Monday, May 23, 2022

.దేవుడు మనుషుల్ని సృష్టించాడా లేక మనుషులే దేవుణ్ణి సృష్టించారా

 సమాజం లో వచ్చిన మార్పుల ప్రకారం  పాత దేవుడి ప్రాధాన్యత  పోయి కొత్త దేవుడి ప్రాధాన్యత పెరుగుతుంది. ఒకప్పుడు ఇంద్రుడు గొప్ప దేవుడు. కానీ ఆ తరువాత కృష్ణుడు ఇంద్రుణ్ణి  ఓడిస్తాడు.  దశావతారాలు దేవుని పరిణామ క్రమానికి నిదర్శనం. ప్రజలకు అర్థం కానీ  భాషలోనే (సంస్కృతం, హిబ్రూ, అరబిక్ )దేవుడు మాట్లాడుతాడు. ఒక ప్రాంతపు గుడి గోపురాలకు మరో  ప్రాంతపు  గుడి గోపురాలకు తేడా  వుంటుంది. ఒక మతగ్రంధానికి మరో మత గ్రంధానికి తేడా ఉంటుంది. మత గ్రంధాలు  మరియు మంత్రాలు పాలకుల భాషలో లేదా  ప్రజాలకు తెలియని భాషలో వుంటాయి. 

అన్నమయ్య,  భద్రాచల రామదాసు, త్యాగయ్య,  నారాయణ తీర్థ , తులసి దాస్ గోస్వామి, చైతన్య మాహా ప్రభు, సూఫీ కవులు (బుల్లే ష, రూమి, కబీర్ మొ.)   తదితర  భక్తి తత్వ కవులు మాత్రమే ప్రజల భాష లో తమ భక్తి భావాన్ని కవిత్వముగా వెల్లడించారు. మతం పేరుతో నేక యుద్ధాలు జరిగాయి. కానీ అవి అంతిమముగా పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసమే జరిగాయి. 

ఇంతేగాక  పాలక వర్గాలు  (భారతదేశపు నేటి పాలక వర్గాలు బడా పెట్టుబడిదారుల నాయకత్వాన వున్న పెట్టుబడిదాఋ  మరియు భూస్వామ్య వర్గాలు)  తమ అవసరాల కోసం మతాన్ని వాడుకున్నారు. గతం లో  మతోన్మాదాన్ని నిరాకరించిన భారత పాలక వర్గాలు రోజు రోజుకు తమ విధానాల వలన ప్రజల ఇబ్బందులు పెరుగుతున్నందున  తమ జోలికి ప్రజలు  రాకుండా మతోన్మాదాన్ని ప్రజల మెదళ్ళ లోకి ఎక్కించి ఉన్మాదాన్ని రెచ్చగొట్టే వారినే అందలం ఎక్కించే పనిలో వున్నాయి. చాణక్యుడు దేవుడు లేకున్నా సృష్టించితేనే పాలకుల ప్రయోజనాలు నెరవేరతాయన్నాడు. దేవుడు లేకుంటే సృష్టించాలి. దేవుడున్నాడని నమ్మితేనే భార్య, నౌకరు విశ్వాస పాత్రముగా వుంటారని ఫ్రెంచి  దేశపు  ప్రముఖ రచయిత   వోల్టేయిర్ అన్నాడు.

గతం లో కాశ్మీర్ ను  పాలించిన శ్రీహర్షుడనే రాజు వృధా ఖర్చు చేసినందున ఖజానా ఖాళీ కాగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు "దేవోత్పతన నాయక" అనే మంత్రిని ఏర్పాటు చేశాడు. ఆ మంత్రి పని నిధులున్న దేవాలయాలను కొల్ల గొట్టి ప్రభుత్వానికి నిధులు సంకుర్చటం.  ఇదే విధముగా వాజపాయి గారి  ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి డిజిన్వెస్ట్మెంట్ శాఖ ఏర్పాటు చేసి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మింది.  కానీ ఆ తరువాత  వచ్చిన యు పి ఏ ప్రభుత్వము తనకు మద్దతునిస్తున్న వామ పక్షాల  ఒత్తిడి వలన ఈ శాఖను రద్దు చేసింది. ఇప్పుడు మోడి ప్రభుత్వము ఇంతకన్నా ముందుకెళ్లి ప్రభుత్వ రంగ ఆధీనములో వున్న  మౌలిక వనరులను (infrastructure ) అత్యంత వేగముగా దశాబ్దాల  పాటు విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్స్ కు అద్దెకు ఇస్తున్నది.!


దేవుణ్ణి మతాన్ని సృష్టించింది మనుషులేనని ఇటువంటి అనేక  ఉదాహరణలున్నాయి. మతాన్ని రాజకీయాలకు జోడించి విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు కోసం రాజకీయం చేయటం,  ఒక వంక జాతీయ ఆస్తులను విదేశీ పరం చేసే విధానాలను అమలు చేస్తూ  మరో వంక మతం పేరుతో జాతీయతాను నిర్ధారిస్తామని చెప్పే రాజకీయాలను తిరస్కరించక పోతే భవిష్యత్తులో మనము మోసపోవటమే గాక సర్వస్వము  కోల్పోయే పరిస్తితి వస్తుంది. 

"మతములన్నియు మాసి పోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును" అని మహాకవి గురజాడ వెంకట అప్పా రావుగారి  సూక్తిని ఈ సందర్భముగా  గుర్తుంచుకోవాల్సిన అవసరం వున్నది. కనీసం అన్ని  మతాలను  విడనాడి నన్ను మాత్రమే నమ్ముకోమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన  విషయాన్ని గుర్తుంచుకుని  "నన్ను మాత్రమే నమ్ముకో" అని సృకృష్ణుదన్న దాని అర్థం మనకి పట్టబోతున్న ఆర్థిక ఇబ్బందులనెదుర్కోటానికి మన దేశాన్ని దివాలా తీయించే ఆర్థిక విధానాలకి వ్యతిరేకముగా ఉద్యమాన్ని బలపరచటమే,  దానిని నమ్ముకొటమేనని మనము గుర్తించాలి. 





No comments:

Post a Comment