Saturday, October 22, 2022

పాతాళానికి రూపాయి..! (ప్రజాశక్తి 21.10.2022 తేదీ సంచిక సంపాదకీయం)


Oct 21,2022 07:14

అంతర్జాతీయ ద్రవ్య విపణిలో రూపాయి విలువ రోజురోజుకీ వెలవెలబోతూ...రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రూపాయి చరిత్రలోనే ఇది అత్యంత కనిష్టం. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 83.20కి క్షీణించింది. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 79 పైసలు కోల్పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతుంది. రూపాయి విలువ తగ్గుతున్నకొద్దీ దిగుమతుల విలువ పెరుగుతూ పోతుంది. మన దేశ అవసరాల్లో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం కనుక చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయి. దాంతో ఇంధన వ్యయం, రవాణా ఖర్చు పెరిగి, అన్నిటి ధరలూ ఆకాశానికి ఎగబాకుతాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కష్టాలు మరింత పెరుగుతాయి. ఇంకోవైపున ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న పేరుతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. గడచిన మూడు ద్రవ్య సమీక్షల్లోనూ రిజర్వు బ్యాంకు రెపో రేటు పెంచుతూనే పోతోంది. భవిష్యత్తులోనూ ఆ దారినే కొనసాగించవచ్చు. అందువల్ల వడ్డీలు పెరిగి గృహ నిర్మాణానికో లేక ఇతర అవసరాలకో బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారికి పెను భారమవుతుంది. కొత్తగా అప్పులు పుట్టడమూ కష్టమే అవుతుంది. దిగుమతుల విలువ పెరిగిపోవడంతో దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. విదేశీ వాణిజ్య లోటు పెరగడంతోపాటు ప్రభుత్వానికి ద్రవ్య లోటు కూడా పెరుగుతుంది. దాంతో ప్రజలకిచ్చే సబ్సిడీలకు, ఇతర రాయితీలకు కోతలు పెట్టడం లేదా మంగళం పాడడమో జరుగుతుంది. ఇలా ఎటు చూసినా జనానికి బాదుడే !


 డాలర్‌ బలపడడంవల్ల దాని విలువ పెరగడంతో రూపాయి విలువ తగ్గుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జనాన్ని మభ్య పెడుతున్నారు. ఒకవేళ డాలర్‌ మాత్రమే బలపడితే రూపాయి మారకం విలువ దానితోనే పడిపోవాలి. కాని పౌండ్‌, యూరోతోనూ ఎందుకు దిగజారుతోంది? రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారమే నెల రోజుల క్రితం అంటే సెప్టెంబర్‌ 20న ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా చలామణీ అయ్యే డాలర్‌, పౌండ్‌, యూరోలకు రూపాయి మారకపు విలువ వరుసగా 79.68, 91.16, 79.95గా ఉండగా అక్టోబర్‌ 20న 83.20, 93.36, 81.42కు దిగజారింది. బ్రిటన్‌ ప్రధానమంత్రి రాజీనామా చేయవలసినంతగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా పౌండ్‌తో రూపాయి మారక విలువ దిగజారిందంటే సాధారణ పరిస్థితులే ఉంటే ఏమయ్యేదో! అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించడం సంఘపరివార్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ కుదురు నుండి వచ్చిన ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతోందని, మరోవైపు అమెరికా బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ఈ దేశంలోని పెట్టుబడులు వెనక్కు తీసుకుపోవడం మూలంగా రూపాయి బలహీనపడుతోందన్నది విశ్లేషకుల మాట. ఏ దేశంలోనైనా కరెన్సీ విలువ తరగడం, ద్రవ్యోల్బణం పెరగడం జరిగితే అక్కడ విదేశీ పెట్టుబడులు నిలవవని ప్రపంచ అనుభవం చెబుతోంది. కాబట్టి ఇదో విష చక్రం. పర్యవసానంగా రూపాయి విలువ మరింత దిగజారడం, ధరలు ఇంకా ఇంకా పెరగడానికే దారి తీస్తుంది.


          నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు వల్లనే దేశానికి ఈ దుస్థితి దాపురించింది. 1991 నుండి మన పాలకులు ఈ విధానాలు అమలు చేస్తున్నా నరేంద్ర మోడీ గద్దెనెక్కాక మరింత వేగవంతమయింది. ఉదాహరణకు 2014 మే నెలలో మోడీ అధికారానికి వచ్చినప్పుడు ఒక డాలరుకు 58.75 రూపాయలు కాగా ఎనిమిదేళ్ల తరువాత గడచిన బుధవారంనాడు డాలరు విలువ రూ. 83.20కి పెరిగింది. ఎనిమిదేళ్లలో డాలరుతో రూపాయి విలువ 41.61 శాతం దిగజారిందన్నమాట. ఇదీ మోడీ పాలనా ఘనత! ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాలి. కాని, ఈ ప్రభుత్వం తనంతట తాను అందుకు పూనుకోదు కనుక ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావాలి. అది తప్ప వేరు దారి లేదు. (ప్రజాశక్తి 22.10.2022 తేదీ సంపాదకీయం)





Sunday, August 14, 2022

స్వాతంత్ర్యోద్యమం లో కార్మిక వర్గం పాత్ర -నేటి కర్తవ్యం

స్వాతంత్ర్యోద్యమం లో కార్మిక వర్గం పాత్ర -నేటి కర్తవ్యం

 

15.08.2022 న భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలవుతున్నది.  ఈ సందర్భముగా స్వాతంత్ర్యోద్యమం లో కార్మిక వర్గం నిర్వహించిన గర్వించదగిన పాత్ర ని గురించి తెలుసుకుందాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలయిన సందర్భములో  నేటి పరిస్థితిని పరిశీలించి మన కర్తవ్యాలను నిర్దేశించు కుందాం 

రెగ్యులర్ సభ్యత్వమునిర్మాణ పరమైన వ్యవస్థకార్యవర్గము గల ఆధునిక ట్రేడ్ యూనియన్ లేకున్నా జరిగిన సమ్మెలు 

పెట్టుబడి దారీ ఉత్పత్తి విధానం లో వున్న సహజ లక్షణం వర్గ పోరాటం. కాబట్టి ఆధునిక ట్రేడ్ యూనియన్  ఆ నాటికి లేనప్పటికి  భారత కార్మిక వర్గము 1875 నుండి 1915 వరకు వివిధ రకాల నాయకత్వాల అధ్వర్యములో    అనేక పోరాటాలు చెసింది. 1877 లో ఎంప్రెస్ మిల్స్నాగపూర్ కార్మికులు  సంపూర్ణమైన సమ్మె చేశారు.  1880 లో పూనా లో పోస్టల్ ఉద్యోగులు చెదురు మదరుగా సమ్మె చేశారు. 1882 నుండి 1890 వరకు బొంబాయి మరియు మద్రాసు ప్రెసిడెన్సీ లలో 25 సమ్మె లు జరిగాయి. 1905 నుండి 1909 వరకు బొంబాయి టెక్స్ టైల్ మిల్లులు మరియు ఇతర మిల్సు లో అనేక సమ్మె లు జరిగాయి.  1908 లో ఇండియన్ టెలి గ్రాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యములో టెలిగ్రఫిస్ట్ లు 10 రోజులు సమ్మె చేశారు . బొంబాయి పోస్ట్ మెన్ 1920 సెప్టెంబరు నుండి మొత్తం  145 రోజులు  సమ్మె చేశారు.

కార్మికోద్యమానికి దూరముగా వున్న జాతీయ ఉద్యమం 

జాతీయ ఉద్యమం లో స్వదేశీ పెట్టుబడిదారులు కూడా ఉంటారు కాబట్టి కార్మిక  సమస్యలపై  కృషి చేస్తే పెట్టుబడిదారులు దూరమవుతారని అందువలన జాతీయ ఉద్యమ ఐక్యత దెబ్బ  తింటుందనే  అభిప్రాయం తో ఆ నాటి జాతీయ ఉద్యమ నాయకులున్నారు. విదేశీ కంపెనీలలో  పని చేసే కార్మికుల  సమస్యల పట్ల ఆసక్తి చూపించి,  స్వదేశీ కంపెనీల  కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు. సంఘ సంస్కరణలుకార్మిక సమస్యలువర్గ పోరాట సమస్యలు కాంగ్రెస్ పట్టించుకోకూడదనిస్వతంత్రం కోసం పోరాడటమే  లక్ష్యముగా వుండాలనిమిగతా సమస్యలను అందుకు సంబంధించిన వేదికల ద్వారా పరిష్కరించుకోవాలని 1886 లో  అఖిల భారత కాంగ్రెస్ 2వ మహాసభకు అధ్యక్షత వహించిన  దాదాభాయ్ నౌరోజీ అన్నారు.

ఫ్యాక్టరీ కార్మిక చట్టం, 1881 మరియు 1891 లను బ్రిటిష్ ప్రభుత్వము చేసినప్పుడు అందువలన స్వదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలు దెబ్బ తింటాయనిజాతీయ ఉద్యమం లో అనైక్యత వస్తుందని జాతీయ వాద పత్రికలు ఈ చట్టాలను వ్యతిరేకించాయి. ఈ చట్టాల ప్రకారం  పని గంటలు తగ్గిస్తే స్వదేశీ పరిశ్రమలు తయారు చేసే సరుకుల ధర పెరుగుతుందనిబ్రిటన్ నుండి దిగుమతి చేయబడుతున్న    సరుకుల ధర తగ్గి స్వదేశీ పరిశ్రమలు దెబ్బ తింటాయని వీరి అభిప్రాయం. భారత దేశము దారిద్ర్యం నుండి బయటపడేందుకు సత్వర పారిశ్రామిక అభివృద్ధి జరగాలనికాబట్టి ఈ చట్టాలు మన   దేశానికి వ్యతిరేకమై నవని వీరి అభిప్రాయం. వర్గ ప్రయోజనాలు ఏ విధముగా ఉద్యమాలను ప్రభావితం చేస్తాయో దీనిని బట్టి రుజువవుతున్నది. 1899 మేలో  ది గ్రేట్ ఇండియన్  పెనిన్సులర్ రైల్వే లో  సిగ్నలర్లు పని గంటలు తగ్గించాలనిజీతాలు పెంచాలని కోరుతూ చేసిన సమ్మెకు ఆ రైల్వే  యాజమాన్యం విదేశీ ది కాబట్టి జాతీయ పత్రికలు సమ్మేని సమర్థించాయి. 

మొదటి  ఆధునిక ట్రేడ్ యూనియన్ 

1918 లో మాత్రమే భారత దేశం లో మొదటి ఆధునిక ట్రేడ్ యూనియన్ ఏర్పడింది. అని బిసెంట్ గారి సహచరుడైన బి.పి.వాడియా “మద్రాస్ లేబర్ యూనియన్” ను ఏర్పాటు చేశారు. ఈ యూనియన్ కు బకింగ్ హామ్ కర్నాటిక్ మిల్సు కార్మికులలో 1600 మంది సభ్యులున్నారు. నిర్మాణ పరమైన వ్యవస్థ  మరియు కార్యవర్గము ఉన్నది.       

స్వాతంత్ర్య పోరాట యోధుడు లోకమాన్య తిలక్ కు జైలు శిక్ష విధించినందుకు నిరసనగా మహత్తర పోరాటం:

ఆర్థిక పరమైన డిమాండ్స్ కోసమే గాక,  స్వాతంత్ర్య పోరాటం ప్రభావం వలన రాజకీయపరమైన సమ్మెలు కూడా జరిగాయి.  లోకమాన్య బాలగంగాధర తిలక్ కు  రాజ ద్రోహం పేరుతో బ్రిటిష్ పాలకులు 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించగా అందుకు వ్యతిరేకముగా సంవత్సరానికి ఒకటి చొప్పున 6 రోజుల సమ్మెని బొంబాయి కార్మిక వర్గం ప్రకటించింది.  1908 జులై లో బొంబాయి నగరాన్ని మూసి వేసినంతటి తీవ్ర స్థాయిలొ కార్మికులు సమ్మె చేశారు.  బొంబాయి బట్టల మిల్లులు మరియు రైల్వే వర్క్ షాప్  కార్మికులందరూ సమ్మె చెశారు. ఈ సమ్మెని అణచి వేసేందుకు సైన్యాన్ని పిలిచారు. సైన్యం కాల్పుల వలన బొంబాయి వీధులలో 16మంది  చనిపోయారు,  50 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ పోరాటానికి మద్దతుగా బొంబాయి నగరం లొ వున్న చిన్న వ్యాపారులుమధ్య తరగతి ప్రజలు కార్యాచరణలోకి దిగారు.    కార్మిక వర్గం తన ఆర్థిక పరమైన డిమాండ్స్ కోసం మాత్రమే గాక రాజకీయ పరమైన పోరాటాలు కూడా చేసే దశకి ఎదిగినట్లు ఈ పోరాటం రుజువు చేసింది. ప్రజలని సమీకరించ గల శక్తిని కార్మిక వర్గం మొదటిసారిగా వ్యక్తీకరించింది.  

జాతీయ ఉద్యమం మద్దతు 

జాతీయ ఉద్యమం బలపడిన తరువాత కార్మిక సమస్యలను పట్టించుకొటం ప్రారంభించింది. జాతీయ ఉద్యమ నాయకులు బి.సి.పాల్చిత్తరంజన్ దాస్లయాకత్ హుస్సేన్  తదితరులు సమ్మెలకి మద్దతుగా అనేక సభలలో ప్రసంగించారు.  బెంగాల్ లో రైల్వేజనపనార మిల్లులుప్రింటింగ్ ప్రెస్ కార్మికులు అనేక సమ్మె లు చేశారు. ఆ సమ్మెల కు అశ్వని కుమార్ బెనర్జీరాయ్ చౌధురిప్రమతోష్ బోస్ తదితర జాతీయోద్యమ నాయకులు పూర్తి మద్దతునిచ్చారు.  ఈ పరిశ్రమల యజమానులు విదేశీ కంపెనీలు లేదా బ్రిటిష్ ప్రభుత్వము ఉన్నందున మద్దతు భారిగా లభించింది. కార్మిక  ప్రదర్శనలలో పాల్గొనే వారికి ప్రజలు మద్దతునివ్వటమే గాక ఆహార పదార్థాలను కూడా అందించారు. 

1918 లో గాంధీ గారి నాయకత్వం లో అహ్మదాబాద్  టెక్స్ టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పడింది. యజమానులు కార్మికుల మేలు చూసే ట్రస్టీలుగా వుండాలనివర్గ పోరాటం కాకుండా వర్గ సామరస్య తను నెలకొల్పాలని   గాంధీ గారి సిద్ధాంతం. 

మొట్టమొదటి కేంద్ర ట్రేడ్ యూనియన్ ఏఐటియుసి ఏర్పాటు

మొదటి ప్రపంచ యుద్ధము వలన పెరిగిన ఆర్థిక ఇబ్బందులుఅనిబిసెంట్ గారి నాయకత్వం లో జరిగిన  హోమ్ రూల్ లీగ్ ఉద్యమం, 1917 లొ రష్యాలో  వచ్చిన సోషలిస్ట్ విప్లవంజలియన్ బాగ్ మారణకాండరౌలట్ చట్టానికి వ్యతిరేకముగా 1919 లొ జరిగిన సత్యాగ్రహంసహాయ నిరాకరణ ఉద్యమంఖిలాఫత్ ఉద్యమం లీగ్ ఆఫ్ నేషన్స్ (ఆ తరువాత అది ఐక్య రాజ్య సమితి అయింది) ఆధ్వర్యములో 1919 లొ ILO (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ -- అంతర్జాతీయ కార్మిక సంస్థ ) ని  ఏర్పాటు  చేయటం   తదితర సంఘటనల వలనమద్రాస్బెంగాల్,బొంబాయి ప్రాంతాలలో  మరియు షిప్పింగ్కమ్యూనికేషన్స్జనపనారబొగ్గుటెక్స్ టైల్స్ఇంజినీరింగ్తేయాకురైల్వే రంగాలలో  అనేక కార్మిక సంఘాలు ఏర్పడి పోరాటాలకు దిగాయి. 

కా ర్మిక సంఘాలు అనేక చోట్ల ఏర్పడినప్పటికీ వాటన్నింటికి కలిపి జాతీయ స్థాయి లొ ఒక కేంద్రం లేనందున  బ్రిటిష్ పాలకులు శ్రీ ఎన్.ఎం.జోషీ ని భారత కార్మిక వర్గం తరఫున   ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్)  సమావేశానికి పంపించారు. ఇందుకు అనేక యూనియన్లు తమ నిరసన తెలియజేశాయి.  ఈ లోటును గుర్తించిన కార్మిక సంఘాలు ఒక  కేంద్ర  ట్రేడ్ యూనియన్ ఏర్పాటుకు నిర్ణయించాయి. ఆ ప్రకారమే  31.10.1920 న బొంబాయిలొ  స్వాతంత్ర్య సమర యోధులు లాలా లజపతి రాయ్ అధ్యక్షతన జరిగిన అఖిల భారత మహాసభలొ  భారత దేశం లొ మొదటి కేంద్ర ట్రేడ్ యూనియన్  అయిన  ఏఐటియుసి  ని ఏర్పాటు చేశారు.

ఈ మహాసభకు లాలా లజపతి రాయ్ మోతీలాల్ నెహ్రూ తదితర అనెక మంది స్వాతంత్ర్య సమర యోధులు హాజరయ్యారు. 64యూనియన్లనుండి 101 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మరో 43యూనియన్లు తమ సౌభ్రాతృత్వాన్ని తెలియజేశాయి.   బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరఫున సౌహార్ద్ర ప్రతినిధులు హాజరయ్యారు. హాజరైన యూనియన్లలో ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ ఎంఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా వున్నది. హాజరైన యూనియన్ల మొత్తం సభ్యత్వం , 1,40,000 గా వున్నది. లాలా లజపతి  రాయ్ అధ్యక్షులుగాఎన్.ఎం.జోషీ ప్రధాన కార్యదర్శిగా ఏఐటియుసి మొదటి కార్యవర్గం ఎన్నికయింది. నాయకులందరూ  కాంగ్రెస్ పార్టీ వారే. 

యూనియన్లలో రెండు ధోరణులు 

అప్పటికి కార్మిక వర్గ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడకపోయినా  యూనియన్లలో రెండు ధోరణులున్నాయి. ఒక ధోరణి బొంబాయి బట్టల  మిల్లుల  కార్మికుల గిర్నీ కాంగార్ యూనియన్ ది. ఈ యూనియన్ ఆర్థిక డిమాండ్స్ కోసం మాత్రమే గాక విధాన పరమైన మార్పుల కోసం కూడా సమరశీలమైన  పోరాటాలు చేసింది. ఇంకొక ధోరణి   అహ్మదాబాద్ టెక్స్ టైల్ లేబర్ అసోసియేషన్ ది. వర్గ సామరస్యముతో ఆర్థిక పరమైన తక్షణ  డిమాండ్స్ పరిష్కరించుకునేందుకే ఈ యూనియన్ పరిమితమైనది. స్వతంత్రం కొసం జరుగుతున్న పోరాటాలుఏఐటియుసి ఏర్పాటు వలన పెరిగిన ఉత్తేజం తొ కార్మిక వర్గ పోరాటాలు ఊపందుకున్నాయి. ఒక్క 1921లోనే 400 సమ్మెలు జరిగాయి. వాటిలొ సగం కన్నా ఎక్కువ జయప్రదమయ్యాయి.

సంపూర్ణ స్వాతంత్ర్యం డిమాండ్ ను మొట్ట  మొదటి సారిగా 1921 లో జరిగిన కాంగ్రెస్ మహాసభలొ  లేవనెత్తిన కమ్యూనిస్టులు    

1921లొ అహ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో సంపూర్ణ స్వాతంత్ర్యం కొసం డిమాండ్ ను మొదటి సారిగా లేవనెత్తింది కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులైన ఎంఎన్.రాయ్ మరియు అబని ముఖర్జీ లు తమ సంతకాలతో ఒక ప్రణాళికని ఈ మహాసభ ప్రతినిధులకు అందజేశారు. ఈ ప్రణాళిక ఇచ్చిన ఉత్తేజముతో రాడికల్ కాంగ్రెస్ వాది అయిన మౌలానా హజ్రత్ మోహాని  సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గాంధీ గారి నాయకత్వములో మెజారిటీ ప్రతినిధులు ఈ తీర్మానాన్ని తిరస్కరించారు.  కానీ కమ్యునిస్ట్లు లు మరియు వారి నాయకత్వం లో వున్న  కార్మిక సంఘాలు సంపూర్ణ స్వరాజ్యం డిమాండ్  ను కొనసాగించారు.  కార్మిక వర్గ పోరాటాలకు రైతాంగ పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతును ప్రకటించాలని కమ్యూనిస్ట్ లు కో రారు.  ఆ రోజులలో అన్ని అభిప్రాయాల వారూ అన్ని పార్టీల వారూ కాంగ్రెస్ లోనె ఉండి అందరూ కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. చివరికి 19.9.1929 న లాహోర్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానాన్ని ఆమోదించింది. భారత దేశానికి డొమినియన్ స్టేటస్ (అధినివేశ ప్రతిపత్తి) పై బ్రిటిష్ పాలకులతో జరిగిన చర్చలు విఫలమైనందున 1930 జనవరి 26 ను స్వాతంత్ర్య దినోత్సవముగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  

భారత దేశం లో మొదటిసారిగా మే డే నిర్వహణ 

భారత దేశం లొ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ని మొట్ట మొదటి సారిగా 1.5.1923 న చెన్నై లొ  కార్మిక నాయకులు  మలయాపురం సింగార వేల్ చెట్టియార్ గారు కార్మిక వర్గ పతాకమైన ఎర్ర జెండాని ఎగర వేసి నిర్వహించారు.

ట్రేడ్ యూనియన్ చట్టం 1926 ను బ్రిటిష్ ప్రభుత్వము  ఏర్పాటు చేయటానికి కారణాలు 

ఉధృతముగా జరుగుతున్న కార్మిక వర్గ  సమ్మెలను మరియు కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నవారిలో వున్న విప్లవ వకారులను దృష్టిలో  వుంచుకుని బ్రిటిష్ ప్రభుత్వము  ట్రేడ్ యూనియన్ చట్టం, 1926 ను ప్రవేశ పెట్టింది. ఈ చట్టం  ప్రకారం యూనియన్ ను రిజిష్టర్ చేసేందుకు  నాయకత్వము రిజిస్ట్రార్ వద్దకు వ్యక్తిగతముగా హాజరు కావాలని  ఆదేశించారు. స్వాతంత్ర్యం కొసం విప్లవ మార్గం లో పోరాడుతూ అందువలన  అజ్ఞాత వాసం లొ ఉంటూ యూనియన్ నాయకులుగా వున్న విప్లవకారులను బయట పెట్టాలనే బ్రిటిష్  పాలకుల కుతంత్రం ఈ చట్టం లొ ఇమిడి వున్నది. 

సైమన్ గొ బ్యాక్  అనే నినాదం తొ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పెద్ద ఎత్తున జరిగిన   ఉద్యమం  

సంపూర్ణ స్వాతంత్రం కాకుండా అందుకు బదులు రాజ్యాంగం లో కొన్ని సవరణలు చేసేందుకు బ్రిటిష్ పాలకులు 1928 లో  పంపించిన ‘సైమన్ కమిషన్’  కు వ్యతిరేకముగా “సైమన్గో బ్యాక్” నినాదం తొ దేశమంతటా ఉద్యమం జరుగుతున్న సందర్బములో కార్మిక వర్గము సమ్మెలు చేసింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకముగా నల్ల జండాల తొ ప్రదర్శనలు నిర్వహించింది. ఈ పోరాటాలు బొంబాయికలకత్తామద్రాసు మరియు లాహోర్ లలో పెద్ద ఎత్తున జరిగాయి. 

పోలీసు ల లాఠీ ఛార్జీ వలన మరణించిన స్వాతంత్ర్య సమర యోధులు మరియు ఏ ఐ టి యు సి మొదటి అధ్యక్షులు లాలా లజపతి రాయ్

లాహోర్ లొ జరుగుతున్న ఈ ఉద్యమం లో  ఎ ఐ టి యు సి మొదటి అధ్యక్షులైన లాలా లజపతి రాయ్ పాల్గొన్న సందర్భములొ జరిగిన  పోలీసు లాఠీ చార్జీ వలన ఆయన 17.11.1927న చనిపోయారు.  ఇందుకు ప్రతీకారముగా ఈ లాటీ  ఛార్జికి బాధ్యుడైన  బ్రిటిష్ పోలీస్ ఆఫిసర్ సాండర్స్ ను    17.12.1927 న కొందరు విప్లవ కారులు చంపారు.

దేశమంతా మారుమోగిన  భగత్ సింగ్ మరియు భటుకేశ్వర దత్తు ల నినాదాలు-  “ విప్లవం వర్థిల్లాలి”   “సామ్రాజ్య వాదం నశించాలి ” మరియు “ ప్రపంచ కార్మికులారాఏకం కండి ”

1928 లో అనేక సమ్మెలు ఉధృతముగా జరిగాయి. ఈ ఒక్క సంవత్సరం లోనే సమ్మెలవలన 316 లక్షల పని దినాలను కోల్పోవటం జరిగింది. ఈ సమ్మెలను మరియు స్వాతంత్ర్యోద్యమం లొ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వము ఈ పోరాటాన్ని అణచి వేసేందుకు  సెంట్రల్ అసెంబ్లీ లొ “ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు” ను ప్రవేశ పెట్టి దాని పై  8.4.1929 న చర్చలు నిర్వహిస్తున్న సమయం లొ విప్లవ మార్గం లో స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన భగత్ సింగ్ మరియు భటుకేశ్వర్ దత్ లు  ఆ అసెంబ్లీ లొ బాంబులు వేసి “ఇంక్విలాబ్ జిందాబాద్”(విప్లవం వర్థిల్లాలి) ”దౌన్ విత్ ఇంపీరియలిజం(సామ్రాజ్య వాదం నశించాలి)  మరియు “వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్యు నైట్ ”  “ (ప్రపంచ కార్మికులారాఏకం కండి ) ” అనే 3 నినాదాలను  పెద్ద గొంతుక తొ అనెక సార్లు నినదించారు. బాంబులు వేయటం లో వారి ఉద్దేశం బ్రిటిష్ సామ్రాజ్య వాదుల అనుచిత వైఖరిపట్ల దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించటమే. 

బాంబుల వలన ఎవరూ చని పోలేదు. ఇంతేగాక అవి చాలా తక్కువ శక్తి వున్న వి మాత్రమే. అయినప్పటికి భగత్ సింగ్ మరియు భటుకేశ్వర్ దత్ లకు   బ్రిటిష్ సామ్రాజ్య వాదులు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.   భగత్ సింగ్రాజ్ గురుసుఖ దేవ్ లకు  సాండర్స్ హత్య  లో ప్రమేయమున్నదనే తప్పుడు ఆరోపణ తో  ముగ్గురి ని  ఉరి తీశారు. అప్పటి నుండి ఈ 3 నినాదాలను కార్మిక వర్గం నినదిస్తున్న ది.  “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదం  భారత కార్మిక వర్గాన్ని వర్గ పోరాటపు  బాటలో   సమరానికి సంసిద్ధం చేసే నినాదముగా వెలుగొందుతున్నది. 

కార్మిక వర్గ నాయకులైన కమ్యూనిస్ట్ లపై  కాన్పూర్మీరట్ కుట్ర కేసులు 

కార్మికోద్యమాన్ని బలహినపరచేందుకు  ఆ ఉద్యమానికి నాయకత్వము లొ వున్న ముజఫర్ అహ్మద్ఎస్ ఏ డాంగే తదితర కమ్యూనిస్టు ల పై 1924 లో కాన్ పూర్ కుట్ర కేసు బనాయించి జైలుకు పంపారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు  కార్మిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణల తో ఈ కేసు పెట్టారు. ఆ తరువాత 1929 లొ 31 మంది  ట్రేడ్ యూనియన్ నాయకులు మీరట్ లొ సమావేశమై ప్రభుత్వాన్ని కూల్చేందుకు  కుట్ర చేశారని కేసు పెట్టారు. వీరందరూ కమ్యూనిస్టులే. డాంగేముజఫర్ అహమ్మద్ లు కూడా ఈ కేసులో వున్నారు. 

ఈ కేసు విచారణ నాలుగున్నర సంవత్సరాలు జరిగింది. ఇంతకాలం విచారణ కొనసాగినందున ఈ అవకాశాన్ని  కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేయుటకు ఉపయోగించుకున్నారు. ఈ విచారణ వలన కమ్యూనిస్టుల ప్రభావం పెరిగింది. బ్రిటిష్ సామ్రాజ్య వాదుల అనుచిత వైఖరికి   ప్రపంచ వ్యాపితముగా నిరసన వెలువడింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్రోమా రోలాండ్హెచ్ జి వెల్స్హెరాల్డ్ లా స్కీ,  తదితర అనేక దేశాల మేధావులు బ్రిటిష్ పాలకుల వైఖరిని  ఖండించారు.ఈ విధముగా విఫలమైన ప్రభుత్వము సర్వ వ్యాపితమైన దాడిని ప్రారంభించింది. కమ్యూనిస్ట్ పార్టీని 23.07.1934 న  చట్ట విరుద్ధమైనదని ప్రకటించింది. దీని వలన 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం డజనుకు పైగా  ట్రేడ్ యూనియన్లు చట్ట విరుద్ధమైనవయ్యాయి. 

1930 లో  షోలాపూర్ కమ్యూన్  

షోలాపూర్  కార్మికులు ప్రజలు  బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి  ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుని  4 రోజులు “షోలాపూర్ కమ్యూన్”  నిర్వహించారు. ఈ తిరుగుబాటుని బ్రిటిష్ పాలకులు అణచి వేశారు. నలుగురు నాయకులను12.01.1931 న  ఉరి  తీశారు. 

1938 లో ప్రకటించిన  కార్మిక వ్యతిరేక నల్ల చట్టానికి వ్యతిరేకముగా ఉద్యమం: 

1938 లో సమ్మె హక్కు లేకుండా చేసేందుకు బాంబె రాష్ట్ర  కాంగ్రెస్ మంత్రివర్గము రూపొందించిన  “బాంబె ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు”  కు వ్యతిరేకముగా  పోరాటం జరిగింది. కాంగ్రెస్ మంత్రివర్గము కాబట్టి తమ కోరికను మన్నించి ఈ బిల్లును ఉపసంహరిస్తుందని కార్మికులు భావించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అందుకు అంగీకరించలేదు. ఈ పరిస్థితిలో బాంబె ప్రదేశ్ ట్రేడ్ యూనియన్  కాంగ్రెస్ (బి‌పిటి‌యూ‌సి) 1938 నవంబరు 7 న ఒక రోజు సమ్మెకి నిర్ణయించింది. బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ సమ్మె చేయవద్దని కార్మికులను వారి నివాస ప్రాంతాలకు వెళ్ళి  మైక్ ల ద్వారా విజ్ఞప్తి చేసింది. అయినప్పటికి కార్మికులు వినలేదు.   కమ్యూనిస్ట్ పార్టీ మరియు  డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు స్థాపించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ సమ్మెకి మద్దతునిచ్చాయి. నవంబరు 7న 2,00,000 మంది పైగా బొంబాయి కార్మికులు ఒక రోజు సమ్మె చేశారు. పోలీసు కాల్పులలో ఇద్దరు కార్మికులు చనిపోయారు.  

స్వాతంత్ర్యోద్యమం లో భాగముగా గుర్తించబడిన పి టి  ఉద్యోగుల చారిత్రాత్మక సమ్మె 

1946 లో అల్ ఇండియా పోస్ట్ మెన్ లోయర్ గ్రేడ్ స్టాఫ్ యూనియన్ పిలుపుననుసరించి 12 డిమాండ్స్ కోసం 11.7.1946నుండి సమ్మె ప్రారంభమయింది. దేశ వ్యాపితముగా అనేక ప్రాంతాలలో సమ్మె జరిగింది. బెంగాల్ లో సమ్మె ఉధృతముగా జరిగినది. ఆ నాడున్న ఒకే ఒక కేంద్ర ట్రేడ్ యూనియన్ ఐన ఏ ఐ టి యు సి ఈ సమ్మె కి పూర్తి మద్దతు ప్రకటించింది. బెంగాల్అస్సాము లలో  పి టి ఉద్యోగుల సమ్మె కి మద్దతుగా హర్తాళ్ జరిగింది. సమ్మెకి మద్దతుగా  మద్రాసుబొంబాయికలకత్తా లలో ఇతర రంగాల కార్మికులు ప్రదర్శనలుసమ్మెలు  జులై 23,28 మరియు 29 న వరుసగా చేశారు.

సమ్మెకి మద్దతుగా  29న జరిగిన సభకి కలకత్తాలో లక్ష మంది పైగా ప్రజలు హాజరయ్యారు.  ఈ సమ్మె ని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకముగా చేస్తున్న సమ్మె గా ప్రజలు గుర్తించినందున ఇంతటి మద్దతు లభించింది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము దిగి వచ్చి  ఒప్పందము చేసుకోటం తో సమ్మె ముగిసింది. ఈ సమ్మె ప్రభావం లో పి&టి ఉద్యోగులందరూ ఒకే యూనియన్ లో ఉండాలనే ఆలోచన బలపడింది. 

1946 ఫిబ్రవరి లో బొంబాయిలో జరిగిన నావికాదళం తిరుగుబాటుకు మద్దతిచ్చిన బొంబాయి కార్మిక వర్గంమరియు కమ్యూనిస్ట్ పార్టీవ్యతిరేకించిన కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్

1946 ఫిబ్రవరి18న బొంబాయిలో నావికా సైనికులు వేలాది మంది  తిరుగుబాటు చేశారు.   బ్రిటిష్ జండాని దించి వేశారు. కాంగ్రెస్ముస్లిం లీగ్ మరియు కమ్యూనిస్ట్ జండాలను ఎగర వేశారు.  బొంబాయి విధులలోకి వచ్చారు. వారికి మద్దతుగా   కార్మికులు సమ్మె చేశారు. సామాన్య ప్రజానీకం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకముగా నినాదాలిచ్చారు. “జై హింద్” అని గట్టిగా నినదించారు. కరాచీ,  కలకత్తామద్రాస్కొచ్చిన్విశాఖపట్నం లకు కూడా నావికా సైనికుల తిరుగుబాటు పాకింది. ఈ తిరుగుబాటు కి ముందు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. సైనికులలో వచ్చిన ఈ తిరుగుబాట్లు బ్రిటిష్ పాలనకి అంత్య దశ వచ్చిందనే సంకేతాన్ని ఇచ్చాయి.  ఈ పోరాటానికి  మద్దతునిచ్చేందుకు  కాంగ్రెస్ముస్లిం లీగ్ రెండూ నిరాకరించాయి. ఇంతేగాక బ్రిటిష్ వారికి లొంగి పొమ్మని సలహాలనిచ్చారు. క్రమశిక్షణ  ను ఇప్పుడు ఉల్లంఘిస్తున్న నావికాదళం రేపు తాము అధికారం లోకి వచ్చినా అదే జరుగుతుందని వీరి భయం. 

ఆ నాటి అవిభాజిత  కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే పూర్తి మద్దతు ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఎఐటియుసి ల నాయకత్వములో బొంబాయి కార్మికులు  సమ్మె కి దిగారు. వేలాది మంది విధుల్లోకి వచ్చి మద్దతు ప్రకటించారు. నావికులకు ఆహార పదార్థాలు సరఫరా చేశారు. రోడ్లపై ఎక్కడికక్కడ బ్యారీకేడ్లు నిర్మించారు. ఈ పోరాటం లో 228 మంది కార్మికులు  మరణించారు, 1046 మందికి గాయాలయ్యాయి.  

కార్మికోద్యమాన్ని చీల్చిన సంస్కరణ వాదులు – విడి పోవటాలుకలిసిపోవటాలు  

భారత దేశ ట్రేడ్ యూనియన్ ఉద్యమ చరిత్ర చీలికలు మరియు ఐక్యతకి చేసిన ప్రయత్నాలతో నిండి వున్నది. ట్రేడ్ యూనియన్ ఐక్యత లేకుండా కార్మిక వర్గ ఐక్యత గానివర్గ పోరాటం ద్వారా సామాజిక మార్పును సాధించే విప్లవ శక్తిగా కార్మిక వర్గం రూపొందటం గాని జరగదు.  కాబట్టి  ట్రేడ్ యూనియన్లలో పని చేస్తున్న కమ్యూనిస్టులు  ఐక్యత కోసం పని చేశారు. అదే సందర్భం లో  వర్గ సామరస్య దృక్పథముతో వర్గ పోరాటాన్ని అందుకోసం అవసరమైన ఐక్యతని  నీరుగార్చే సంస్కరణ వాదులతో  రాజీ పడలేదు.    కాబట్టి  “ఐక్యత-పోరాటం”(unity & struggle”) అనే సూత్రం  ట్రేడ్ యూనియన్ ఉద్యమ సారాంశముగా రూపొందింది.   

కాన్ పూర్మీరట్ కుట్ర కేసులను అవకాశం గా తీసుకుని   ఎ ఐ టి యు సి లో వున్న సంస్కరణ వాదులు 1929లో “ఐ టి యు ఎఫ్” (ఇండియన్  ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్) ను ఏర్పాటు చేశారు. ఇది జరిగిన తరువాత 1931 లొ ఎఐటియుసి నుండి విడిపోయి “ రెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్”  (ఆర్ టి యు సి)  ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఐటియుఎఫ్ఎఐఆర్ ఎఫ్ (ఆల్ ఇండియా రైల్వే మెంస్ ఫెడరేషన్)  లు కలిసి ఎన్టియుఎఫ్ ను ఏర్పాటు చేశారు. 1934లో ఆర్ టియుసిఏఐటి యుసి లో కలిసి పోయింది. 1940 లో ఎన్ టి యు ఎఫ్ఏఐటియుసి లో కలిసి పోయింది. పైన తెలియజేసిన విధముగా ఎ ఐ టి యు సి నుండి విడిపోవటాలుకలిసిపోవటాలు జరిగాయి.

ఏ ఐ టి యు సి అధ్యక్షులుగా అనేక మంది స్వాతంత్ర్య పోరాట యోధులు:  

ఈ కాలం లో ఏ ఐ టి యు సి అధ్యక్షులుగా లాలా లజపతి రాయ్జవహర్ లాల్ నెహ్రూసుభాష్ చంద్ర బోస్సరోజినీ నాయుడు తదితర ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధులున్నారు. 

8.5.1947 న ఐ ఎన్ టి యు సి ఏర్పాటు 

ఏఐటియుసి కమ్యూనిస్టుల ఆధిపత్యం లొకి వెళ్ళిందనిస్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎఐటియుసి లొ కొనసాగటం వలన స్వాత్ర్యానంతరం ఏర్పడే తమ ప్రభుత్వానికి వ్యతిరేకముగా పోరాడాల్సి వస్తుందని   ఏఐటియుసి లొ వున్న  కాంగ్రెస్ నాయకులు భావించారు.  స్వాతంత్ర్యం రావటానికి మూడు నెలల ముందు,  వల్లభ్‌ భాయి పటేల్ అధ్వర్యములో 8.5.1947 న   ఐఎన్ టి యు సి (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్)  ని   ఏర్పాటు చేశారు. వర్గ సామరస్య సిద్ధాంతం ప్రకారం పని చేస్తున్న మాకు కమ్యూనిస్టులు  ప్రధాన శత్రువులనికాబట్టి కార్మికులలో మా ప్రభావాన్ని పెంచుకునేందుకు ఐ ఎన్ టి యు సి ని ఏర్పాటు చేస్తున్నామని  అన్నారు. 

 

 

స్వాతంత్ర్యోద్యమం లొ ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించిన కార్మిక వర్గం:  

ఈ విధముగా కొన్ని చీలికలు రావటంమళ్ళీ కలవటం ఉన్నప్పటికి స్వాతంత్ర్యోద్యమము లొ కార్మిక వర్గము ప్రశంసనీయమైన విధముగా పాల్గొన్న ది. ఇందు కోసం అనేక త్యాగాలు చేసింది.  స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ అనేక సార్లు కార్మిక వర్గానికి వ్యతిరేకముగా పని చేసింది. అయినప్పటికి కార్మిక వర్గము  స్వాతంత్ర్య సాధనకి రక్త తర్పణ తోత్యాగాలతో పని చేసింది. 

స్వతంత్ర పోరాటం లొ పాల్గొన్న ఇతర వర్గాలు:  

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా  జరిగిన స్వతంత్ర  పోరాటం లొ  వివిధ వర్గాల ప్రజలు- కార్మికులువ్యవసాయ కార్మికులుపేదరైతులుమధ్యతరగతి రైతులుధనిక రైతులుపెట్టుబడిదారులు పాల్గొన్నారు. లాయర్లుడాక్టర్లుమేధావులు,  వివిధ వృత్తులు చెసుకునె వారు పాల్గొన్నారు.  మహిళలువిద్యార్థులుయువజనులు  పాల్గొన్నారు.

స్వాతంత్ర్యోద్యమములో పాల్గొనకుండా  దూరముగా వున్న వారెవరు?  

సంస్థానాధీశులుజమిందారులుభూస్వామ్య వర్గం పాల్గొన లేదు. మతం పేరుతో ప్రజల మధ్య వి ద్వేషాలను రెచ్చగొట్టే మతోన్మాద శక్తులు పాల్గొన లేదు.  మతోన్మాదుల శత్రువులు  200 సంవత్సరాల పాటు మన దేశ సంపదను అనేక రూపాలలో తరలించుకు పోయిన   బ్రిటిష్ సామ్రజ్యవాదులు కాదు. తమ మతాన్ని కాకుండా  మరో మతాన్ని  అనుసరించే భారతీయులే వీరికి శత్రువులు. మతం ప్రాతిపదికగా దేశం మరియు పౌరసత్వం  వుండాలని వీరీ సిద్ధాంతం. ఇది స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి విరుద్ధం. 

ఈ పోరాటానికి నాయకత్వం ఎవరిది

రాజకియ పరముగా చూస్తే  స్వతంత్ర పోరాటానికి  నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ.  కాని వర్గ దృష్టితో చూస్తే కాంగ్రెస్   బడా  పెట్టుబడి దారుల నాయకత్వం లో వున్న పెట్టుబడిదారీ వర్గపు పార్టీ.  కాబట్టి బడా  పెట్టుబడిదారుల నాయకత్వములొ వున్న పెట్టుబడిదారీ వర్గము స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించినట్లు గా మనము అర్థం చేసుకోవాలి.  

స్వాతంత్ర్యం వస్తే ప్రజలకి జరిగే మేలు ఏమిటో తెలియజేసేందుకు 1931 లో కరాచీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ ఆమోదించిన తీర్మానం 

స్వరాజ్యం అంటే  ఏమిటొ,  దాని వలన ప్రయోజనాలేమిటో ప్రజలకు అర్థమయ్యే విధముగా తెలియజేసేందుకు కరాచీ లొ 1931 లొ  జరిగిన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత మహా సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత ప్రజలపై జరుగుతున్న దోపిడిని అంతం చేసేందుకుఆకలితో బాధ పడుతున్న లక్షలాది ప్రజానీకానికి రాజకీయ స్వాతంత్ర్యం  అనే దానిలో ఆర్థిక స్వాతంత్ర్యం కూడా ఇమిడి వున్నదని చెప్పాల్సిన అవసరం వున్నదని  కాంగ్రెస్ భావించింది.  స్వరాజ్యం తమకి ఏమి ఇస్తుందో ప్రజలకు అర్థమయ్యే విధముగా చెప్పాల్సిన అవసరం వున్నదని కాంగ్రెస్ భావించింది. ఇందుకోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. స్వతంత్ర భారత దేశపు రాజ్యాంగం లో  చేర్చాల్సిన అంశాలను ఈ తీర్మానం లొ ప్రస్తావించింది. 

 

రాజీ పడిన 3 పక్షాలు   - దేశ విభజనతో వచ్చిన స్వాతంత్ర్యం 

సోవియట్ యూనియన్ నాయకత్వములో  వున్న సోషలిస్టు శిబిరం మరియు సోషలిజం పట్ల ప్రజలు ఆకర్షించబడుతున్నారు. మన దేశం లో అనేక చోట్ల పాతకాలపు నిరంకుశ భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకముగా రైతాంగం అనేక ప్రాంతాలలో పోరాటాలు  చేసింది.  కమ్యూనిస్టుల నాయకత్వములో జరిగిన  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.   1946 లో జరిగిన నావికా సైనికుల తిరుగుబాటు కు బొంబాయి కార్మికుల,  ప్రజల మద్దతు లభించింది. ఇటువంటి  అనేక సంఘటనలు పరిశీలించిన కాంగ్రెస్ముస్లిం లీగ్మరియు బ్రిటిష్ పాలకులు పరిస్థితి తమ చేయి దాటిపోతున్నదని,  అలానే కొనసాగితే కార్మిక కర్షక వర్గాల చేతిలోకి  రాజ్యాధికారం వెళ్ళే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ లు భయ పడ్డాయి. భారత దేశం లో బ్రిటిష్ వారి   ఆస్తులకు భద్రత ఉండదని బ్రిటిష్ పాలకులు భయపడ్డారు. కాబట్టి ఈ 3పక్షాలు రాజీ పడి దేశ విభజనకు తదనుగుణముగా   భారత దేశం మరియు పాకిస్తాన్ పేర్లతో రెండు స్వతంత్ర దేశాలుగా   ఏర్పాటుకు అంగీకరించాయి. 

స్వతంత్ర భారత దేశం లో రాజ్యాధికారం ఎవరికి దక్కింది?

స్వతంత్ర పోరాటానికి నాయకత్వము వహించిన  రాజకీయ పార్టీ  కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్వతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  కాంగ్రెస్ పార్టీ బడా పెట్టుబడిదారుల నాయకత్వములో వున్న పెట్టుబడిదారీ వర్గపు ప్రయోజనాలకు అనుగుణముగా వున్నది. కాబట్టి రాజకీయ పార్టీగా కాకుండా వర్గ రీత్యా చూస్తే రాజ్యాధికారం లోకి వచ్చినది బడా పెట్టుబడిదారుల నాయకత్వములో వున్న  పెట్టుబడిదారీ వర్గం . అనంతరం పెట్టుబడిదారీ వర్గము   గ్రామీణ ప్రాంతాలలో తమకి నమ్మకమైన మిత్రులుగా ఉంటారని గ్రహించి భూస్వామ్య వర్గానికి  రాజ్యాధికారం లో   భాగస్వామ్యం ఇచ్చింది.  555 సంస్థానాలను భారత దేశం లో విలీనం చేసి వారి ఆస్తులను కాపాడటంవారి బిరుదులను కొనసాగించటం తో పాటు ప్రతి సంవత్సరం వారికి కొంత భరణం చెల్లించారు.  చివరికి చాలా ఆలస్యముగా 1971 లో మాత్రమే వీరి  బిరుదులనురాజ భరణాలను రద్దు చేశారు. 

స్వాతంత్ర్యానంతరం

రాజ్యపు వర్గ స్వభావం 

ఈ విధముగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  భారత దేశ  రాజ్యము బడా పెట్టుబడిదారుల నాయకత్వం లొ వున్న పెట్టుబదిదారులు మరియు భూస్వాముల వర్గ పాలనకు సాధనముగా వున్నది.  బడా  పెట్టుబడి దారులు భారత దేశాన్ని పెట్టుబడిదారీ పంథాలొ అభివృద్ధి చేసేందుకు  అంతకంతకూ  విదేశీ ద్రవ్య పెట్టుబడితో మిలాఖత్ అయ్యే స్వభావముతో వున్నారు . 

ప్రభుత్వ పాత్ర 

మన దేశానికి  బడా పెట్టుబడిదారుల నాయకత్వం లో వున్న పెట్టుబడిదారీ-భూస్వామిక వర్గాలు పాలక వర్గాలు. బూర్జువా పార్టీలు ఈ పాలక వర్గాల రాజకీయ ప్రతినిధులు. ఈ బూర్జువా పార్టీలలో ఏవి అధికారం లో వున్నా అవి ఈ పాలక వర్గాలకు ఆ సందర్భములో ఏది ప్రయోజనకరమో దానినే  తమ ప్రభుత్వ విధానాలుగా ప్రకటిస్తాయి. కాబట్టి విధానాలను రూపొందించటం లో డైరెక్షన్ పాలక వర్గాలు కాగా అందుకనుగుణముగా విధానాలు తయారు చేసి అమలు జరిపే పని అధికారం లో వున్న బూర్జువా పార్టీల ప్రభుత్వానిది.   రాష్ట్ర స్థాయిలో వామపక్షం అధికారం లోకి వచ్చినా రాజ్యాంగం ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థని అవి రద్దు చేయలేవు. కేంద్ర స్థాయిలోనే అది జరగాలి. ఇతర పార్టీలకన్నా మెరుగుగా తమ అధికారం పరిధిలో వామపక్షాలు పని చేస్తూ కార్మిక వర్గం రాజ్యాధికారం లోకి వచ్చేందుకు జరిగే పోరాటం లోకి ప్రజలను సమీకరించే ఉద్యమాలకు తోడ్పడే విధముగా అవి నడవాల్సి ఉంటుంది. 

స్వాతంత్ర్యోద్యమ ఆశయాలకి అనుగుణముగా రూపొందించబడిన భారత రాజ్యాంగం 

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అధ్యక్షతన రాజ్యాంగ సభ రూపొందించిన  రాజ్యాంగంస్వాతంత్ర్యోద్యమం  కరాచీ కాంగ్రెస్ తీర్మానం ద్వారా ఇచ్చిన హామీలకు అనుగుణముగా వున్నది.  ఫెడరలిజంప్రాథమిక హక్కులులౌకిక తత్వంపార్లమెంటరీ ప్రజాస్వామ్యంచట్ట సభలు- కార్యవర్గము-  న్యాయ వ్యవస్థ ఈ మూడు ఒకదాని పరిధిలో వున్న విషయాలలో ఇంకొక టి జోక్యం చేసుకోకుండా ఉండటం-  ఈ 5 అంశాలు  రాజ్యాంగపు ప్రాథమిక లక్షణాలని వీటిని సవరించ కూడదని సుప్రీం కోర్టు చెప్పింది.  

రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి  మరింత అనుగుణముగా వున్నాయి.  ఈ ఆదేశిక సూత్రాలను కోర్టు ఆదేశాలద్వారా అమలు చేయటం సాధ్యం కాదు. కానీ దేశాన్ని పాలించే వారు అనుసరించాల్సిన ప్రాథమిక  సూత్రాలుగా వీటిని మన రాజ్యాంగం ప్రస్తావించింది. చట్టాలు చేసేటప్పుడు  ఈ  సూత్రాల ప్రకారం చేయటం రాజ్యం విధి అని రాజ్యాంగం స్పష్టముగా చెప్పింది.

రాజ్యాంగం లో వున్న  ఆదేశిక సూత్రాలు:  

(1)సమాజ నిర్మాణం ఆర్థికసామాజికరాజకీయ న్యాయానికి  దారి తీసే దిగా వుండాలి. ఈ విధముగా చేయటం ద్వారా ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాలి. 

(2) ఆర్థిక అసమానతలను తగ్గించటం,హోదాలోసౌకర్యాలలో ,అవకాశాలలో  అసమానతలు నిర్మూలించటం మరియు ఈ అసమానతల నిర్మూలన వ్యక్తుల మధ్యనే గాకుండా భిన్నమైన ప్రాంతాలలోభిన్నమైన కార్యకలాపాలు చేసే సమూహాల మధ్య కూడా అసమానతలు ఉండకూడదు. 

(3) జీవించే హక్కులో భాగముగా పురుషులు,  మహిళలు అనే వివక్షత  లేకుండా  అందరికీ తగు మాత్రపు జీవనాధారం కల్పించటం 

(4) సంపద కేంద్రీకరణ మరియు ఉత్పత్తి సాధనాలపై యాజమాన్య కేంద్రీకరణ లను   నివారించటం 

(5)సమాజానికి చెందిన భౌతిక వనరులపై యాజమాన్యము మరియు నియంత్రణలను అందరి ప్రయోజనాలను నెరవేర్చే విధముగా పంపిణీ చేయాలి.

(6)ఆర్థిక వ్యవస్థను నిర్వహించే తీరు సంపద కేంద్రీకరణకుమరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణ వలన ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూడాలి.

(7) స్త్రీలుపురుషులు అందరికీ సమాన పనికి  సమాన వేతనం

(8) ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికుల ఆరోగ్యాన్నిశక్తిని దుర్వినియోగం చేయటాన్ని నివారించటం 

(9) పని హక్కును కల్పించటం

(10)వృద్ధాప్యంజబ్బు పడటం,  పని చేయలేని స్థితి,  నిరుద్యోగం వలన ఎదురయ్యే ఇబ్బందుల నుండి సంరక్షణ (10)  పని చేసే ప్రదేశాలలో ఆరోగ్యకరమైన పరిస్థితులు,

(11)జీవన వేతనం (లివింగ్ వెజ్)

12) మెటర్నిటీ రిలీఫ్ ,… మొదలగునవి ఈ ఆదేశిక  సూత్రాలలో వున్నాయి.


ఈ పార్ట్-1 వ్యాసకర్త.. పి.అశోకబాబు


స్వాతంత్ర్యానంతరం అనుసరించిన విధానాలు, వాటిలో మార్పులు,ఆ మార్పులు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి అనుగుణముగా ఉన్నాయా,లేవా, మన కర్తవ్యాలు  పార్ట్-2 లో తెలియజేస్తాం.  

Friday, June 17, 2022

 

కాంట్రాక్ట్ సైనికుల రిక్రూట్ మెంట్  కు  “అగ్ని పథ్”  

నాలుగు సంవత్సరాలు పని చెసె కాంట్రాక్ట్ సైనికుల రిక్రూట్‌మెంట్ స్కీమును “అగ్నిపథ్” పెరు తొ  మోడీ  ప్రభుత్వము ప్రకటించింది.  ఇందుకు వ్యతిరేకముగా దేశ  వ్యాపితముగా యువజనుల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

రెండేళ్లుగా సాధారణ సైనిక నియామకాలు జరగడం లేదు. 2021 నాటికి దేశ సైన్యంలో 1,04,653 మంది కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాంతీయ కోటాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది.  ఆరు నెలల శిక్షణ కాలంతో సహా నాలుగు సంవత్సరాల స్వల్పకాలిక ఉద్యోగ కల్పనకు నిర్ణయించింది.  నాలుగేళ్ల తర్వాత దాదాపు మూడు వంతుల మంది సైనికులు పెన్షన్‌, గ్రాట్యుటీ లేకుండా పదవీ విరమణ చేస్తారని తెలపడం దారుణం.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్టీకరణ చేస్తున్నాయి. ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయి.   ఈ విధానాలు దేశంలోని శ్రామికుల ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి దారితీస్తున్నాయి.  ఈ విధానం వలన గడువు ముగిసి  నిరుద్యోగులైన సైనికులు   ప్రయివేటు  కిరాయి సైనికులుగా  నెట్టబడతారు.   ఇప్పటికే తీవ్రమైన ఒడిదుడుకుల పాలైన  మన సామాజిక వ్యవస్థ  పై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరముగా వుంటాయి.  దేశ సార్వభౌమాధికారంపై ఈ నయా ఉదారవాద దాడులను  తీవ్రంగా వ్యతి రెకించాలి. అగ్నిపథ్‌ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని,  సాయుధ దళాలకు రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించాలని కోరుతూ యువజనులు  చేస్తున్న ఉద్యమాన్ని అందరూ బలపరచాలి.

 

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) 23వ అఖిల భారత మహాసభ రాజకీయ తీర్మానం నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం


ప్రధాన కర్తవ్యం బిజెపి ని ఒంటరిదిగా చేయటం, ఓడించటం

కన్నూరు (కేరళ) లొ 2022 ఏప్రిల్ 6 నుండి 10 వరకు జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) 23వ అఖిల భారత  మహాసభ జయప్రదముగా జరిగినది. మహాసభ 85 మంది కేన్ద్ర కమిటి  సభ్యులను  ఎన్నుకున్నది.  ఈ 87 మంది కేన్ద్ర కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా కా. సీతారాం ఏచూరిని మరియు 17 మంది పొలిట్ బ్యూరో సభ్యులను ఎన్నుకున్నారు.

మహాసభకి కొద్ది నెలల ముందే కేన్ద్ర కమిటీ ఒక ముసాయిదా రాజకియ తీర్మానాన్ని ఆమోదించి దానిని  పార్థి వెబ్ సైట్లు,  బుక్  షాప్  ల ద్వారా  బహిరంగముగా సర్క్యులేషన్‌  లొ  పెట్టింది. సభ్యుల నుండి ఈ ముసాయిదా కి సవరణలను ఆహ్వానించింది. ఈ విధముగా దేశ వ్యాపితముగా 4001 సవరణలు వచ్చాయి. మహా సభలో పాల్గొన్న ప్రతినిధుల నుండి 390 సవరణలు మరియు 12 సలహాలు వచ్చాయి. మహాసభ వీటన్నింటి ని పరిశీలించి కొన్ని సవరణలను ఆమోదించి వాటిని రాజకియ తీర్మానం లొ పొందు పరిచింది.

ముగింపు రోజున జరిగిన బహిరంగ సభకు మానవ మహాసముద్రము అక్కడ వున్నదా అనే  విధముగా ప్రజలు హాజరయ్యారు. కేరళలో సిపిఐ(ఎం) పార్టీ ప్రజా పునాది లోతుగా వేళ్లూనుకుని వున్నదనటానికి ఇది నిదర్శనముగా వున్నది.

ఈ మహాసభ ఆమోదించిన రాజకీయ తీర్మానం,   బిజెపి ని ఒంటరి చేయటం,  ఓడించటం ప్రధాన కర్తవ్యమని నిర్ద్వంద్వముగా ప్రకటించింది.  బిజెపి తన ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఫాసిస్టు శక్తి అయిన ఆర్ఎస్ఎస్ యొక్క హిందూత్వ మతోన్మాద ఎజెండాని దూకుడుగా ముందుకు తీసుకెళ్లుతున్నది. (హిందూత్వ అనేది హిందూ మతం కాదు. అది మతం ప్రాతిపదికగా దేశాన్ని నిర్మించాలనే ఒక ఉన్మాదపూరిత రాజకియ సిద్ధాంతం. మత రాజ్యాలన్నీ నియంత్రుత్వాన్ని అమలు చేస్తున్నాయి.  ప్రజల కష్టాలను  పెంచుతున్నాయి)  దీనితో పాటుగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలను  బహు ముఖముగా  మరియు  తీవ్రముగా అమలు చేస్తున్నది. ఈ విధముగా  మతోన్మాద శక్తుల- కార్పొరేట్ల  బంధాన్ని పటిష్ట వంతం చేస్తున్నది. జాతియ ఆస్తుల లూటీ జరుగుతున్నది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని   అమలు చేస్తున్నది. (ఇతర కంపెనీలతో పోటీపడి లాభాలు పొందటం కాకుండా రాజకీయపరమైన అనుబంధముతో ప్రభుత్వము తమకి అనుకూలముగా తీసుకునే చర్యల ద్వారా లాభాలు పొందటం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు సారాంశం). రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేస్తున్నది. పూర్తి స్థాయి నియంత్రుత్వాన్ని అమలు చేస్తున్నది.

బిజెపి ని ఒంటరి చేయటం, ఓడించటం  అనే లక్ష్యం నెరవేరేందుకు సిపిఐ (ఎం)  సొంత బలం గణనీయమైన స్థాయిలొ పెరగాలి. అలా అయితేనే  పార్టీకి  రాజకీయ జోక్యపు శక్తి సామర్థ్యాలు ప్రభావితం చేసేవిగా వుంటాయి. మహాసభలొ చర్చించి ఆమోదించబడిన రాజకీయ నిర్మాణ నివేదిక  పార్టీ బలాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన రాజకీయ నిర్మాణ పరమైన కర్తవ్యాలను నిర్దేశించింది.  ఈ కర్తవ్యాల అమలుకు పార్టీ నిర్ణయించింది.

పార్టీ తన బలాన్ని పెంచుకోవటం తో పాటు వామ పక్ష శక్తుల ఐక్యత ను బలోపేతం చేయాలని నిర్ణయించింది. పాలక వర్గాల విధానాలకు  ప్రత్యామ్నాయముగా ఒక  విధానపరమైన కార్యక్రమం ప్రాతిపదికగా వామపక్ష ప్రజాస్వామిక సంఘటన ఏర్పాటుకు కృషి చేస్తుంది. ఈ ప్రాతిపదికన ప్రజాపొరాటాలకు  పదును చేకూర్చాలి.

ఇంతే గాక  హిందూత్వ మతొన్మాదానికి వ్యతిరేకముగా  లౌకిక శక్తులను  విశాల ప్రాతిపదికన సమీకరించాలి. హిందూత్వ మతొన్మాదపు సవాళ్లను రాజకియ, సైద్ధాంతిక, సామాజిక, సాంస్క్రుతిక, మరియు సంస్థాగత – ఈ విధముగా అన్ని రంగాలలోను ఎదుర్కోవాలని పార్టీ నిర్ణయించింది.  

వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై పార్టి వైఖరిని తెలియజేసే 22 తీర్మానాలను మహాసభ ఆమోదించింది.

భారత రిపబ్లిక్ కు గల లౌకిక ప్రజాస్వామిక స్వభావాన్ని, భారత రాజ్యాంగాన్ని,   రాజ్యాంగం ఇచ్చిన హక్కులను  హిందూత్వ మతోన్మాద శక్తులు చేస్తున్న  తీవ్రమైన దాడినుండి కాపాడుకునేందుకు  మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకముగా వర్గ పోరాటాలను ప్రజాపొరాటాలను  ఉధ్రుతం   చేసేందుకు భారత  దేశ భక్తులందరూ సమీక్రుతం కావాలని మహాసభ  విజ్ఞప్తి చేస్తున్నది.