Friday, March 4, 2022

మార్చి 28, 29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె డిమాండ్స్ పై, అందుకు సంబంధించిన విషయాలపై వివరణ

 


డిమాండ్  అత్యంత స్వల్పమైన మినహాయింపులతో  ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున అమ్మెందుకు మోడి ప్రభుత్వము 4.2.2021న ప్రకటించిన “ఆత్మ నిర్భర భారత దేశం కోసం నూతన ప్రభుత్వ రంగ  సంస్థల విధానం” ను ఉపసంహరించాలి.

ఈ విధానం  ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మక రంగాలకు చెందినవి మరియు  చెందనివి అని రెండు గ్రూపులుగా విభజించింది.

వ్యూహాత్మకం కాని  గ్రూపులో  వున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఎటువంటి మినహాయింపులు లేకుండా  అమ్మాలని  లేదా మూసి వేయాలని అన్నది.

వ్యూహాత్మక రంగాలుగా  (1) అణు విద్యుత్‌, రోదసీ, రక్షణ, (2) .రవాణా, టెలికమ్యూనికేషన్లు, (3)విద్యుత్‌, పెట్రోలియం, బొగ్గు, (4.) బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక సేవలు, ఈ 4 రంగాలను గుర్తించింది.

దీని ప్రకారం ఒక్కో వ్యూహాత్మక రంగం లో అత్యంత కనీస సంఖ్యలో అనగా  ఒక ప్రభుత్వ రంగ సంస్థను, అది  కూడా  హోల్డింగ్ కంపెనీ స్థాయిలో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగించాలన్నది.  మిగతావి అమ్మాలి,  లేదా మూసి వేయాలి,  లేదా  విలీనీకరించాలి (రెండింటిని కలిపి ఒకటిగా చేయటం), లేదా హోల్డింగ్ కంపెనీకి  సబబ్సిడియరీ కంపెనీ గా చేయాలి. [(A)అనే కంపెనీకి (B)అనే కంపెనీలో  మెజారిటీ వాటాలుంటే A ని హోల్డింగ్ కంపెనీ అని, B ని సబిడియరీ కంపెనీ అంటారు] హోల్డింగ్ కంపెనీలు తమ వాటాలలో 25 శాతం అమ్మ వచ్చునని,   తమ సబ్సి డియరీ కంపెనీలను అమ్మటంలో జాప్యం నివారించ వచ్చునని హోలింగ్ కంపెనీ ఏర్పాటు వెనుక నున్న  ఉద్దేశం.

వ్యూహాత్మక రంగ మైన టెలికాం రంగం లో వున్న బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, ఐటిఐ, టిసిఐఎల్, బిబిఎన్ఎల్ (భారత్ బ్రాడ్ బ్యాండ్  నెట్ వర్క్ లిమిటెడ్) లలో ఏదీ ఇప్పటి రూపం లో వుండదు. వీటిలో దేనిని అమ్మాలి, దేనిని మూసి  వేయాలి, దేనిని హోలింగ్ కంపెనీగా గుర్తించాలి, దేనిని సబ్సిడియరీ  కంపెనీగా గుర్తించాలి,  దేనిని  మరో దానితో విలీనం చేయాలి అనేది ప్రభుత్వము నిర్ణయిస్తుంది.

ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్యని,  జాతీయ బ్యాంకులు మరియు  జాతీయ ఇన్సూరెన్సు కంపెనీలతో సహా,  కనీస స్థాయికి కుదించి, ఆ స్థానం లో ప్రయివేటు సెక్టర్ కు పెట్టుబదులు  పెట్టె చోటును సృష్టించటమే తమ  విధానపు లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్  ప్రసంగం లో ప్రకటించారు. (“Minimising the presence of Central Government Public Sector Enterprises including financial institutes and creating new investment space for private sector ”)

 పెట్టుబడి అంతా తామే పెట్టలేము కాబట్టి విదేశి పెట్టుబడి భాగస్వామ్యముతోనే పెట్టుబడులు పెట్టగలమని భారత బడా పెట్టుబడి దారులు అంటున్నందున మోడి ప్రభుత్వము అనేక  రంగాలలో విదేశీ పెట్టుబడిని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నది. టెలికాం రంగం లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తున్నది. తమ అవారాల  కోసం  మరి కొంత  విదేశీ పెట్టుబడి ని తమ కంపెనీలో  పెట్టాలీ వస్తున్నదని, అను వలన  తమ కంపెనీలో విదేశీ  పెట్టుబడి వాటా 51 శాతానికి మించుతుంది కాబట్టి  దానిని విదేశీ కంపెనీగా చేసేందుకు అనుమతించాలని ఎయిర్టెల్ కోరగా  ప్రభుత్వము అంగీకరించింది. కాబట్టి ఇది ప్రయివేటీకరణయెగాక  విదేశీకరణ కూడా.

ప్రపంచ వ్యాపితముగా 2008 నుండి కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ఇప్పుడు మరింత పెరుగుతున్నందున ఈ పరిస్థితిలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని పెంచినా మార్కెట్ లో కొనుగోలుశక్తి లేనందున తమకు లాభాలు రావు కాబట్టి  ప్రయివేటీకరణలో లాభాలు వచ్చేలా  చూడాలని  స్వదేశీ, విదేశీ కార్పొరెట్సు కోరగా అందుకనుగుణముగా ఈ విధానాన్ని మోడి  ప్రభుత్వము ప్రకటించింది.  

ఒక వంక స్వాతంత్ర్యపు అమృత మహోత్సవం అంటూనే మరో వంక స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో  నిర్మించబడి,  మన ఆర్థిక స్వావలంబనకు, ప్రజా సంక్షేమానికి  పునాదిగా వున్న మన జాతీయ సంస్థలయిన   ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం, జాతీయ బ్యాంకులను జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలను అమ్మటం  ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక చర్య. టెలికాం రంగం లో జరుగుతున్న పోటీలో ఇతర ప్రయివేట్ కంపెనీలన్నీ నిష్క్రమించగా రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా- ఈ 3 సంస్థలు  90శాతం మార్కెట్ తో గుత్తాధిపత్యం సాధించాయి.   

 కేంద్రం లో వున్న కాంగ్రెస్ మరియు బిజెపి ప్రభుత్వాల  విధానాలు   ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం  చేసేవిగా వున్నందున   బిఎస్ఎన్ఎల్ కు మార్కెట్ వాటా క్రమముగా తగ్గుతూ ఇప్పుడు  10 శాతమే వున్నది.  ప్రభుత్వ రంగ సంస్థలు లేకుంటే  గుత్తాధిపత్య సంస్థలు కుమ్మక్కై టెలికాం సేవల ధరలు పెంచి ప్రజలకు టెలికాం సౌకర్యాలు అందుబాటులో లేకుండా చేస్తాయి. ప్రజలందరికి  ఇంటర్నెట్ ప్రాధమిక హక్కుగా అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని కరోనా సంక్షోభం వలన  అందరూ గుర్తించినా, ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి లేకుండా చేసే ఈ విధానాల వలన ఈ లక్ష్యం నేర వెరదు.  

కాబట్టి మన దేశ ప్రయోజనాలను, ప్రజా ప్రయోజనాలను, మన ప్రయోజనాలను  కాపాడేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను అందులో  భాగముగా బిఎస్ఎన్ఎల్ ను కాపాడుకోవాలి. ఇందుకోసం  మనము కేంద్ర కార్మిక సంఘాలు మరియు అన్ని రంగాల యూనియన్లు, ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 28, 29 న జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని,  మన దేశ భక్తిని  ప్రకటించాలని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరికి విజ్ఞప్తి చేస్తున్నాము.

ప్రజలను కాపాడాలి! దేశాన్ని కాపాడాలి!!

బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్  యూనియన్, ఆంధ్ర ప్రదేశ్  సర్కిల్

No comments:

Post a Comment