Wednesday, January 4, 2012

టెలికం రంగంలో మహా దోపిడీ

1991లో ప్రవేశ పెట్టిన సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీ కరణ విధానాలు ప్రభుత్వ ఖజానా, ఆర్థిక వ్యవస్థ, సహజ వనరులు లూటీ కావడానికి, భారత దేశం నుండి విదేశాలకు వనరులు ఊహించశక్యం కాని రీతిలో తరలిపోవడానికి దోహదం చేశాయి. విపరీతమైన స్థాయిలో లూటీ జరిగిన రంగాల్లో టెలికం రంగం ఒకటి.

1.      1991 టెలికం కుంభకోణం:

ప్రయివేటు టెలికం కంపెనీలు నిశ్చిత లైసెన్స్‌ ఫీజు స్థానంలో తమకు లభించిన ఆదాయం ప్రాతిపదికగా సుంకం చెల్లించేందుకు అనుమతిస్తూ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 1999లో ఒక కొత్త టెలికం విధానాన్ని ప్రవేశపెట్టింది. విధానం వల్ల ప్రభుత్వం రు.43,523.92 కోట్ల ఆదాయం నష్టపోయిందని కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి 2011 నవంబర్‌ 23 ప్రత్యేక ప్రతిపత్తి లేని (అన్‌స్టార్డ్‌) ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

సిఎంటిఎస్‌ లైసెన్స్‌లు:

 .   సెల్యులార్‌ మొబైల్‌ టెలిఫోన్‌ సర్వీసులు పది సంవత్సరాలపాటు ఒకే మొత్తంగా చెల్లించాల్సిన స్థిరమైన ఫీజు రు. 30,942.12 కోట్లు.

 బిపది సంవత్సరాల్లో కంపెనీలు వాస్తవంగా చెల్లించిన లైసెన్స్‌ ఫీజు (రెవెన్యూ పంపిణీ ప్రాతిపదిక ప్రకారం) రు. 11,234.90 కోట్లు.

 సిప్రభుత్వ ఖజానాకు సంభవించిన నష్టం రు. 19,257.22 కోట్లు.

స్థిరమైన టెలీఫోన్‌ లైసెన్స్‌లు:

 .   15 సంవత్సరాల లైసెన్స్‌ కాలపరిమితికిగాను స్థిరమైన టెలీఫోన్‌ సర్వీసుల లైసెన్స్‌లకు చెల్లించాల్సిన ఫీజు రు. 27,862.50 కోట్లు.

 బి.    కంపెనీలు 15 సంవత్సరాల కాలపరిమితికి రెవెన్యూ పంపకం ప్రాతిపదికన వాస్తవంగా చెల్లించిన మొత్తం రు.3,595.80 కోట్లు.

సి.    ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం రు. 24,266.70 కోట్లు.
ఇది బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ప్రయివేటు టెలికం ఆపరేటర్లు లూటీ చేసిన మొత్తం.

2.     2జి కుంభకోణం:

కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో 2జి కుంభకోణం జరిగింది. 2జి స్పెక్ట్రమ్‌ను కారు చౌక ధరకు కొన్ని టెలికం కంపెనీలకు 2008లో కేటాయించడం ద్వారా కుంభకోణం చోటుచేసుకుంది. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) అంచనాల ప్రకారం ప్రభుత్వానికి కుంభకోణం వల్ల ఒనగూడిన నష్టం రు.1,76,000 కోట్లు.

3.     3జి కుంభకోణం:

3జి స్పెక్ట్రమ్‌ కింద 13 సర్కిల్స్‌కు గాను ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించింది. 20 సర్కిల్స్‌లో 3జి సర్వీసులు అందజేస్తోంది. వోడోఫోన్‌ 11 సర్కిల్స్‌కు చెల్లించి 20 సర్కిల్స్‌కు సర్వీసులు సమకూరుస్తోంది. ఐడియా తొమ్మిది సర్కిల్స్‌కు చెల్లించి 19 సర్కిల్స్‌లో సర్వీసులు అందజేస్తోంది. మూడు కంపెనీలు తమలో తాము రోమింగ్‌కు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సంబంధిత సర్కిల్‌లో 3జి సర్వీసులు అందించేందుకు స్పెక్ట్రమ్‌ లేకపోయినప్పటికీ సర్కిల్‌లోని ఇతర కంపెనీలకు గల స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకుని సర్వీసులను అందజేస్తోంది. లైసెన్స్‌ కేటాయింపు నిబంధన ప్రకారం కంపెనీ తాను 3జి స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం నుండి కొనుగోలు చేసిన సర్కిల్‌లోనే సర్వీసులను అందజేయాల్సి ఉంది. స్పెక్ట్రమ్‌ను ఇతర కంపెనీలతో పంచుకోకూడదు. మూడు కంపెనీలు కలసి రు. 20,000 కోట్ల మేరకు ప్రయోజనం పొందినట్లు అంచనా వేశారు.

4.     విదేశాలకు వనరుల తరలింపు:
ప్రయివేటు టెలికం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకునేందుకు అవసరమైన పరికరాలను విదేశీ టెలికం ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేశాయి. ఫలితంగా ఐటిఐ వంటి దేశవాళీ ఉత్పత్తి పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. టెలికం రంగంలో దేశీయ పరిశోధన, అభివృద్ధి దాదాపు స్తంభించిపోయాయి. ట్రాయ్  అంచనా ప్రకారం 2004-05 నుండి2008-09 వరకు గల మధ్య కాలంలో టెలికమ్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు వినియోగించిన పరికరాల మొత్తం విలువ రు. 3,03,963 కోట్లు. ఇందులో దేశీయ కంపెనీల నుండి కొనుగోలు చేసిన మొత్తం పరికరాల విలువ రు. 34,031 కోట్ల మాత్రమే.

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా మంత్రి మిలింద్‌ దేవరా 2011 డిసెంబర్‌ 7 లోక్‌సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం 2009-10, 2010-11లో విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పరికరాల ఖరీదు రు.95,172 కోట్లు. దేశంలో ఉత్పత్తి చేసిన పరికరాల విలువ రు. 1,04,275 కోట్లు. పరికరాలను భారతదేశంలో ఉత్పత్తి చేసినప్పటికీ ఇందులో ఎక్కువ భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పరికరాలను అసెంబుల్‌ చేసి తయారుచేసినవే ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోని కర్మాగారాల్లో అసెంబుల్‌ చేసేందుకు ఉద్దేశించిన పరికరాలను దిగుమతి చేసుకోవడానికి అయిన ఖర్చు ఎనభై వేల కోట్ల రూపాయలు. అంటే, 2009-10, 2010-11ల్లో రు. 1,75,172 కోట్ల మొత్తాన్ని టెలికం పరికరాల దిగుమతులకు ఖర్చు పెట్టారు. 2005-05 నుండి 2010-11 వరకు దిగుమతి చేసుకున్న పరికరాల విలువ రు.4,50,510 కోట్లు1997- 98 నుండి 2003-04 వరకు దిగుమతి చేసుకున్న పరికరాల విలువ రు. 2,25,255 కోట్లు ఉంటే, 1997-98 నుండి 2010-11 వరకు దిగుమతి చేసుకున్న పరికరాల విలువ రు. 6,75.765 ఉంటుంది.

ఎంతమొత్తం లూటీ అయింది?

బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో రు. 43,523 కోట్లు, యుపిఎ ప్రభుత్వ హయాంలోని 2జి కుంభకోణంలో రు. 1,76,000 లక్షలు, 3జి కుంభకోణం కింద రు. 20,000 కోట్లు - మొత్తంమీద రు. 6,75,765 కోట్లు విదేశాలకు తరలిపోయింది. 1993 నుండి 1996 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కమ్యూనికేషన్స్‌ శాఖా మంత్రిగా సుఖ్‌రాం ఉన్న సమయంలో సంభవించిన నష్టాన్ని కూడా దీనికి జోడించాల్సి ఉంటుంది.
-పి.అశోక్‌బాబు
(రచయిత బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల యూనియన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ)

  

No comments:

Post a Comment