Monday, April 21, 2014

కార్మిక వర్గ సమస్యలపై సి పి ఎం, కాంగ్రెస్, బి జె పి ల ఎన్నికల ప్రణాళికలు ఏమి చెపుతున్నాయి?

సిపిఎం ఎన్నికల ప్రణాళికలో ముఖ్యాంశాలు

1.     కనీస వేతనం రు.10000/- వుండాలి. ధరల పెరుగుదలకు అనుగుణముగా దానిని పెంచాలి. ఈ విధానాన్ని చట్టబద్ధం చేయాలి.

2.    కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు జరపాలి. దీనిని పర్యవేక్షించేందుకు కార్మిక శాఖను పటిష్టం చేయాలి. తగినంత మంది అధికారులను, సిబ్బందిని నియమించాలి.  

3.    అసంఘటిత కార్మికుల సాంఘిక సంక్షేమ చట్టాన్ని మెరుగు పరచాలి. దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారినేగాక ఎగువన వున్నవారిని కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలి. ఆరోగ్యం, మెటర్నిటీ, శిశు సంరక్షణ, జీవిత బీమా, ప్రమాదం జరిగినప్పుడు పూర్తి  సహాయం, పెన్షన్ తదితర సౌకర్యాలు అందరికీ కల్పించేందుకు ప్రత్యేక నిధిని తగినంత బడ్జెట్ కేటాయింపులతో ఏర్పాటు చేయాలి.

4.    2004 తరువాత రిక్రూటయిన  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కు ప్రమాదం తెచ్చిన “నూతన పెన్షన్ స్కీము” ను, పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వము వీరి పెన్షన్ ఖర్చును పూర్తిగా భరించాలి. ప్రభుత్వమే వీరికి పెన్షన్ చెల్లించాలి. ప్రభుత్వోద్యోగులకే గాక అన్నీ రంగాల కార్మికులకు, ఉద్యోగులకు పెన్షన్ ఖర్చును యాజమాన్యాలే భరించాలి. ఆఖరి వేతనం లో 50 శాతాన్ని పెన్షన్ గా ఇవ్వాలి.

5.    రహస్య బ్యాలట్ ద్వారా కార్మిక సంఘాలకు గుర్తింపునివ్వాలి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నింటిలోనూ యూనియన్ గుర్తింపు తప్పనిసరి చేసే చట్టం తేవాలి.

6.    ప్రభుత్వ మరియు ప్రయివేటు సంస్థల యాజమాన్యం లో కార్మికులకు భాగస్వామ్యం కల్పించే స్కీము రూపొందించాలి.

7.    కాంట్రాక్టు, క్యాజువల్ కార్మిక  విధానాన్ని ప్రోత్సహించకూడదు. కాంట్రాక్టు కార్మిక చట్టాన్ని సవ్యముగా అమలు జరపాలి. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు అదే పని చేసే రెగ్యులర్ కార్మికుల వేతనాలతో సమంగా వుండాలి. వారికి యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు ఇవ్వాలి. ట్రేడ్ యూనియన్ల లో వోటింగు హక్కు ఇవ్వాలి.

8.    అన్నీ రంగాలలో మహిళా కార్మికులకు పురుష కార్మికులతో సమంగా వేతనం ఇవ్వాలి. అసంఘటిత రంగం లో పని చేస్తున్నా మహిళా కార్మికులకు ( ఇంటి వద్దే వుంది పని చేసే మహిళా కార్మికులతో సహా) మెటర్నిటీ, పెన్షన్, ఇన్సూరెన్స్, క్రెచి తదితర సౌకర్యాలు కల్పించాలి.

9.    మహిళా కార్మికుల పై పని స్థలాలలో లైంగిక వేధింపులను  నివారించేందుకు చట్టం లో పేర్కొన్న అన్నీ నిబంధనలను, ఈ వేధింపుల పై విచారించే కమిటీలలో ఎన్నికైన ప్రతినిధులను నియమించటం తో సహా, అమలు చేయాలి.

10.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీములను అమలు చేసే స్కీము వర్కర్లను(అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, పేరా టీచర్స్, మొదలగు వారు) 45వ భారత కార్మిక మహాసభ సిఫార్సు ప్రకారం “వర్కర్లు” గా గుర్తించి తదనుగుణముగా చట్టబద్ధమయిన కనీస వేతనాలు, సాంఘిక భద్రతా ప్రయోజనాలు వారికి వర్తింపజేయాలి.

11.   కీలక రంగాలలో ప్రభుత్వ రంగాన్ని బలపరచాలి. లాభసాటిగా వున్న, కోలుకోటానికి అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, డిజిన్వేస్తుమెంటును పూర్తిగా ఆపి వేయాలి.

12.  రీరైల్ వ్యాపారం లో ఎఫ్ డి ఐ ని నిషేదించాలి. ఎఫ్ డి ఐ ని దొడ్డిదారిన అనుమతించే రూల్సును రద్దు చేయాలి. స్వదేశీ పరిశ్రమలను స్వాధీనం చేసుకునేందుకు ఎఫ్ డి ఐ ని అనుమతించకూడదు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చేందుకు విదేశీ పెట్టుబడిని అనుమతించాలి.

వీటన్నింటికోసం తాను నిలబడతానని సి పి ఎం తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.

కాంగ్రెస్, బి జె పి ఎన్నికల ప్రణాళికలు

ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రణాళికలలో పైన తెలియజేసిన అంశాలేవీ లేవు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అసంఘటిత కార్మికుల సాంఘిక భద్రత చట్టాన్ని సక్రమముగా అమలు చేస్తామని వున్నది. అసంఘటిత కార్మికులకు ఇన్సూరెన్సు, పెన్షన్ సౌకర్యం హామీ యిచ్చింది. ఇదే హామీని బి జె పి కూడా ఇచ్చింది. కానీ ఈ చట్టాన్ని దారిద్ర్య రేఖకు ఎగువున వున్న అసంఘటిత ఆకార్మికులకు వర్తింపజేస్తామనే హామీని కాంగ్రెస్ గాని, బి జె పి గాని ఇవ్వలేదు. అన్నీ కార్మిక చట్టాలను కలిపి ఒకే సమగ్ర చట్టం గా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించేందుకు ఒక కమిషన్ ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అన్నది. కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకముగా మార్చటమే దీని వుద్దేశం. బి జె పి ఎన్నికల ప్రణాళికలో కూడా కార్మిక చట్టాలు సమీక్షించాలన్నది. దీని వుద్దేశం కార్మిక చట్టాలను కార్మిక వ్యతిరేకముగా మార్చటమే. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, డిజిన్వెస్ట్మెంటులను ఆపుతామనే వాగ్దానాన్ని ఈ రెండు పార్టీలు ఇవ్వలేదు. విదేశీ పెట్టుబడులకు ఎటువంటి వ్యతిరేకతా వుండదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  రిటెయిల్ వ్యాపారులు తమ వోటర్లుగా వున్నారు గనుక రిటెయిల్ వ్యాపారం (అది కూడా మల్టీబ్రాండ్ లోనే) మినహా అన్నీ రంగాలలో ఎఫ్ డి ఐ  ని బి జె పి ఎన్నికల ప్రణాళిక ఆహ్వానిస్తున్నది.

కాబట్టి సి పి ఎం మాత్రమే కార్మిక వర్గానికి అనుకూలముగా వున్నది. కాంగ్రెస్, బిజెపిలు వ్యతిరేకముగా వున్నాయి.



No comments:

Post a Comment