Wednesday, December 14, 2011

డిసెంబరు 15న సమ్మెలో పాల్గొనండి, విధానాలను మార్చండి


ఫ్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ ను లూటీ చేస్తున్నది.

చైనా లో అక్కడి ప్రభుత్వము ప్రభుత్వరంగ సంస్థ చైనా టెలికం కు 3జి స్పెక్ట్రం ను ఉచితంగా ఇచ్చిందికానీ భారత ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ నుండి 3జి స్పెక్ట్రం కు రు.10100 కోట్లు వసూలు చేసిందిప్రయివేటు కంపెనీలు ఎయిర్టెల్, వొడఫోన్, ఐడియా లు అనేక సర్కిల్సులో 3జి స్పెక్ట్రంకు చెల్లించాల్సిన రు. 20000 కోట్లు పైగా చెల్లించకుండానే చట్టవిరుద్ధంగా 3జి సర్వీసులిస్తున్నా కళ్ళు  మూసుకున్నది. నాసిరకం బి డబ్ల్యు   స్పెక్ట్రం ను బి ఎస్ ఎన్ ఎల్ కు అంటకట్టి మరో రు 8400 కోట్లు వసూలు చేసింది.

వాస్తవంగా ఇవ్వకుండా ఇచ్చినట్లుగా లెక్కలలో చూపించిన ఊహాజనిత రుణం పేరుతో ఇప్పటికి బి ఎస్ ఎన్ ఎల్ నుండి రు 7500 కోట్లు  వసూలు చేసింది. ఇప్పుడు 14.5 శాతం వడ్డీ తో సహా ఆఖరు వాయిదాగా మరొ రు 1100 కోట్లు వసూలు  చేస్తున్నది.  ఇందుకోసం  బ్యాంకు నుండి అప్పు తేవాల్సిన పరిస్థితి లో బి ఎస్ ఎన్ ఎల్ వున్నది

తన వాగ్దానాన్ని ఉల్లంఘించి, బి ఎస్ ఎన్ ఎల్ కు చెల్లించాల్సిన లైసెన్సు  ఫీజు రీయింబర్సుమెంటును పూర్తిగా రద్దు చేసింది. దాని విధానాలు ప్రయివేటు కంపెనీలు బి ఎస్ ఎన్ ఎల్ కు చెల్లిస్తున్న ఎడిసి రద్దుకు దారి  తీశాయి. లైసెన్సు  ఫీజు, ఎడిసి ల రద్దు వలన బి ఎస్ ఎన్ ఎల్ కు సంవత్సరానికి రు 7200 కోట్లు ఆదాయం తగ్గింది.
మొబైల్ సేవల విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొననీయకుండా ఆటంకాలు సృష్టించి ఆపుచేసింది. ఫలితంగా మార్కెట్లొ బి ఎస్ ఎన్ ఎల్ స్థానం 2 నుండి 5  కు దిగజారింది.
డిఓటి కి ఆప్షను ఇచ్చిన ఐ టి ఎస్   అధికారులను రిలీవ్ చెయ్యకుండా నెలల తరబడీ జాప్యం చేస్తూ అనిశ్చిత   పరిస్థితిని కొనసాగిస్తున్నది, బి ఎస్ ఎన్ ఎల్ కు దృఢ నిశ్చయంతో పని చేసే  మేనేజిమెంటు లేకుండా చేసింది.
ఈ లూటీ వలన బి ఎస్ ఎన్ ఎల్ కు 2009-10లో రు.1823 కోట్లు, 2010-11 లో రు.6384 కోట్లు నష్టం  వచ్చింది.
తాను సృష్టించిన ఈ నష్టాలకు  బాధ్యులు ఉద్యోగులేనని  తప్పుడు ప్రచారం చేస్తున్నది. లక్షమంది ఉద్యోగులను వి ఆర్ ఎస్  పేరుతో తొలగించాలనే సిఫార్సును  బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటుతో బలవంతంగా చేయించింది. దీని అమలు  కోసం చేయాల్సిన  రు.11000 కోట్లు అప్పు బి ఎస్ ఎన్ ఎల్ పై మరో భారంగా తయారవుతుంది. ఇంతేగాక, లక్షమంది ఒకేసారి రిటైరయితే పెన్షన్ ఖర్చు విపరీతంగా పెరిగి అందులో కొంత భాగాన్ని , సుమారు రు.2000 కోట్లు మేరకు బి ఎస్ ఎన్ ఎల్ భరించాల్సి వస్తుంది. బి ఎస్ ఎన్ ఎల్ కు మరింత నష్టాలు సృష్టించి ఆ తరువాత చవుకగా అమ్మేందుకే వి ఆర్ ఎస్ ను ముందుకు తెస్తున్నది.
వి ఆర్ ఎస్ తీసుకునే ఉద్యోగికి ఎక్స్ గ్రేషియా  సొమ్ము పై వచ్చే వడ్డీ, పెన్షనూ రెండూ కలిపినా అతను సర్వీసులో కొన సాగితే వచ్చే జీతం కన్నా చాలా తక్కువ వుంటుంది. ముందుగానే  తక్కువ బేసిక్ పే తో రెటైరవుతున్నందున  పెన్షన్ కూడ తక్కువ వస్తుంది. ఉద్యోగికి  చాలా నష్టం జరుగుతుంది. 
నష్టాలు  వస్తున్నయని చెప్పి మేనేజిమెంటు ఉద్యొగులకు  వేతన సవరణను పే+78.2% శాతం డి ఏ పై కాకుండా పే+68.8 శాతం డి ఏ ప్రాతిపదిక పై కుదించింది. 2009-10, 2010-11 సంవత్సరాలకు బోనస్  నిరాకరించింది. ఎల్ టి సి, ఎల్ టి సి సందర్భంగా లీవు ఎన్ క్యాష్మెంటు,  మెడికల్ అలవెన్సు రద్దు చేసింది.
ప్రభుత్వరంగ సంస్థలను సహజవనరులను లూటీ చేసి ప్రజల పై మరిన్ని భారాలు మోపి సంపన్నులకు అక్రమ లాభాలు అందించేందుకు 'సంస్కరణ"ల పేరుతో అమలు చేస్తున్న విధానాలలో భాగంగానే బి ఎస్ ఎన్ ఎల్ పై, ఉద్యోగులపై ఈ దాడి జరుగుతున్నది. అమెరికాలో, యూరపులో, అదే విధంగా భారత దేశంలో ఈ విధానాలకు కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈ ఇబ్బందులను నివారించే పేరుతో పెట్టుబడిదారీ ఆనుకూల  పాలకవర్గ రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు మరింత సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ప్రజా వ్యతి రేక విధానాలను తిప్పికొట్టేందుకు  అమెరికాలో, యూరపు లో, భారత దేశంలో ఇంకా అనేక దేశాలలో పోరాటాలు జరుగుతున్నాయి.  అన్ని రంగాలలో పోరాటాలు జరుగుతున్నాయి. వీటిని  మార్చకపోతే మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి 15 డిసెంబరున సమ్మె చేసి ఈ విధానాలకు అసమ్మతి తెలియ చేద్దాం.  నీ విధానాలను  మార్చుకోవాల్సిందేనని ప్రభుత్వాన్ని హెచ్చరించుదాం. బి ఎస్ ఎన్ ఎల్ లో వున్న  ఎక్జిక్యూటివ్,  నాన్-ఎక్జిక్యూటివ్ యూనియన్లన్నీ   ఈ సమ్మెకి పిలుపు నిచ్చాయి.
డి15 న సమ్మె చేసి మన భవిష్యత్తును నాశనం చేస్తున్న తప్పుడు విధానాలకు   నిరసన తెలియ చేయండి.



No comments:

Post a Comment