Monday, June 9, 2014

ప్రధానమంత్రి నరెంద్ర మోడి గారి ముఖ్య కార్యదర్శి నియామకం కథ

ప్రధాన మంత్రి  నరేన్ద్ర  మోడీ తన ముఖ్య కార్యదర్శిగా టి ఆర్ఎఐ  మాజి చైర్మన్ శ్రీ నృపేన్ద్ర మిశ్రా ను నియమించారు.  అయితె ఈ నియామకం చాలా అసాధారణ మయిన రీతిలో,పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకువిరుద్ధమయిన పద్ధతిలో  జరిగింది. టిఆర్ఎఐ చట్టం ప్రకారం టిఆర్ఎఐ చైర్మన్ గా చేసిన వ్యక్తి ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వికరించ కూడదు.  ఈ నిషేధాన్ని వాజపాయి నాటి  ఎన్డిఏ ప్రభుత్వమే  అమలులొకి తెచ్చింది. కాని ఇప్పుడు  మోడి ప్రభుత్వము నృపేన్ద్ర మిశ్రా గారిని ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్సిగానియమించేన్దుకు  ఆటంకముగా వున్నఈ చట్టా న్ని సవరిస్తూ ఆర్డి నెన్సును తెచ్చింది.  తాము అధికారములోకిరావటానికి ముందు మన్మొహన్ సింగు ప్రభుత్వము ఏదయినా ఆర్డినెన్సు ను తెస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రముగా వ్యతిర్రెకించిన బిజెపి ఇప్పుడు ఒక వ్యక్తికోసం చట్టాన్నే సవరిస్తూ  ఆర్డినెన్స్  తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శిగా చేయగల సమర్థులు దేశం  లో ఇంకెవరూ లేరా?

ఇంతకీ నృపెంద్ర మిశ్రాగారి విశిష్టత ఏమిటి? బి జె పి 2 జి కుంభకోణాన్ని తీవ్రముగా విమర్శించింది. ఈ2జి కుంభకోణానికి, నృపెంద్ర మిశ్రాగారికి అవినాభావ సంబంధమున్నది.  నృపేన్ద్ర  మిశ్రా గారు చైర్మన్గా వున్నప్పుడు 2007 లొ టిఆర్ఏఐ ఒక సిఫార్సు చేసింది. దీనిప్రకారం 2జి స్పెక్ట్రం ను 2001 నాటి  ధరకే కేటాయించాలి. టిఆర్ఏఐ చేసిన ఈ సిఫార్సు2జి కుంభకొణానికి తోడ్పడిందని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇటువంటి నృపేన్ద్ర మిశ్రా గారిని  చట్టాన్ని అప్రజాస్వామికముగా ఆర్డినెంసు ద్వారా సవరించిముఖ్యకార్యదర్శిగా నియమించాల్సిన అవసరం  ఏమొచ్చింది?  టిఆర్ఏఐ చైర్మన్ గా రిటైర్ అయిన అనంతరం సదరు నృపేన్ద్ర మిశ్రాగారు ఆర్ఎస్ఎస్ నడుపుతున్న “వివేకానంద కేన్ద్ర” కు ఎగ్జిక్యూటివు కవుంసిల్  సభ్యులుగా పని చేస్తున్నారు. కాబట్టి నృపేన్ద్ర మిశ్రా గారు ఒక వంక కార్పొరేట్సుకు  అడ్డగోలుగా  సేవలందించగల సామర్థ్యం, మరోవంక ఆర్ ఎస్ ఎస్ కు అనుకూలముగాపని చేయగల సామర్థ్యం గల టు-ఇన్-వన్. కాబట్టే అతనిని అప్రజాస్వామికముగానయినా సరే ప్రధానమంత్రిముఖ్య కార్యదర్శిగా మోడీగారు నియమించారు! కార్పొరేట్సే మరియు ఆర్ఎస్ఎస్ లకు సేవ చేయటానికి పారదర్శకత, సత్సాంప్రదాయం మొదలగువాటితో పని లేదని,ఆడ్డగోలుగానయినా సరే వారికి సేవలందించి తరించాలని దీని  సారాంశం.

  

No comments:

Post a Comment