ప్రధాన కర్తవ్యం బిజెపి ని ఒంటరిదిగా చేయటం, ఓడించటం
కన్నూరు (కేరళ) లొ 2022 ఏప్రిల్ 6 నుండి 10 వరకు జరిగిన భారత కమ్యూనిస్టు
పార్టీ(మార్క్సిస్టు) 23వ అఖిల భారత మహాసభ జయప్రదముగా జరిగినది. మహాసభ 85 మంది కేన్ద్ర
కమిటి సభ్యులను ఎన్నుకున్నది. ఈ 87 మంది కేన్ద్ర కమిటీ సభ్యులు ప్రధాన
కార్యదర్శిగా కా. సీతారాం ఏచూరిని మరియు 17 మంది పొలిట్ బ్యూరో సభ్యులను
ఎన్నుకున్నారు.
మహాసభకి కొద్ది నెలల ముందే కేన్ద్ర కమిటీ ఒక ముసాయిదా రాజకియ తీర్మానాన్ని ఆమోదించి
దానిని పార్థి వెబ్ సైట్లు, బుక్ షాప్ ల
ద్వారా బహిరంగముగా సర్క్యులేషన్ లొ పెట్టింది. సభ్యుల నుండి ఈ ముసాయిదా కి సవరణలను
ఆహ్వానించింది. ఈ విధముగా దేశ వ్యాపితముగా 4001 సవరణలు వచ్చాయి. మహా సభలో
పాల్గొన్న ప్రతినిధుల నుండి 390 సవరణలు మరియు 12 సలహాలు వచ్చాయి. మహాసభ వీటన్నింటి
ని పరిశీలించి కొన్ని సవరణలను ఆమోదించి వాటిని రాజకియ తీర్మానం లొ పొందు పరిచింది.
ముగింపు రోజున జరిగిన బహిరంగ సభకు మానవ మహాసముద్రము అక్కడ వున్నదా అనే విధముగా ప్రజలు హాజరయ్యారు. కేరళలో సిపిఐ(ఎం)
పార్టీ ప్రజా పునాది లోతుగా వేళ్లూనుకుని వున్నదనటానికి ఇది నిదర్శనముగా వున్నది.
ఈ మహాసభ ఆమోదించిన రాజకీయ తీర్మానం, బిజెపి
ని ఒంటరి చేయటం, ఓడించటం ప్రధాన కర్తవ్యమని నిర్ద్వంద్వముగా
ప్రకటించింది. బిజెపి తన ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని
ఫాసిస్టు శక్తి అయిన ఆర్ఎస్ఎస్ యొక్క హిందూత్వ మతోన్మాద ఎజెండాని దూకుడుగా ముందుకు
తీసుకెళ్లుతున్నది. (హిందూత్వ అనేది హిందూ మతం కాదు. అది మతం ప్రాతిపదికగా
దేశాన్ని నిర్మించాలనే ఒక ఉన్మాదపూరిత రాజకియ సిద్ధాంతం. మత రాజ్యాలన్నీ
నియంత్రుత్వాన్ని అమలు చేస్తున్నాయి. ప్రజల
కష్టాలను పెంచుతున్నాయి) దీనితో పాటుగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలను బహు ముఖముగా మరియు తీవ్రముగా అమలు చేస్తున్నది. ఈ విధముగా మతోన్మాద శక్తుల- కార్పొరేట్ల బంధాన్ని పటిష్ట వంతం చేస్తున్నది. జాతియ ఆస్తుల
లూటీ జరుగుతున్నది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేస్తున్నది. (ఇతర కంపెనీలతో
పోటీపడి లాభాలు పొందటం కాకుండా రాజకీయపరమైన అనుబంధముతో ప్రభుత్వము తమకి అనుకూలముగా తీసుకునే చర్యల ద్వారా లాభాలు పొందటం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు సారాంశం). రాజకీయ అవినీతిని
చట్టబద్ధం చేస్తున్నది. పూర్తి స్థాయి నియంత్రుత్వాన్ని అమలు చేస్తున్నది.
బిజెపి ని ఒంటరి చేయటం, ఓడించటం అనే లక్ష్యం నెరవేరేందుకు సిపిఐ (ఎం) సొంత బలం గణనీయమైన స్థాయిలొ పెరగాలి. అలా అయితేనే
పార్టీకి
రాజకీయ జోక్యపు శక్తి సామర్థ్యాలు ప్రభావితం చేసేవిగా వుంటాయి. మహాసభలొ చర్చించి
ఆమోదించబడిన రాజకీయ నిర్మాణ నివేదిక పార్టీ
బలాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన రాజకీయ నిర్మాణ పరమైన కర్తవ్యాలను
నిర్దేశించింది. ఈ కర్తవ్యాల అమలుకు
పార్టీ నిర్ణయించింది.
పార్టీ తన బలాన్ని పెంచుకోవటం తో పాటు వామ పక్ష శక్తుల ఐక్యత ను బలోపేతం చేయాలని
నిర్ణయించింది. పాలక వర్గాల విధానాలకు ప్రత్యామ్నాయముగా
ఒక విధానపరమైన కార్యక్రమం ప్రాతిపదికగా వామపక్ష
ప్రజాస్వామిక సంఘటన ఏర్పాటుకు కృషి చేస్తుంది. ఈ ప్రాతిపదికన ప్రజాపొరాటాలకు పదును చేకూర్చాలి.
ఇంతే గాక హిందూత్వ మతొన్మాదానికి
వ్యతిరేకముగా లౌకిక శక్తులను విశాల ప్రాతిపదికన సమీకరించాలి. హిందూత్వ మతొన్మాదపు
సవాళ్లను రాజకియ, సైద్ధాంతిక, సామాజిక, సాంస్క్రుతిక, మరియు సంస్థాగత – ఈ విధముగా అన్ని
రంగాలలోను ఎదుర్కోవాలని పార్టీ నిర్ణయించింది.
వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై పార్టి వైఖరిని తెలియజేసే
22 తీర్మానాలను మహాసభ ఆమోదించింది.
భారత రిపబ్లిక్ కు గల లౌకిక ప్రజాస్వామిక స్వభావాన్ని, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం
ఇచ్చిన హక్కులను హిందూత్వ మతోన్మాద
శక్తులు చేస్తున్న తీవ్రమైన దాడినుండి
కాపాడుకునేందుకు మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు
వ్యతిరేకముగా వర్గ పోరాటాలను ప్రజాపొరాటాలను ఉధ్రుతం చేసేందుకు
భారత దేశ భక్తులందరూ సమీక్రుతం కావాలని మహాసభ
విజ్ఞప్తి చేస్తున్నది.
No comments:
Post a Comment