Saturday, November 21, 2015

7వ వేతన సంఘం సిఫార్సులు అసంతృప్తికరం-నిరవధిక సమ్మేకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నిర్ణయం


1.     వేతన సవరణ అమలు తేదీ ---1.1.2016 (ఉద్యోగుల డిమాండ్—1.1.2014)
2.    కనీస వేతనం ---ఋ.18000/- (డిమాండ్ –26,000)
3.    ఫిట్మెంట్ ఫార్ములా—బేసిక్ పే కి 2.57 రెట్లు – (డిమాండ్-బేసిక్ పే కి 3.7 రెట్లు)
4.    వార్షిక ఇంక్రిమెంటు –3 శాతం (డిమాండ్-5 శాతం)
5.    టైమ్ బౌండ్ ప్రమోషన్ –10,20,30 సంవత్సరాలకు (డిమాండ్—8,7,6,5 సంవత్సరాలకు)
6.    పే స్కేల్ స్పాన్ –40 సంవత్సరాలు (డిమాండ్—పే స్కేల్ ఓపెన్ ఎండెడ్ గా, మ్యాగ్జిమమ్ అనే పరిమితి లేకుండా వుండాలి)
7.    గరిష్ట  వేతన పెరుగుదల (బేసిక్ ప్లస్ డి ఏ పై)—14.29 శాతం (డిమాండ్—కనీసం 40 శాతం)
8.    కనీస మరియు గరిష్ట మూల వేతనాలు ---ఋ.18,000 మరియు 2,05,400 (1:11.4) –(డిమాండ్--1:8) 
9.    హెచ్ ఆర్ ఏ –తగ్గించింది (50 లక్షల జనాభాకి మించిన నగరాలకు 30 శాతం వున్నది 24 శాతం కు, 5 నుండి 50 లక్షాల వరకు జనాభా వున్న పట్టణాలకు 20 శాతం వున్నది 16 శాతం కు, 5 లక్షల లోపు వున్న స్టేషన్లకు 10 శాతం వున్నది 8 శాతం కు తగ్గించింది. (డిమాండ్-60, 40, 20 శాతం)
10.  సర్వింగ్ మరియు రిటైర్ అయిన వారికి మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్
11.   గ్రూప్ ఇన్సూరెన్సు స్కీమ్
·         1 నుండి 5 స్కేల్సు లో ఉన్న వారికి—కంట్రిబ్యూషన్ ఋ. 1500; ఇన్సూరెన్సు—ఋ.15 లక్షలు
·         6 నుండి 9 వరకు----కంట్రిబ్యూషన్ 2500; ఇన్సూరెన్సు 25 లక్షలు
·         10 నుండి ---------కంట్రిబ్యూషన్ 5000; ఇన్సూరెన్సు—50 లక్షలు
12.  పెన్షన్ పై సిఫార్సులు
·         పే రివిజన్ కు ముందు రిటైరయిన వారికి తరువాత రిటైరయిన వారితో సమం గా పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ ను ఆమోదించింది. ఇందుకోసం 1.1.2016 కి ముందు రిటైరయిన వారి బేసిక్ పే ని నోషనల్ గా 7 వ వేతన సంఘం సిఫార్సు చేసిన సమానమయిన పే స్కేల్ మినిమమ్ వద్ద ఫిక్స్ చేసి, పాత స్కేల్ లో ఎన్ని ఇంక్రిమెంట్సు డ్రా చేస్తే అన్నీ ఇంక్రిమెంట్సును కొత్త స్కేల్ లో కలిపి(ఇంక్రిమెంటు కు 3 శాతం చొప్పున) రివైజ్డ్ నోశానల్ పే ఫిక్స్ చేసి దాని ప్రకారం పెన్షన్ రివైజ్ చేయాలి. మరో ప్రత్యామ్నాయం, పాత బేసిక్ పెన్షన్ ను 2.57 తో హెచ్చించి దానిని రివైజ్డ్ పెన్షన్ గా నిర్ణయించాలి. ఈ రెండింటిలో ఏది మంచిదనుకుంటే దానికి పెన్షనరు ఆప్షన్ ఇయ్యవచ్చు.
·         కనీస పెన్షన్—9000 (కనీస వేతనం ఋ.18000 లో సగం)
·         డి సి ఆర్ జి సిలింగు ను ఇప్పుడున్న ఋ.10 లక్షలనుండి 20 లక్షలకు పెంచింది.
·         పెన్షనర్స్ ఫిక్సెడ్ మెడికల్ అలవెన్స్ ను పెంచకుండా ఋ.500 నే కొనసాగించింది.
వేతన పెరుగుదల కేవలం 14.29 శాతం మాత్రమే ఇవ్వటం, హెచ్ ఆర్ ఏ శాతం తగ్గింపు తదితర తప్పుడు సిఫార్సులకు వ్యతిరేకముగా 27.11.2015న దేశ వ్యాపిత నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, ఆ తరువాత నిరవధిక సమ్మేకి దిగాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్లు నిర్ణయించాయి.



No comments:

Post a Comment