కాంట్రాక్ట్ సైనికుల రిక్రూట్
మెంట్ కు
“అగ్ని పథ్”
నాలుగు సంవత్సరాలు పని చెసె కాంట్రాక్ట్ సైనికుల
రిక్రూట్‌మెంట్ స్కీమును “అగ్నిపథ్” పెరు తొ మోడీ ప్రభుత్వము
ప్రకటించింది. ఇందుకు వ్యతిరేకముగా దేశ వ్యాపితముగా యువజనుల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
రెండేళ్లుగా సాధారణ సైనిక నియామకాలు జరగడం లేదు. 2021 నాటికి దేశ
సైన్యంలో 1,04,653 మంది కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాంతీయ
కోటాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఆరు నెలల శిక్షణ కాలంతో సహా నాలుగు సంవత్సరాల
స్వల్పకాలిక ఉద్యోగ కల్పనకు నిర్ణయించింది. నాలుగేళ్ల తర్వాత దాదాపు మూడు వంతుల మంది
సైనికులు పెన్షన్, గ్రాట్యుటీ లేకుండా పదవీ విరమణ చేస్తారని
తెలపడం దారుణం. కేంద్ర ప్రభుత్వం
అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్టీకరణ చేస్తున్నాయి.
ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయి. ఈ విధానాలు దేశంలోని శ్రామికుల ఉద్యోగ భద్రత, ఆర్థిక
స్థిరత్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి దారితీస్తున్నాయి. ఈ విధానం వలన గడువు ముగిసి నిరుద్యోగులైన సైనికులు ప్రయివేటు
కిరాయి సైనికులుగా నెట్టబడతారు. ఇప్పటికే
తీవ్రమైన ఒడిదుడుకుల పాలైన మన సామాజిక వ్యవస్థ
పై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరముగా వుంటాయి.
దేశ సార్వభౌమాధికారంపై ఈ నయా ఉదారవాద
దాడులను తీవ్రంగా వ్యతి రెకించాలి. అగ్నిపథ్
పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని, సాయుధ దళాలకు రెగ్యులర్ రిక్రూట్‌మెంట్
నిర్వహించాలని కోరుతూ యువజనులు చేస్తున్న ఉద్యమాన్ని
అందరూ బలపరచాలి.
No comments:
Post a Comment