా అర్థం చేసుకోవాలి. ఆస్టరిటీ అంటే సంక్షోభాన్ని పరిష్కరించడం. కార్మికుల పరిభాషలో మరింతగా సంక్షోభంలో కూరుకుపోవడం. గ్రీసు సంక్షోభాన్ని బయటపడేసేందుకు ఉద్దేశించిన యూరోపియన్‌ పథకం ప్రజలు ఎంతకాలం పొదుపు చర్యలను అనుభ వించాల్సి ఉందో వివరించదు. దాని సంకెళ్ల నుండి ఎలా బయటపడాలో వివరించదు. ప్రజలు చేయాల్సిన త్యాగాలు ఏమిటో వివరించదు. గ్రీక్‌ ప్రభుత్వానికి సమకూర్చిన రుణాలకు ఫైనాన్స్‌ పెట్టుబడి రక్షణ కల్పిస్తుంది. రుణం చెల్లించకపోవడం వల్ల ఎటువంటి సమస్య తలెత్తకుండా రక్షణ కల్పిస్తుంది. ఇందువల్ల ప్రజల స్థితిగతుల్లో ఎటువంటి మార్పు ఉండబోదు. విదేశాల్లో రుణాలు చేసే విధంగా ఒత్తిడి ఎదుర్కొంటూ దేశంలో రుణాలు చేయలేని స్థితిలో ఉన్న దేశాలు మాత్రమే ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నాయని పాల్‌ క్రగ్‌మన్‌తో సహా అనేక మంది ఆర్థికవేత్తలు వాదిస్తుస్తున్నారు. ప్రభుత్వం తన సెంట్రల్‌ బ్యాంక్‌ నుండి రుణం తీసుకుంటే అది ఎన్నడూ రుణాల ఊబిలో కూరుకుపోదనే విషయంలో రెండవ అభిప్రాయానికి తావులేదు. అయితే తద్వారా గ్లోబలైజ్డ్‌ పెట్టుబడికి ఆర్థిక వ్యవస్థను తెరిచే అవకాశం కల్పించినట్లవుతుంది. ఒక ప్రభుత్వం తన సెంట్రల్‌ బ్యాంక్‌లోనే రుణం చేస్తే ఆ దేశంపై ఫైనాన్స్‌ పెట్టుబడికి నమ్మకం సన్నగిల్లుతుంది. ఇందువల్ల ఫైనాన్స్‌ విదేశాలకు తరలివెళ్తుంది. పౌరులు కూడా తమ ఫైనాన్స్‌ను విదేశాలకు తరలిస్తారు. ప్రభుత్వం విదేశాల నుండి రుణం స్వీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల అది పొదుపు చర్యలు ప్రవేశపెడుతుంది.
అంతా భ్రాంతే!
యూరోపియన్‌ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యానికి సంబంధం లేదని కృగ్‌మన్‌ వాదన స్పష్టం చేస్తుంది. ప్రభుత్వానికి తమ దేశంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ నుండి రుణం తీసుకునే స్వేచ్ఛ ఉందా, లేదా అనేది ప్రధానం కాదు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం నెల కొన్నప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుందన్నదే సమస్య.
డాలర్‌ మారకపు రేటు ఎక్కువగా ఉన్న దేశాల్లో మాంద్యం ప్రభావం ఎక్కువగానూ, తక్కువగా ఉన్న దేశాల్లో తక్కువగానూ ఉంటుంది. ఎక్కువ ప్రభావితమయ్యే దేశాలు మాంద్యం ప్రభావం నుండి మూడు రకాలుగా రక్షించుకోవచ్చు. అందులో ఒక మార్గం కరెన్సీ విలువను తగ్గించడం. ద్రవ్య వేతనాలు (మారకపు రేటు) పెరగకపోతే, అంటే తమ నిజ వేతనాలను కార్మికులు తగ్గించుకుంటే వారిలో పోటీతత్వం పెరుగుతుంది. (ఇతర దేశాలు ఇదే విధంగా తమ కరెన్సీ విలువలను తగ్గించుకుంటే) తమ నికర ఎగుమతులు, తద్వారా ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెంచుకుంటాయి. దీనినే 'బెగ్గర్‌ -మై- నైబర్‌' విధానం అని పిలుస్తారు. మరో ఇతర దేశం స్థానంలో ఒక దేశం అభివృద్ధి చెందడం (నికర ఎగుమతుల ద్వారా). అయితే ఇది ఆచరణ సాధ్యం కాని విషయం.
రెండవ మార్గం, అనేక యూరోపియన్‌ దేశాలు అనుసరించేందుకు ప్రయత్నించిన పద్ధతి. ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ప్రభుత్వ వ్యయాలను తగ్గించుకోకపోవడం, తద్వారా ద్రవ్యలోటును పెంచుకోవడం. అటువంటి సందర్భంలో తమ ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం విదేశాల నుండి రుణాలు సేకరించాల్సి ఉంటుంది. మాంద్యం నుండి ఆర్థిక వ్యవస్థను ద్రవ్యలోటు ద్వారా రక్షించడం, అంటే మాంద్యం కారణంగా దిగుమతులు తగ్గినా దేశ ఎగుమతులను నిలబెట్టుకోవడం. ప్రభుత్వం చేయకపోయినా దేశం విదేశాల్లో రుణం చేయాల్సి ఉంటుంది. ఇందువల్ల నేడు యూరోపియన్‌ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యనే ఆ దేశం కూడా ఎదుర్కొంటాయి.
ఇక మూడవ పద్ధతి దేశంలో డిమాండ్‌ను పెంచడం. (అవసరమైతే రెండవ ప్రత్యామ్నాయంలో మాదిరిగా, భారీ స్థాయిలో ద్రవ్య లోటుకు దారి తీసినప్పటికీ), పెట్టుబడిపై, వర్తకంపై నియంత్రణ పెంచడం.
డిమాండ్‌ పెంచేందుకు సమగ్ర చర్యలు తీసుకోవడం మరో విషయం. అయితే ఇటువంటి చర్య అజెండాలో ఉందడు. గ్లోబల్‌ ఫైనాన్షియల్‌, వర్తక పెట్టుబడులకు అవకాశం కల్పించినప్పటికీ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ పరిధిలో నయా ఉదారవాద సంక్షోభం నుండి గట్టెక్కవచ్చుననుకోవడం భ్రాంతి మాత్రమే.
-ప్రభాత్‌ పట్నాయక్‌(Prajasakti, 2/12/2011)

No comments:

Post a Comment