Thursday, February 6, 2014

భారత దేశ పరిశ్రమల సరే్వ

భారత దేశం పరిశ్రమల సర్వే(రిపోర్టు సమర్పించిన ఫ్యాక్టరీల వివరాలు)
 
క్ర.సం
విషయం
సంవత్సరం
 
 
 
2008-09
2009-10
 
1.
 
రిపోర్టు చేసిన ఫ్యాక్టరీల సంఖ్య
155247
159460
 
2.
 
రోజుకు సగటున ఉద్యోగులు
 
 
అ)మొత్తం ఉద్యోగులు
 
 
ఆ) మొత్తం కార్మికులు
 
 
ఇ) పురుష కార్మికులు
 
 
ఈ) మహిళా కార్మికులు
 
 
ఊ) కాంట్రాక్టు కార్మికులు
 
3.
 
రోజుకి ఉద్యోగికి అయిన ఖర్చు
రు. 410.41
రు. 464.93
 
4.
 
ఉత్పత్తి ఖర్చులో లేబర్ ఖర్చు శాతం
5.56
5.77
 
5.
 
రోజుకి తలకి  వేతనం (రూపాయిల్లో)
 
 
అ) ఉద్యోగులందరికి సగటున
330.35
372.82
 
 
ఆ) కార్మికులందరికి సగటున
211.95
240.38
 
 
ఇ)పురుష కార్మికునికి
258.04
288.14
 
 
ఈ) మహిళా కార్మికురాలికి
131.23
145.63
 
ఉ) కాంట్రాక్టు కార్మికునికి
160.53
193.87

 

 

 

(భారత ప్రభుత్వ లేబర్ బ్యూరోఇచ్చిన గణాంక వివరాలు)

 

Wednesday, February 5, 2014

పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే ప్రయత్నాలు

పార్లమెంటు ఎన్నికలు జరిగిన అనంతరం గెలిచిన ఎం పి లు ప్రధాన  మంత్రిని ఎన్నుకోవాలి. ఇది పార్లమెంటరీ విధానం. కాబట్టి ఫలానా వారు ప్రధాన మంత్రి అభ్యర్థి అని ముందే ప్రకటించటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య  పద్ధతికి విరుద్ధం. అయినప్పటికి బి జె పి వాళ్ళు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారికముగా ప్రకటించకపోయినా రాహుల్ గాంధీయే తమ ప్రధాన మంత్రి అభ్యర్థి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ వున్న మన దేశములో ఎన్నికలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకోటానికే జరుగుతాయిగాని ప్రధాన మంత్రిని ఎన్నుకోటానికి జరగవు.ఆ విధముగా ముందే ప్రకటించటం పార్లమెంటరీ విధానానికి బదులు అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టే ప్రయత్నములో భాగమే.
భారత ప్రజలు తమ సార్వభౌమత్వాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రతి 5 సంవత్సరాలకి ఒక సారి పార్లమెంటు/శాసన సభ్యులను ఎన్నుకొంటారు.ఆ పార్లమెంటు/శాసన సభ్యులు తమ నియోజక వర్గ ప్రజలకు జవాబుదారీగా వుండాలి.  ఏ పార్టీకి లేదా ఏ సంఘటనకు ఎక్కువమంది పార్లమెంటు/శాసనసభ్యులు వుంటే వారు కేంద్రం లో/రాష్ట్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆవిధముగా ఏర్పడిన ప్రభుత్వము(కార్యనిర్వాహక వర్గము) పార్లమెంటుకు/శాసనసభకు జవాబుదారీగా వుండాలి.   పార్లమెంటు/శాసనసభ ప్రజలకు జవాబుదారీగా వుండాలి. అటువంటప్పుడు ఒక వ్యక్తిని “ప్రధానమంత్రి అభ్యర్థి” గా ముందే ప్రకటించటం పనికి రాదు. ఒక వేళ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన వ్యక్తి తన నియోజకవర్గములో ఓడిపోతే ఆ పార్టీ లేదా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదా? అత్యంత శక్తిశాలియయిన ఇందిరా గాంధీ కూడా ఎన్నికలలో ఓడిపోయింది. అందుకనే వామపక్ష పార్టీలు మినహా ఇతర పార్టీల నాయకులు ఒకటికన్నా ఎక్కువ నియోజక వర్గాలలో పోటీ చేస్తుంటారు. మన ప్రస్తుత ప్రధానమంత్రి తాను ప్రధాన మంత్రిగా  గా వున్న కాలం లో ఎన్నడూ  లోక్ సభకి  పోటీ చేయలేదు.
భారతదేశం లో వున్న వైవిధ్యాన్ని , భాష, సంస్కృతి , జాతి, మతం లలో బహుళత్వాన్ని దృష్టిలో వుంచుకుని మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగములో పొందుపరచారు. మన ప్రజాస్వామ్యం ఈ బహుళత్వాన్ని ప్రతిబింబించేదిగా వుండాలంటే రాజ్యాంగం యొక్క అన్ని  సంస్థలలో దీనికి చోటివ్వాలి. అందుకనే భారత దేశాన్ని ఏక శిలా సదృశమయినదిగా  కాకుండా  రాష్ట్రాల సమాఖ్యగా నిర్ణయించారు. రాజ్యాంగములో మొదటి అధికరణములోనే భారత దేశాన్ని “భారతదేశమంటే రాష్ట్రాల సమాఖ్య” అని నిర్వచించటం జరిగింది. కాబట్టి భారతదేశ సమాఖ్య స్వభావం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే కాపాడటం సాధ్యమవుతుంది. అధ్యక్ష పాలన వైవిధ్యము లేని దేశాలలో ప్రజలలో అత్యధికులు ఒకే భాష మాట్లాడుతూ ఒకే జాతిగా వున్న దేశాలలో సమర్థవంతంగా పని చేస్తుంది. కానీ ఇన్ని భాషలు, ఇన్ని జాతులు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని మతాలు వున్న మన దేశానికి అది కుదరదు.
బి జె పి/ఆర్ ఎస్ ఎస్ లు ఎప్పటినుండో మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష పాలనా విధానముగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయి. 1991 ఎన్నికల ప్రణాళికలో తాము గెలిస్తే ప్రస్తుత పార్లమెంటరీ పాలనా విధానానికి బదులు అధ్యక్ష పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టే విషయం పరిశీలించేందుకు ఒక కమిషన్ ను నియమిస్తామని బి జె పి అన్నది. అధ్యక్ష పాలనలో అధికారాలన్నీ అధ్యక్షునికే వుంటాయి. రాజ్యాంగం లోని వివిధ సంస్థలను నిర్వహించేందుకు అధ్యక్షుడు తనకి నచ్చిన వ్యక్తులను నియమిస్తాడు. ఇటువంటి అధ్యక్ష తరహా పాలన కావాలని బి జె పి కోరటం లో వుద్దేశం భారత లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థని పరమత సహనం లేని ఫాసిస్టు హిందూ రాజ్యముగా మార్చాలనే ప్రణాళికని ముందుకు తీసుకెళ్ళటానికే.
భారత రిపబ్లిక్ స్వర్ణోత్సవాల సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రసంగిస్తూ  ఆనాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్, పార్లమెంటరీ ప్రజాస్వామిక తరహా ప్రభుత్వ రూపాన్ని మన రాజ్యాంగ నిర్ణేతలు లోతుగా చర్చించి ఆలోచించిన అనంతరం నిర్ణయించారని అన్నారు. రాజ్యాంగ ముసాయిదాని తయారు చేసిన కమిటీ,  స్థిరత్వానికన్నా జవాబుదారీతనానికి, ప్రభుత్వాన్ని రోజూ పరీక్షనేదుర్కొనేలా చేయటానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని డాక్టర్ అంబేద్కర్ అన్నారని చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వ రోజు వారీ కార్యక్రమాలలో జవాబుదారీ తనం రాబట్టటం  కష్ట సాధ్యముగా వున్నదని అన్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్ణాయక సభ ఉద్దేశ పూర్వకముగా, బాగా ఆలోచించిన అనంతరం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన దేశానికి నిర్ణయించింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అప్పటివరకూ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చూసి మాత్రమే రూపొందించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాపు పునాదులు  మన దేశం లో ఎప్పటినుండో వున్నాయి. బౌద్ధ సంఘాలు పార్లమెంటరీ తరహా వ్యవస్థలని రాజ్యాంగ సభ లో  అంబేడ్కర్ అన్నారు. ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థలో వున్న తీర్మానాలు, వోటింగు, విప్ జారీ చేయటం వంటివి బౌద్ధ సంఘాలలో వుండేవన్నారు. కాబట్టే మన దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వరించటం సులువయిందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లోనే నియంతృత్వ పోకడలను(ఎమర్జెన్సీని) మనం అనుభవించాము. అధ్యక్ష తరహా పాలనలో ఈ నియంతృత్వ పోకడలకు మరిన్ని ఎక్కువ అవకాశాలుంటాయి.
కాంగ్రెస్, బి జె పి లు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను తాము నెరవేర్చనందునే, ఆ ఒత్తిడి కారణంగానే తమ మిత్రపక్షాలు తమ నుండి దూరమయ్యాయని బి జె పి, కాంగ్రెస్ లు గుర్తించాలి. తమ జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తున్న ఆర్థిక భారాలనుండి ప్రజలు ఉపశమనాన్ని కోరుతున్నారు. ఆర్థిక విధానాలు, అవినీతి విషయం లో కాంగ్రెస్ కు, బి జె పి కి తేడా లేదని ప్రజలు సరిగానే గుర్తించారు. కుంభకోణాల మరకలున్న యెడియూరప్పను తిరిగి తమ పార్టీలో చేర్చుకోటం, కోర్టు దోషి అని తేల్చిన తరువాత కూడా గుజరాత్ మంత్రివర్గం లో మోడీ ఒక మంత్రిని కొనసాగించటం ఉన్నత స్థానాలలో అవినీతిని బి జె పి ఏ విధముగా సమర్థిస్తున్నదీ రుజువు చేస్తున్నది.
పార్లమెంటులో అనుభవం కూడా బి జె పి, కాంగ్రెస్ ల మధ్య తేడా లేదని రుజువు చేస్తున్నది. 2జి స్పెక్ట్రమ్ కుంభ కోణం, బొగ్గు కుంభ కోణం వంటి కుంభకోణాలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అల్లరి చేసి బి జె పి అడ్డుకున్నది. ఇందుకు కారణం ఈ చర్చ జరిగితే వాజపాయీ హయాములో తమ పాలనలో జరిగిన కుంభకోణాలు బయటపడతాయని భయపడటమే. కాబట్టి ఈ విషయములో కాంగ్రెస్-బి జె పి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు అవాస్తవమని అనుకోలేము. కోట్లాది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ప్రమాదం తెచ్చే విధముగా పెన్షన్ ఫండ్స్ లో ఎఫ్ డి ఐ కి అనుమతించే బిల్లుకు పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లు రెండూ కలిసి ఆమోదించాయి. బ్యాంకుల జాతీయకరణ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధముగా ప్రయివేటీకరణ మరియు విదేశీ ఫైనాన్స్ కంపెనీలను అనుమతించే బిల్లును పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లు రెండు కలిసి బలపరచాయి. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ ను  అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడి సంస్థల జూదానికి బలి చేసే విధానాలను కాంగ్రెస్, బి జె పి లు సమర్థిస్తున్నాయి, రెండూ ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి.
ఈ పరిస్థితులలో ప్రజలు కాంగ్రెస్, బి జె పి లకు ప్రత్యామ్నాయముగా ఏదయినా బలమయిన శక్తి కనపడితే దానికి వోటు వేస్తున్నారు. ఢిల్లీ లో ఆం ఆద్మీ పార్టీ విజయం ఇందుకు నిదర్శనం.ఒక ఆదర్శ వంతమయిన, అవినీతి రహితమయిన లౌకిక ప్రజాస్వామిక రాజ్యాన్ని సాధించాలనే ఆకాంక్ష తో మధ్యతరగతి ప్రజలు ఆం ఆద్మీ పార్టీని ఢిల్లీ లో సమర్థించారు. మధ్యతరగతిలో వున్న ఈ మద్దతుతోపాటు గృహాలకు సగం రేటుకే విద్యుత్తు, 700 లీటర్ల ఉచిత నీరు వంటి వాగ్దానాల జల్లులతో ఆం ఆద్మీ పార్టీ విజయాన్ని సాధించింది.
అయితే అటువంటి “ఆదర్శ రాజ్యం” సరళీకృత ఆర్థిక విధానాల పరిధిలో  సాధ్యమయ్యేది కాదు. అవినీతి, ప్రజలపై భారాలు అనేవి కాంగ్రెస్ లేదా బి జె పి నాయకత్వాలలో వున్న సంఘటనలు అమలు చేసే విధానాలలో అవిభాజ్యమయిన భాగాలుగా వున్నాయి. ఈ విధానాలకు భిన్న మయిన ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తేనే అవినీతిని, ప్రజలపై భారాన్ని నివారించటం సాధ్యమవుతుంది. ఆం ఆద్మీ పార్టీ మత తత్వ శక్తులు, ఆర్థిక విధానాల విషయం లో తన వైఖరి ఏమిటో స్పష్టం చేయటం లేదు. మన దేశ విదేశాంగ విధానం ఏ విధముగా వుండాలి, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు- ఈ విషయాల పట్ల కూడా తన వైఖరి ఏమిటో ఆం ఆద్మీ పార్టీ చెప్పటం లేదు. ప్రత్యామ్నాయ విధానాలు కావాలనే వైఖరి లోపిస్తే అది ప్రస్తుత ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు అవినీతి మరియు  ప్రజలపై భారాలు మోపే విధానాలు బలపడటానికే దారి తీస్తుంది.
కాబట్టి ఇప్పుడు అనుసరించబడుతున్న ఆశ్రిత పెట్టుబడిదారీ అవినీతికర విధానాల స్థానం లో ప్రత్యామ్నాయ విధానాలు రావాలి. ప్రజందరికి సార్వత్రికముగా హక్కులిచ్చే విధానాలు కావాలి.  దాన ధర్మం లాగా కాకుండా అందరికీ ఆహార భద్రత, ఉచిత ఆరోగ్య సంరక్షణ, సార్వత్రిక ఉచిత విద్య,  పని హక్కు లేదంటే తగినంత నిరుద్యోగభృతి, వయోవృద్ధుల సంరక్షణ, భిన్న సామర్థ్యం కలవారికి(వికలాంగులకు) తగు పథకాలు -ఇవి ప్రత్యామ్నాయ విధానపు ముఖ్య భాగాలుగా వుండాలి. ఈ ప్రత్యామ్నాయ విధానం మానవతా దృష్టి రీత్యా మాత్రమే గాక ఆర్థిక అభివృద్ధి  పరంగా కూడా సమంజసమయిందే. ప్రజలకు ఈ హక్కులివ్వటం వలన దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమయిన అదనపు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలుశక్తి పెరిగితే సరుకుల తయారీ పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, దాని వలన ఉద్యోగిత విస్తారంగా పెరుగుతుంది. ఫలితముగా ఆర్థిక సమానతతో కూడిన ఒక మన్నికగల ఆర్థిక పెరుగుదల సాధ్యమవుతుంది.
కాబట్టి మనకు కావాల్సింది ఎన్నికల ప్రత్యామ్నాయం మాత్రమే కాదు. ఒక శక్తివంతమయిన ప్రజాపోరాటం మాత్రమే 2014 లో అటువంటి వామ పక్ష-ప్రజాస్వామిక-లౌకిక ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురాగలదు.
(పీపుల్స్ డెమోక్రసీ 2.2.2014 సంచికలో సీతారాం యేచూరి సంపాదకీయానికి ఇది స్వేచ్ఛానువాదం)



Tuesday, February 4, 2014

అమెరికా ప్రజా గాయకుడు పీట్ సీగర్ కు నివాళి

కష్ట కాలం లో ఆశలను రేకెత్తించి భవిష్యత్తు పై విశ్వాసాన్ని  కలిపించే పాట “we shall overcome” (మేము అధిగమిస్తాము). ఈ పాట ఈ విధముగా వుంటుంది:
1.     Weshall overcome
We shall overcome
We shall overcome some day
CHORUS
 Oh, deep in my heart

I do believe
We shall overcome
Some day
2.    We’ll walk in hand
We’ll walk in hand
We’ll walk in hand some day
           CHORUS
3.    We shall all be free
We shall all be free
We shall all be free some day
            CHORUS
4.    We are not afraid
We are not afraid
We are not afraid some day
            CHORUS

5.    We are not alone
We are not alone
We are not alone some day
            CHORUS
6.    The whole wide world around
The whole wide world around
The whole wide world around some day
           CHORUS
7.    We shall overcome
We shall overcome
We shall overcome some day
“వుయ్ షల్  ఓవర్ కం”- ఇవి మూడు మాటలే. కానీ ఇవి ఆత్మ విశ్వాసం కలిగిస్తాయి. అమెరికాలో నల్ల జాతి ప్రజల పౌరహక్కుల కోసం మార్టిన్ లూథర్ కింగ్ ఆద్వర్యం లో జరిగిన ఉద్యమం సందర్భం గా ప్రతి సమావేశములో ఈ పాట పాడే వాళ్ళు. ఇదే పాటను భారతదేశములో విద్యార్థి ఉద్యమం, కార్మికోద్యమం తమ సమావేశాలలో అనేక సందర్భాలలో ఆలాపిస్తున్నది. దీనిని “హామ్ హోంగే కామ్ యాబ్” అనే పేరుతో హిందీలోకి అనువదించారు.
దీనిని “ ఐ విల్ ఓవర్ కం “ అనే క్రైస్తవ గీతం ఆధారముగా రూపొందించారు. దీనిని ప్రజలలో విస్తృతముగా ప్రచారం లోకి తెచ్చింది అమెరికా ప్రజా గాయకుడు పీట్ సీగర్. తన పాటలు ఎప్పటినుండో ప్రజలు పాడుకునే పాటలేనని, అయితే తాను వాటిని పాడి మరింత ప్రచారం లో పెడుతున్నానని ఆయన అనే వాడు. అమెరికా లో కమ్యూనిస్టు వ్యతిరేకతని మెకార్థే రెచ్చగొట్టిన కాలము లో పీట్ సీగర్ ను, మరో గాయకుడు పాల్ రాబ్సోన్ ను, ప్రసిద్ధ నటుడు చార్లీ చాప్లిన్ ను అనేక వేధింపులకు గురి చేశారు. ఆయనను కమ్యూనిస్టు అని చెప్పి బ్లాక్ లిస్టు లో పెట్టారు. అమెరికా పార్లమెంటును ధిక్కరించారనే పేరుతో ఆయనకు ఒక సంవతరం జైలు శిక్ష విధించారు. అమెరికా జానపద గేయాలను వెలికి తెచ్చి వాటిని తాను పాడి ప్రసిద్ధి కలిపించారు. అమెరికా కార్మికోద్యమానికి, పౌర హక్కుల ఉద్యమానికి, వియత్నాం లో అమెరికా యుద్ధానికి వ్యతిరేకముగా జరిగిన ఉద్యమానికి  మద్దతుగా ఆయన పాటలు పాడారు. చివరికి ఆయన ప్రతిభను అమెరికా ప్రభుత్వము కూడా గుర్తించక తప్ప లేదు. ఆనాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమెరికా లో కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం “నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్’తో ఆయనను సన్మానించారు. అణగారిన ప్రజల హక్కుల కోసం జరిగిన పోరాటాలలో ఆయన పాల్గొన్నారు. హడ్సన్ నది కాలుష్యానికి వ్యతిరేకముగా ఆయన నాయకత్వములో జరిగిన 4 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఫలితముగా చివరికి ఆ కాలుష్యానికి కారణమయిన  జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ దిగివచ్చి ఆ నదిని శుద్ధి చేస్సేందుకు 50 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.
2011 లో “ఆక్యుపై వాల్ స్ట్రీట్” ఉద్యమములో తన వయసు అప్పటికి 90 సంవత్సరాలయినా తన పాటలు వినిపించి ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించారు.
ఈ గొప్ప ప్రజా గాయకుడు 27.1.2014న 94 సంవత్సరాల వయసులో  మరణించారు. వారికి శ్రద్ధాంజలి.
పీట్ సిగార్ పాట “వుయ్ షల్ ఓవర్ కం” ను ఇక్కడ క్లిక్ చేసి వినండి.http://youtu.be/QhnPVP23rzo


Monday, February 3, 2014

నేటినుండి స్పెక్ట్రమ్ వేలం; నందిగ్రామ్ నయవంచన

నేటినుండి స్పెక్ట్రమ్ వేలం

1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో 403 మెగాహెర్ట్జ్ పరిమాణపు స్పెక్ట్రమ్ ను, 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో 46 మెగాహెర్ట్జ్ పరిమానపు స్పెక్ట్రమ్ ను ప్రభుత్వము నేటి (3.2.2014)నుండి వేలం వేస్తుంది. ఈ రెండు బ్యాండ్లు  2జి స్పెక్ట్రమ్ బ్యాండ్లు. ఈ వేలం లో పాల్గొనేందుకు ఎయిర్టెల్, వోడాఫోన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, ఐడియా,టెలీ వింగ్స్(యూనినార్), రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్ మరియు ఎయిర్సెల్-మొత్తం 8 కంపెనీలు ముందుకు వచ్చాయి.ఈ నవంబరులో వోడాఫోన్ లైసెన్సు కాలం 20 సంవత్సరాలు ఢిల్లీ, ముంబయి మరియు కలకత్తా లలో అయిపోతుంది. ఎయిర్టెల్ లైసెన్సు ఢిల్లీ, ముంబాయిలలో అయిపోతుంది.లూప్ లైసెన్సు ముంబయి లో అయిపోతుంది. కాబట్టి ఇవి ఈ సర్కిల్సు లో తమ సర్వీసులను కొనసాగించాలంటే ఈ వేలం లో పాల్గొని స్పెక్ట్రమ్ ను మళ్ళీ కొనాలి. బి ఎస్ ఎన్ ఎల్ కు లైసెన్సు కాలం 20 సంవత్సరాలు 2020 లో పూర్తి అవుతుంది. తగినంత స్పెక్ట్రమ్ కూడా వున్నది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ ఈ వేలం లో పాల్గొనాల్సిన అవసరం లేదు.

పైన తెలియజేసిన కంపెనీలలో ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మరియు లూప్ లు ఈ వేలం పై స్టే ఆర్డరు కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. తమ లైసెన్సు కాలం 20 సంవత్సరాలు నవంబరుతో అవుతున్నప్పటికీ మరో 10 సంవత్సరాలు దానిని పొడిగించి తమకున్న స్పెక్ట్రమ్ ను మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా వుండేందుకు ఆర్డర్సు ఇవ్వాలని కోరుతూ ఈ ఈ కంపెనీలు టి డి శాట్ (టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అథారిటీ) వద్దకు వెళ్ళాయి. కానీ టి డి శాట్ వారి కోరికను నిరాకారిస్తూ ఆర్డర్సు ఇచ్చింది. దీనికి వ్యతిరేకముగా ఈ కంపెనీలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. తమ పిటిషన్ పై తుది తీర్పు ఇచ్చే లోగా ఈ స్పెక్ట్రమ్ వేలము పై స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరాయి. ఈ కంపెనీల పేటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.  కానీ ఇవి కోరిన విధముగా స్పెక్ట్రమ్ వేలం పై స్టే ఆర్డరు ఇచ్చేందుకు నిరాకరించింది. కాబట్టి ఈ కంపెనీలు కూడా వేలం లో పాల్గొనటం అనివార్యమయింది.

వేలం కు పెట్టిన స్పెక్ట్రమ్ మొత్తం అమ్ముడుపోతుందని, దీని వలన ప్రభుత్వానికి కనీసం రు.11000 వస్తాయనీ అంచనా.

నందిగ్రామ్ నయవంచన


నిజాలను ఎల్లకాలం తొక్కిపెట్టి ఉంచడం సాధ్యం కాదు. 2007లో పశ్చిమ బెంగాల్‌ తూర్పు మేదినిపూర్‌ జిల్లా నందిగ్రామ్‌ దుమారం నిజానిజాలు ఇప్పుడు అధికారికంగా బయట పడటం ఆహ్వానించ దగింది. నాటి వామపక్ష సంఘటన ప్రభుత్వాన్ని అస్థిర పర్చటానికి తృణమూల్‌ నాయకురాలు మమతా బెనర్జీ, మావోయిస్టుల మిలాఖత్తుతో అన్ని వామపక్ష వ్యతిరేక శక్తులను కూడదీసుకుని జరిపిన మహాకుట్ర రూపురేఖలు ఇప్పుడు బయట పడుతున్నాయి. పాలకవర్గం మొత్తం, దాని మీడియాతో సహా ఈ కుట్ర వెనక ఉన్న తీరు బహిర్గతమైంది. వామపక్ష సంఘటన ప్రభుత్వానికి, దానికి నాయకత్వం వహిస్తున్న సిపిఎం పార్టీకి వ్యతిరేకంగా బెంగాల్‌లోనే గాక దేశ వ్యాపితంగానూ, అంతర్జాతీయంగా కూడా దుష్ప్రచారంతో ఊదరగొట్టడం జరిగింది. కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కారు అందుకు వత్తాసుగా నిలిచి వంత పాడింది. ఇప్పుడు ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబిఐ ద్వారానే ఆ మాటలన్నీ కట్టుకథలని తేలిపోయింది.
  
సెజ్‌ల పేరిట భూములు కట్టబెట్టే సరళీకరణను నికరంగా వ్యతిరేకించేది వామపక్షాలేనని అందరికీ తెలుసు. ఉన్న పరిమితుల్లోనే పరిశ్రమలు స్థాపించే ఉద్దేశంతో ఒక క్రమబద్ధమైన విధానం మేరకు వామపక్ష ప్రభుత్వం నందిగ్రామ్‌ ప్రాంతంలో భూమి సేకరించాలని తొలుత అనుకున్నా వ్యతిరేకత రావటంతో ఆలోచన విరమించుకుంది. అందుకోసం ఏ చర్యా తీసుకోకుండానే తలాతోక లేని ఒక ప్రకటనను పట్టుకుని తృణమూల్‌ అండదండలతో భూమి ఉచ్ఛేద్‌ ప్రతిరోధ సమితి(బియుపిఎస్‌) ఏర్పాటు చేసి విష ప్రచారం సాగించారు. భూసేకరణ జరగదని అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య బహిరంగంగానే ప్రకటించారు. అంతకు ముందే బెంగాల్‌ హుగ్లీ జిల్లా సింగూర్‌లో టాటా కార్ల తయారీ కర్మాగారం రాకుండా మమతా బెనర్జీ నానా యాగి చేశారు. అత్యధికులు భూమి ఇష్టపూర్వకంగా ఇచ్చినా ఎవరో కొంతమంది ఇష్టపడ లేదంటూ నిరాహారదీక్షలు, నిరసనల ప్రహసనం నడిపింది. ఆఖరికి టాటా అక్కడి నుంచి గుజరాత్‌కు వెళిపోయే వరకూ ఆగలేదు. ఒక పక్క సింగూరు వివాదం నలుగుతూ ఉండగానే నందిగ్రామ్‌లో చిచ్చు రగిల్చారు. వామపక్ష ప్రభుత్వం పంట భూములూ, మందిరాలు-మసీదుల భూములూ అన్నీ బలవంతంగా లాక్కుంటుందని 2007 సంవత్సరం మొదటి నుంచే ప్రచారం మొదలయింది. పైగా అక్కడ భయంకరమైన విషపూరిత పరిశ్రమ నెలకొల్పటం జరుగుతుందని, దానివల్ల నది-సముద్రం నీరు, మట్టి అన్ని విషమయం అయిపోతాయని హడలగొట్టారు. ఈ దుష్ప్రచార గందరగోళానికి తోడుగా మావోయిస్టుల సహాయంతో హింసాత్మక ఆందోళన నడిపారు. రోడ్లు తవ్వేసి, వంతెనలు కూల్చేసి పోలీసు ప్రవేశించకుండా ఇబ్బంది కలిగించారు. ఆ నేపథ్యంలోనే 2007 మార్చి 14న పోలీసు ప్రవేశం తర్వాత విచారకరమైన ఘటనలు జరిగితే వాటి ఆధారంగా మరింత విష ప్రచారం నడిపించారు. బడా మీడియాలో, ఇంటర్నెట్‌లో ఘోరమైన ఎన్నో కథనాలు వ్యాప్తి చేసి వామపక్ష ప్రభుత్వం కూడా అమానుషమైందన్నట్టు కట్టుకథలు వ్యాపింప జేశారు. నేటి ముఖ్యమంత్రి, ఆమె పార్టీ తృణమూల్‌ ఆ రోజుల్లో పోలీసుల ముసుగులో సిపిఎం కార్యకర్తలు నందిగ్రామ్‌లో హత్యాకాండకు పాల్పడ్డారని అదేపనిగా ప్రచారం చేశారు. పసి పిల్లల్ని కాళ్ళు నరికి తాల్‌పాటి చెరువులో పడేశారని, ట్రాక్టర్లతో శవాలు నందిగ్రామ్‌ నుంచి తరలిస్తే హల్దీ నదిలో తేలాయని అంతులేని అబద్ధాలు వ్యాపింపజేశారు. దక్షిణ 24 పరగణా జిల్లా సాగర్‌లో కూడా నీరు రక్తంతో ఎరుపు బారిందనేది ఆనాటి అసత్య కథనాల్లో మరొకటి. ఆ రోజు ఆ తృణమూల్‌ ప్రచారాలలో కొట్టుకుపోయిన అనేకమంది మేధావులు కూడా దాని ఎన్నికల ప్రచారం కోసం పాటలు, నాటకాలు అందించే వరకూ వెళ్లారు. ఇవన్నీ కట్టు కథలని నేటి సిబిఐ చార్జ్‌షీట్‌తో తేలిపోయింది.
  
ఆ సమయంలో కొల్‌కతా హైకోర్టు నిర్దేశంతో సిబిఐ నందిగ్రామ్‌లో 2007 మార్చి 15న విచారణ ప్రారంభించింది. అంటే తూటాలు పేలిన మరుసటి రోజే. ఆరున్నర ఏళ్ళు విచారణ జరిపి సిబిఐ ఇప్పుడు చార్జ్‌షీట్‌ ఇచ్చింది. నిజానికి మమత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్యపైనే దర్యాప్తు అంటూ జైల్లో పెట్టాలని అనుకున్నది. సిబిఐ అందుకు అంగీకరించలేదనే అక్కసుతో ప్రభుత్వం పోలీసు అధికారులపై చర్య తీసుకోవటానికి అనుమతివ్వ లేదు. కనుక సిబిఐ కూడా అన్ని నిజాలు బయట పెట్టగల్గిందని చెప్పడం కష్టం. కానీ చెప్పిన మేరకైనా అప్పటి దుష్ప్రచారానికి ఆధారాలు లేవని తేలిపోయింది. ఆనాడు కాల్పులు జరిగిన రెండు ప్రాంతాలు భాంగాబేడా వంతెన, గోకుల్‌నగర్‌లకు సంబంధించి సిబిఐ రెండు చార్జ్‌షీట్లు ఇచ్చింది. ఆ ఘటనలకు బాధ్యులుగా గుర్తించబడిన వారిలో అత్యధికులు తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందినవారే ఉండటం అందరినీ దిగ్భ్రాంతపరిచింది. నందిగ్రామ్‌కు పోలీసులు రహస్యంగా వెళ్లారన్నది కూడా నిజం కాదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. సాధారణ పాలన పునరుద్ధరించి శాంతిభద్రతలు నెలకొల్పడానికే వెళ్లింది.
  
వారిని అడ్డుకోవటానికి 'చట్టవిరుద్ధ' సమీకరణ జరిపింది తృణమూల్‌ స్థాపించిన కమిటీ సభ్యులే కావడం మరింత విపరీతం. ఆనాడు తాండవించిన గందరగోళం వెనక ఆ పార్టీ సాయుధ దుండగులు ఉన్నారు. వారే పోలీసులపై బాంబులు విసిరి, కాల్పులు జరిపారు. ఇప్పుడు సిబిఐ చార్జ్‌షీట్లో తేల్చి చెప్పిన ఈ నిజాలు నాడు వామపక్ష ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు వివరించేందుకు ప్రయత్నించిన ప్రాథమిక సత్యాలనే రుజువుచేస్తున్నట్టు సిపిఎం ప్రతిపక్ష నాయకుడు సూర్యకాంత మిశ్రా చేసిన వ్యాఖ్య సత్యమైంది. ఈ తప్పుడు ప్రచారాలతో, చర్యలతో అధికారంలోకి వచ్చిన మమత సర్కారు ఆఖరుకు కాంగ్రెస్‌ కూడా భరించలేనిదిగా తయారవడమే గాక ప్రజాస్వామిక హక్కులపైనా దాడి చేస్తున్నది. ఇప్పుడు సిబిఐ చార్జిషీట్‌ను కూడా తోసిపుచ్చాలని హడావుడి చేస్తున్నది. అవన్నీ ఎలా ఉన్నా పాలకవర్గాల విష ప్రచారాలలో కొట్టుకుపోయే వారికి ఇది కనువిప్పు కావలసి ఉంటుంది. అవి ఎల్లకాలం నిలిచేవి కావనీ విశ్వాసం కలుగుతుంది. (ప్రజాశక్తి 31.1.2014 సంపాదకీయం)

Sunday, February 2, 2014

30.11.2013 నాటికి భారత టెలికాం రంగం వినియోగదారుల వివరాలు

వైర్లెస్, వైర్ లైన్ కలిపి మొత్తం టెలిఫోన్ వినియోగదారులు 91కోట్లు. ఇందులో పట్టణ వినియోగదారులు 54.6 కోట్లు, గ్రామీణ వినియోగదారులు 36.4 కోట్లు

వైర్లెస్ ఫోన్స్ వినియోగదారులు 88 కోట్లు; ఇందులో పట్టణ వినియోగదారులు 52.3  కోట్లు; గ్రామీణ వినియోగదారులు 35.7 కోట్లు

వైర్ లైన్  ఫోన్స్ వినియోగదారులు 2.9 కోట్లు; ఇందులో పట్టణ వినియోగదారులు 2.28కోట్లు; గ్రామీణ వినియోగదారులు 61.7  లక్షలు

మొత్తంగా టెలిఫోన్ వినియోగదారులు జనాభాలో 73.69శాతం; పట్టణ జనాభాలో 144.46 శాతం; గ్రామీణ జనాభాలో 42.43శాతం

మొత్తం టెలిఫోన్ వినియోగదారులలో పట్టణ వినియోగదారుల శాతం 60.06; గ్రామీణ వినియోగదారుల శాతం 39.94

నవంబరు 2013 నెలలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రిక్వెస్టులు 20.9 లక్షలు.

వైర్ లైన్ బ్రాడ్ బ్యాండ్  వినియోగదారుల సంఖ్య 1.44 కోట్లు

100 మంది జనాభాకి టెలిఫోన్లు ఢిల్లీ లో 224, తమిళనాడు లో 109, కేరళ లో 96.6, గుజరాత్ లో 88.1, ఆంధ్రప్ర్రదేశ్ లో 77.6, ఉత్తరప్రదేశ్ లో 55.36, అస్సామ్ లో 47.79, బీహార్ లో అతి తక్కువగా 44.6
వైర్లెస్ వినియోగదారులలో శాతం ఎయిర్టెల్ 22.31, వోడాఫోన్ 17.94,ఐడియా 14.57, రిలయన్స్ 13.28, బి ఎస్ ఎన్ ఎల్ 11.16, ఎయిర్సెల్ 7.41, టాటా 7.19, టెలీ వింగ్స్(యూనినార్) 3.67, సిస్టెమా 0.42, విడియోకాన్ 0.42, ఏం టి ఎన్ ఎల్ 0.41, లూప్ 0.34,క్వాడ్రంట్ 0.22; ఈ విధముగా మొత్తము 13 కంపెనీలున్నాయి.

వైర్లెస్ వినియోగదారుల శాతం-ప్రభుత్వరంగం(బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ కలిపి) 11.57; ప్రయివేటు రంగం(అన్నీ ప్రయివేటు కంపెనీలు కలిపి) 88.43.

వి ఎల్ ఆర్ శాతం (నవంబరులో)-ఐడియా 99.4, వోడాఫోన్ 96.2, ఎయిర్టెల్ 96, టెలీ వింగ్స్ 73.5, టాటా 67.3, ఎయిర్సెల్-63.7, సిస్టెమ-62.2, బి ఎస్ ఎన్ ఎల్ 56.3, ఏం టి ఎన్ ఎల్ 56.1, క్వాడ్రంట్ 53.4, లూప్ 46.3(వి ఎల్ ఆర్ అంటే విజిటర్ లొకేషన్ రిజిస్టర్. వినియోగదారులలో ఎంతమంది తమ సిమ్ ల ను వినియోగిస్తున్నది  ఇది తెలియజేస్తుంది. బి ఎస్ ఎన్ ఎల్ కు నవంబరులో వి ఎల్ ఆర్ 56.3 శాతం అంటే బి ఎస్ ఎన్ ఎల్ మొత్తం వినియోగదారులలో నవంబరు నెలలో కాల్సు చేసిన/రిసీవ్ చేసుకున్న/ఎస్ ఏం ఎస్ పంపిన వినియోగదారులు  56.3 శాతం అని.)

వైర్ లైన్ వినియోగదారులలో శాతం- బి ఎస్ ఎన్ ఎల్ 65.7, ఏం టి ఎన్ ఎల్ 12.21, ఎయిర్టెల్ 11.56, టాటా 5.18, రిలయన్స్ 4.28, క్వాడ్రాంట్ 0.71, సిస్టెమ 0.19, వోడాఫోన్ 0.17.

వైర్లైన్ వినియోగదారులు నవంబరు నెలలో బి ఎస్ ఎన్ ఎల్ కు 88609, ఏం టి ఎన్ ఎల్ కు 2943 మంది తగ్గగా టాటా కు 7552, వోడాఫోన్ కు 2670, ఎయిర్టెల్ కు 1322 మంది పెరిగారు.

వైర్ లైన్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల శాతం- బి ఎస్ ఎన్ ఎల్ 68.9, ఎయిర్టెల్ 9.1, ఏం టి ఎన్ ఎల్ 7.6, ఇతరులు 14.3

ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ లో వివిధ కంపెనీల వైర్లెస్ వినియోగదారులు ఎయిర్టెల్ 1.92 కోట్లు; ఐడియా 1.19 కోట్లు, బి ఎస్ ఎన్ ఎల్ 95.9 లక్షలు(అక్టోబర్ లో 95.01 లక్షలు), రిలయన్స్ 58.84 లక్షలు; వోడాఫోన్ 59.7 లక్షలు, టాటా 65.07 లక్షలు, టెలీ వింగ్స్ 42.07 లక్షలు, ఎయిర్సెల్ 19.05 లక్షలు

(టి ఆర్ ఏ ఐ 29.1.2014 న చేసిన ప్రకటన  నుండి)


Saturday, February 1, 2014

బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ ల పునరుద్ధరణ పై మంత్రివర్గ ఉపసంఘం 31.1.2014 న చేసిన నిర్ణయాలు; గురజాడ సూక్తి

బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ ల పునరుద్ధరణ పై మంత్రివర్గ ఉపసంఘం 31.1.2014 న చేసిన నిర్ణయాలు
1.      ఉద్యోగుల వేతనాల చెల్లింపుకై అప్పు ఇచ్చేందుకు నిర్ణయం
నష్టాలలో వున్న బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లకు  డి ఓ టి నుండి వచ్చిన సిబ్బంది వేతనాల పై అయ్యే ఖర్చును భరించేందుకు కొంత అప్పు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం  నిర్ణయించింది. డి ఓ టి ఈ విషయములో పంపిన ప్రతిపాదన పై మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. బి ఎస్ ఎన్ ఎల్ కు 2013-14 లో ఉద్యోగుల జీతభాత్యాలపై ఖర్చు రు.14000 కావచ్చునని అంచనా. అప్పు ఎంత ఇస్తారు అనే ప్రశ్నకు డి ఓ టి సెక్రెటరీ  ఫరూకీ, ఉద్యోగులలో ఒక పరిమిత సంఖ్యను తీసుకుని దాని ఆధారముగా ఈ లెక్క తయారు చేస్తామని అన్నారు.  బి ఎస్ ఎన్ ఎల్ కు ప్రభుత్వము సుమారు రు.  8500 కోట్లు అప్పు ఇచ్చే అవకాశం వుంది. అయితే ఇది ఒకే సారి ఇవ్వటం జరగదు.  10 సంవత్సరాలలో వాయిదాల పద్ధతిలో ఈ అప్పు ఇస్తారు. దీనిపై వడ్డీ 1 శాతం. ఎం టి ఎన్ ఎల్ కు రు.1000 కోట్లు రుణం ఇచ్చే అవకాశం వుంది. మొదటి సంవత్సరం బి ఎస్ ఎన్ ఎల్ కు రు.2000 కోట్లు, ఏం టి ఎన్ ఎల్ కు రు.390 కోట్లు రుణం ఇచ్చే అవకాశం వున్నది. పది సంవత్సరాల తరువాత ఈ రుణాన్ని చెల్లించటం ప్రారంభించాలి.
2.    టవర్స్ ను  విడగొట్టి ఒక కంపెనీగా ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయముగా అంగీకారం
బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ ను బి ఎస్ ఎన్ ఎల్ నుండి విడగొట్టి దానికి అనుబంధముగా వుండే ఒక టవర్సు కంపెనీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో వున్నది.  బి ఎస్ ఎన్ ఎల్ కు మొత్తం 61622 టవర్సు వున్నాయి. ఈ టవర్స్ ను  ఈ విధముగా మరో కంపెనీ కి బదిలీ చేస్తే ఆ టవర్స్ తో పాటు సుమారు 3000 మంది బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు కూడా కొత్త కంపెనీకి వెళ్ళాల్సి వుంటుంది.  ఈ టవర్స్ కంపెనీలో ఈ విధముగా బి ఎస్ ఎన్ ఎల్ నుండి విలీనమయ్యే ఉద్యోగులకు పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎవరు చెల్లించాలి? బి ఎస్ ఎన్ ఎల్ చెల్లిస్తుందా లేక టవర్ కంపెనీ చెల్లిస్తుందా? ఈ సమస్యని పెన్షన్ డిపార్టుమెంటు లేవనెత్తింది. దీని పరిశీలించి పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని డి ఓ టి అంటున్నది.
మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఈ టవర్సు కంపెనీ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారించింది. ఈ ఉప కంపెనీ ఏర్పాటుకు ప్రణాళికను తయారు చేస్తున్నామని డి ఓ టి సెక్రెటరీ అన్నారు.
3.      ఖాళీ స్థలాలను సొమ్ము చేసుకునే విషయం
బి ఎస్ ఎన్ ఎల్ తనకి 82 చోట్ల వున్న స్థలాలను సొమ్ము చేసుకోటానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు సంబంధించి అది ప్రతిపాదించిన ప్రణాళికను అమలు చేస్తే కనీసం రు.13500 కోట్లు వస్తాయని అంచనా. ఈ 82 లో 10 చోట్ల పైలట్ పథకాలు ప్రతిపాదించింది. ఇందులో 5 పథకాలకు మంత్రివర్గ ఉపసంఘం అనుమతి కోరుతున్నది. ఈ 5 పథకాల వివరాలు-(1) బోరివాలి ముంబయి లో 37 ఎకరాలు గృహ నిర్మాణానికి, (2) శాంతాక్రూజ్ ముంబయి లో 6.63 ఎకరాలు నాలెడ్జ్ పార్క్ కు (3) దేవ్ నార్ ముంబయి లో 25.5 ఎకరాలు గృహ నిర్మాణానికి (4) నోయిడా సెక్టార్ 33 లో 1.48 ఎకరాలు ఆఫీస్ కాంప్లెక్స్ కు (5) నోయిడా సెక్టార్ 18 లో 0.84 ఎకరాలు ఆఫీస్ కాంప్లెక్స్ కు. ఈ ఆస్తులను డెవలప్మెంట్ కోసం ప్రయివేట్ కంపెనీలకు వేలం లో అమ్మాలని, ఈ వేలం బి ఎస్ ఎన్ ఎల్ బోర్డ్ పర్యవేక్షణలో జరగాలనీ ప్రతిపాదించింది. ఈ 5 స్థలాలనుండి రు. 3500 కోట్లు వస్తుందని బి ఎస్ ఎన్ ఎల్ అంచనా. గతం లో బి ఎస్ ఎన్ ఎల్ పై నియమించబడిన శ్యామ్ పిట్రోడా కమిటీ బి ఎస్ ఎన్ ఎల్ వద్దనున్న ఖాళీ స్థలాల డెవలప్మెంటు కు,  ఖాళీగా వున్న క్వార్టర్సు వినియోగానికి  ఒక ఉప కంపెనీని  బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్సింది.  అయితే ఈ ఉప కంపెనీ ఏర్పాటుకు సమయం పడుతుందని, కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు తక్షణమే నిధుల అవసరం వున్నదని డి ఓ టి అభిప్రాయం. తనకి వున్న ఖాళీ స్థలాలని ఏ విధముగా సొమ్ము చేసుకోవచ్చో తెలియజేసేందుకు వొయంట్స్ సోల్యూషన్స్  లిమిటెడ్ అనే కన్సల్టెన్సీని బి ఎస్ ఎన్ ఎల్ నియమించింది.
రియల్ ఎస్టేట్ కార్యక్రమం ద్వారా సమీప భవిష్యత్తు లో రు.150-200 కోట్లు, దీర్ఘ కాలం లో రు.300-400 కోట్లు వస్తాయని ఎం టి ఎన్ ఎల్ అంచనా.
అయితే ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
4.      వి ఆర్ ఎస్
లక్ష మండి ఉద్యోగులకు వి ఆర్ ఎస్ ఇవ్వాలంటే రు. 12000 కోట్లు భారీ మొత్తం అవసరం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రతిపాదనని పక్కకి పెట్టటం జరిగింది.
గత నాలుగు సంవత్సరాలుగా బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు నష్టాలలో వున్నాయి. 2017-18 నాటికి నష్టాలను అధిగమించి లాభం పొందే స్థితికి వస్తాయని ఈ రెండు కంపెనీలూ అంటున్నాయి.
ఇంతకు ముందు ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు బి డబ్ల్యూ ఎ స్పెక్ట్రమ్ వాపసు ఇచ్చినందుకు అది చెల్లించిన రు.6700 కోట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు పది సంవత్సరాలలో రు.8500 కోట్లు రుణం ఇస్తానంటున్నది. కానీ ఇది చాలా స్వల్ప ఉపశమనం మాత్రమే. 2012-2017 మధ్య కాలములో మొత్తం రు.40000 పెట్టుబడి పెట్టి నెట్ వర్క్ విస్తరణ, ఆధునికీకరణ చేస్తే 2017-18 నాటికి బి ఎస్ ఎన్ ఎల్ కు లాభం వచ్చే పరిస్తితి ఏర్పడుతుందని గతం లో బి ఎస్ ఎన్ ఎల్ సి ఎం డి అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వము ఉచితముగా ఇచ్చిందేమీ లేదు. బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ కోసం బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించిన సొమ్మునే ఆ స్పెక్ట్రమ్ ను వాపసు తీసుకుని ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు తిరిగి ఇస్తున్నది. ఇప్పుడు చెపుతున్న రు. 8500 కోట్లు ఉద్యోగుల వేతనాల ఖర్చు భరించేందుకు ఇస్తున్న అప్పు. అది కూడా వాయిదాల పద్ధతిలో 10 సంవత్సరాలలో ఇస్తారు. టవర్సును విడగొట్టి విడిగా ఒక కంపెనీగా రూపొందించటంలో ఉద్దేశం కంపెనీని ముక్కలు చేసి డిజిన్వేస్టుమెంటు చేసేందుకే.
బి ఎస్ ఎన్ ఎల్ అనేక సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నది. ప్రయివేటు కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య స్వల్పం కాగా బి ఎస్ ఎన్ ఎల్ లో డి ఓటి నుండి వచ్చిన ఉద్యోగులు 2.5 లక్షలమంది వున్నారు. ఆ విధముగా అది ఉద్యోగావకాశాలు కల్పించి సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నది. అది నష్టాలు భరించి ల్యాండ్ లైన్స్ ను నిర్వహించి దాని ద్వారా దేశ వ్యాపితంగా  నాణ్యమయిన బ్రాడ్బ్యాండ్ సర్వీసులిచ్చి విజ్ఞాన వ్యాప్తికి ప్రజల అవసరాలు తీర్చటానికి కృషి చేస్తున్నది. దేశ భద్రత రీత్యా కొన్ని విదేశీ కంపెనీల నుండి జి ఎస్ ఎం ఎక్విప్మెంటు కొననీయకుండా ప్రభుత్వము గతములో బి ఎస్ ఎన్ ఎల్ పై ఆంక్షలు విధించినందున అది మొబైల్ సర్వీసుల రంగం లో ప్రయివేట్ కంపెనీలతో పోలిస్తే వెనకబడింది. ఇటువంటి ఆంక్షలను ప్రభుత్వము ప్రయివేటు కంపెనీలపై విధించలేదు. కాబట్టి అతి ముఖ్యమయిన సామాజిక బాధ్యతలను నిర్వహించేందుకు నష్టాలను ఎదుర్కొంటున్న బి ఎస్ ఎన్ ఎల్ కు ఇటువంటి స్వల్ప ఉపశమనాలతో సరిపుచ్చకుండా ప్రభుత్వము ప్రతి సంవత్సరమూ బి ఎస్ ఎన్ ఎల్ కు ల్యాండ్ లైన్స్ పై వస్తున్న నష్టానికి పూర్తి పరిహారాన్ని ఇవ్వాలి( ఈ నష్టం సుమారు రు 8000 కోట్లు వుంటుంది). ప్రభుత్వానికి ఎటువంటి చెల్లింపూ చేయకుండా ఇపుడు తన వద్ద వున్న స్పెక్ట్రమ్ ను ఉపయోగించి 4 జీసర్వీసులు ఇచ్చేందుకు, మిగులు స్పెక్ట్రమ్ ను ట్రేడ్ చేసేందుకూ ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ ను అనుమతించాలి.ఎక్విప్మెంటు కొనుగోలు విషయములో ప్రయివేటు కంపెనీలపై లేని ఆంక్షలను బి ఎస్ ఎన్ ఎల్ పై విధించరాదు.
గురజాడ సూక్తి
“మతము లన్నియు మాసిపోవును,
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబు లన్నవి
యవని విలసిల్లున్”