కమ్యూనికేషన్సు మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ 02.04.2015న
పి టి ఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వాజపాయి ప్రభుత్వము దిగిపోయేటప్పుడు బి ఎస్ ఎన్
ఎల్ 2004 లో రు. 10,000 కోట్లు లాభం తో
వున్నదని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాములో దానికి రు.9000 కోట్లు నష్టం వచ్చిందని, బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు కారణం ఏ శక్తులో అని ప్రశ్నిస్తూ అమాయకత్వం నటించారు.కానీ
వాస్తవానికి బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు పునాది వేసింది వాజ్పాయి ప్రభుత్వము కాదా?
బిఎస్ఎన్ఎల్ ను ఏర్పాటు చేయటం దానిని నష్టాలపాలు
చేయటానికేనని ఆనాడు అనేక మండి మేధావులు, ఉద్యోగుల స్సంఘాలు అన్నాయి. అయినప్పటికి వాజపాయి ప్రభుత్వము మొండిగా డి ఓ
టి అధీనం లో వున్న టెలికాం సర్వీసులను బి ఎస్ ఎన్ ఎల్ పేరుతో 1.10.2000 న
కార్పొరేషన్ గా మార్చింది. గ్రామీణ ల్యాండ్ లైన్ సర్వీసులపై వస్తున్న నష్టాలకు
పూర్తి పరిహారం చెల్లిస్తామని హామీ
యిచ్చింది. బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు సందర్భముగా వాజపాయి నియమించిన మంత్రివర్గ
ఉపసంఘం ఈ క్రింది హామీని యిచ్చింది:
“Financial
viability: (i) Bharat Sanchar Nigam Ltd would be duly compensated for
discharging obligations in regard to rural telephony or any other uneconomic
service in accordance with any Government directive for implementation of
NTP-99. (ii) GoM has further assured that under no circumstances Bharat Sanchar
Nigam Ltd would be allowed to become non-viable as this would be a potential
instrument in the hands of the Government for achieving its NTP-99 objectives”
(“ఆర్థిక పటిష్టత: ఎన్ టి పి-99 (న్యూ టెలికాం పాలసీ 1999) లక్ష్యాలు
నెరవేర్చేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వము చేతిలో ఒక సాధనముగా వుంటుంది. కాబట్టి
బి ఎస్ ఎన్ ఎల్ ను ఎట్టి పరిస్థితిలోను ఆర్థిక పటిష్టత లేని సంస్థగా కానీయమని
ప్రభుత్వము హామీ యిచ్చింది. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న గ్రామీణ టెలిఫోనీ
మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్ టి పి-99 లక్ష్యాలు నెరవేర్చేందుకు నేరావేర్చే
ఆర్థికముగా గిట్టుబాటుగాని ఏ ఇతర సేవలకయినా బి ఎస్ ఎన్ ఎల్ కు ప్రభుత్వము తగిన
పరిహారం చెల్లిస్తుంది”)
పైన తెలియజేసినది బి ఎస్ ఎన్ ఎల్ 01.10.2000 న
ఏర్పడేముందు 25.9.2000 న మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీల ప్రకారం తయారు చేసిన
కేబినెట్ నోట్ లో వున్నది. కానీ ఈ కేబినెట్ నోట్ ను వాజపాయిగారి మంత్రివర్గం
యధాతథముగా ఆమోదించకుండా బి ఎస్ ఎన్ ఎల్ ను దెబ్బ తీసే విధముగా కొన్ని మార్పులు
చేసింది. మంత్రి వర్గ ఉప్సంఘం ఇచ్చిన హామీ ప్రకారం గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై
వచ్చే నష్టానికి బి ఎస్ ఎన్ ఎల్ కు తగు పరిహారాన్ని చెల్లించాలి. కానీ మంత్రివర్గం
దీనిని మార్చి,”Government
will consider and provide a package of measures so that the viability of BSNL
is not impaired because of implementation of any socially desirable uneconomic
activity, such as rural telephony, undertaken by BSNL at the behest of
Government” (ప్రభుత్వా ఆదేశం ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ తనకు
ఆర్థికముగా గిట్టుబాటుగానప్పటికి నిర్వహించే గ్రామీణ టెలిఫోనీ తదితర సేవలకు
పరిహారాన్ని చెల్లించేందుకు ప్రభుత్వము ఒక ప్యాకేజీని రూపొందిస్తుంది”.)
ఇక్కడ మనము గమనించాల్సింది ఏమిటంటే ప్యాకేజీ అంటే
స్వల్పకాలం అమలులో వుండేది.గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై నష్టాలు వస్తున్నంత కాలం పరిహారం
ఇవ్వకుండా ఒక ప్యాకేజీ రూపం లో ఈ పరిహారాన్ని కొద్ది కాలమే చెల్లిస్తామని ఈ
విధముగా వాజపాయి ప్రభుత్వము నిర్ణయించింది. ఈ ప్రకారమే లైసెన్సు ఫీజు మరియు
స్పెక్ట్రమ్ చార్జి రీయింబర్స్మెంటును మొదట 2002-03 వరకే అనుమతించి ఆ తరువాత మరొక
సంవత్సరం అంటే 2003-04 వరకు పొడిగించింది. బి ఎస్ ఎన్ ఎల్ కు నోషనల్ గా యిచ్చిన అప్పు
కు అసలు మరియు వడ్డీ వాయిదాల చెల్లింపుపై మోర టోరియమ్ ను మార్చి 2005 వరకే
అనుమతించింది. యూపీ ఏ ప్రభుత్వము లైసెన్సు ఫీజు మరియు స్పెక్త్ర్రమ్ చార్జి
రియింబర్స్మెంటును మరొక సంవత్సరం 2005-06 వరకు తక్కువ మొత్తం రియింబర్స్ చేసే
విధముగా అనుమతించింది. ఈ విధముగా ప్రతిసంవత్సరమూ గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వచ్చే
నష్టానికి పూర్తి పరిహారం చెల్లించే బదులు ప్యాకేజీ రూపములో కొద్ది సంవత్సరాలే
ఇస్తామని ప్రకటించి వాజపాయి ప్రభుత్వమే బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు పునాది వేసింది.
2001-02 నుండి 2013-14 వరకు బి ఎస్ ఎన్ ఎల్ కు సంవత్సరానికి
సగటున రు. 8000 కోట్ల చొప్పున రు. 1,04,000
కోట్లు వచ్చి వుంటుందని అంచనా. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు వివిధ
రూపాలలో లభించిన పరిహారం రు.41370 కోట్లు మాత్రమే. బి ఎస్ ఎన్ ఎల్ కు ల్యాండ్
లైన్స్ పై వచ్చిన నష్టాలలో 40 సాతమే పరిహారముగా ఇవ్వటానికి కారణమయిన వాజపాయి ప్రభుత్వము
ప్రయివేటు టెలికాం ఆపరేటర్లకు మాత్రం 10 సంవత్సరాల లైసెన్సు కాలాన్ని 20
సంవత్సరాలకు పొడిగించి, లైసెన్సు ఫీజుగా ఒకే సారి
చెల్లించాల్సిన భారీ మొత్తానికి బదులు ప్రతి సంవత్సరము ఆదాయములో కొద్ది శాతం
మాత్రమే చెల్లించేందుకు వీలుగా విధానాన్ని మార్చి రు.43000 కోట్లు అనుచిత లాభం
చేకుర్చింది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు కారణం వాజపాయి ప్రభుత్వము
అనుసరించిన విధానమే.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వము వాజపాయి విధానాన్నే కొనసాగించి
బిఎస్ఎన్ఎల్ కు ల్యాండ్ లైన్స్ పై నష్ట పరిహారం చెల్లింపును ఆపి వేసింది. ఇంతేగాక
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాములో 2008 నుండి 2012 వరకు బి ఎస్ ఎన్ ఎల్ మొబైల్
సర్వీసుల విస్తరణకు అవసరమయిన జిఎస్ఏం ఎక్విప్మెంటు టెండర్లు రద్దు చేసి
ఎక్విప్మెంటు కొననీయకుండా చేసి మొబైల్ సర్వీసుల మార్కెట్లో బి ఎస్ ఎన్ ఎల్
వెనకబడేలా చేసింది. 3 జి /బి డబ్ల్యూఏ స్పెక్ట్రమ్ కు బి ఎస్ ఎన్ ఎల్ వద్ద రు.18500 కోట్లు
అనుచితముగా వసూలు చేసి దాని నగదు నిల్వలు హరించి వేసింది. ఈ విధముగా వాజపాయి మరియు
మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల విధానాలవలన బి ఎస్ ఎన్ ఎల్ నష్టాల పాలాయింది. నష్టాలకు
బాధ్యత తమది కాదని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిది మాత్రమేనని
రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పేది బుకాయింపు మాత్రమే.
వాజపాయి మరియు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు అనుసరించిన బి
ఎస్ ఎన్ ఎల్ వ్యతిరేక విధానాలనే మోడి ప్రభుత్వము మరింత జోరుగా కొనసాగిస్తున్నది.
కార్పొరేట్స్ కు గత ప్రభుత్వాలకన్నా మరింత తన్మయత్వముతో సేవ చేస్తూ, కార్మిక వర్గం, ప్రభుత్వ రంగము మరియు ప్రజలపై దాడిని తీవ్రం చేస్తున్నది. బి ఎస్ ఎన్ ఎల్
ను పునరుద్ధరించాలని నిజముగా మోడి ప్రభుత్వానికి వుంటే ఆ ప్రభుత్వములో
కమ్యూనికేషన్సు మంత్రిగా వునన్ శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు ఈ క్రింది ప్రశ్నలకు
జవాబు చెప్పాలి:
- వాపసు చేసిన బి డబ్ల్యూ
ఏ స్పెక్ట్రమ్ కు రు. 6724 కోట్లు బి ఎస్ ఎన్ ఎల్ కు రీఫండ్ చేయాలని ఫిబ్రవరి
2014 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వెంటనే
చెల్లించకుండా మీ ప్రభుత్వము 2014-15
బడ్జెట్ లో రు.100 కోట్లు, 2015-16 బడ్జెట్ లో రు.830 కోట్లు మాత్రమే ఎందుకు కేటాయించింది? ? ఈ విధముగా అయితే ఎన్ని సంవత్సరాలకు ఈ
మొత్తాన్ని చెల్లిస్తారు? రు.6724 కోట్లు వెంటనే బి ఎస్
ఎన్ ఎల్ కు రీఫండ్ జరిగేలా చేసేందుకు కమ్యూనికేషన్సు మంత్రిగా మీరు చేసింది
ఏమిటి?
- టి ఆర్ ఏ ఐ సిఫార్సుల
ప్రకారం 2012-13 సంవాత్సరానికి గ్రామీణ ల్యాండ్ లైన్స్ కు మద్దతుగా బి ఎస్
ఎన్ ఎల్ కు రు.1250 కోట్లు యు ఎస్ ఓ ఫండ్ నుండి చెల్లించాలి. దీనిని ఇంత వరకు
బి ఎస్ ఎన్ ఎల్ కు ఎందుకు చెల్లించలేదు? మీ ప్రభుత్వము కూడా దీని చెల్లింపుకు ఎందుకు ముందుకు రావటం లేదు?
- బి ఎస్ ఎన్ ఎల్ నెట్
వర్క్ విస్తరణకు అవసరమయిన పెట్టుబడికోసం బి ఎస్ ఎన్ ఎల్ కు మీ ప్రభుత్వము
హామీ వుంది నామ మాత్రపు వడ్డీకి అప్పు ఇప్పించవచ్చు గదా! ఎందుకు మీ
ప్రభుత్వము ఈ పని చేయటం లేదు? కార్పొరేత్సుకు రాయితీల మీద రాయితీలిస్తూ వారికి రైతులనుండి
బలవంతముగా భూములు లాక్కొని కట్టబెట్టేందుకు ఆర్డినేన్సుల మీద ఆర్డినేన్సులు
జారీ చేస్తున్న మీ ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు ఎందుకు ఈ వ్విద్ధముగా
తన హామీతో అప్పు ఇప్పించలేక
పోతున్నది?
కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు పునాది వేసింది వాజ్పాయి
ప్రభుత్వము కాగా అవే విధానాలను కొనసాగించి నష్టాలకు దారి తీసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వము.
మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రభుత్వముకన్నా
భిన్నమయినదని అనుకుంటే పైన తెలియజేసిన విధాముగా బి ఎస్ ఎన్ ఎల్ కు న్యాయముగా
చెల్లించాల్సిన రు. 6724 కోట్లు మరియు రు.1250 కోట్లు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ హామీతో బి
ఎస్ ఎన్ ఎల్ కు స్వల్ప వడ్డీకి అప్పు ఇప్పించి ఎక్విప్మెంటు కొనుగోలుకు
సహకరించాలి.
No comments:
Post a Comment