నేషనల్ శాంపుల్ సర్వే సంస్థ తాజాగా ప్రకటించిన గణాంక వివరాల ప్రకారం 2004-2011
మధ్య కాలం లో దేశం లో సృష్టించబడిన ఫ్యాక్టరీ ఉద్యోగాలలో 40 శాతం వామ పక్ష పాలన వున్న
పశ్చిమ బెంగాల్ లోనే సృష్టించబడ్డాయి. ఈ కాలం లో దేశం మొత్తంగా 58.7 లక్షల ఉద్యోగాలు
ఫ్యాక్టరీ రంగం లో కొత్తగా రాగా అందులో 24 లక్షాల ఉద్యోగాలు పశ్చిమ బెంగాల్ లో వచ్చాయి.
పశ్చిమ బెంగాల్ మొదటి స్థానం లో వున్నది. కాగా
తానే అందరికన్నా గొప్ప అని, తన వలన మాత్రమే ఉద్యోగాలు వస్తాయని గొంతు చించుకుని అరుస్తున్న మోడి ముఖ్యమంత్రిగా
వున్న గుజరాత్ లో ఈ కాలం లో కేవలం 14.9 లక్షల
ఉద్యోగాలే వచ్చి బెంగాల్ కన్నా చాలా దూరంగా, రెండవ స్థానం లో వున్నది. మ్యానుఫాక్చరింగ్ రంగాన్ని
అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పిస్తానని ప్రచారం చేసుకుంటున్న మోడి కన్నా అతని గుజరాత్
నమూనాకన్నా వామ పక్ష పాలనలో చాలా అధికముగా
ఉద్యోగాలు కల్పించటం జరిగిందని ఈ వాస్తవాలు రుజువు చేస్తున్నాయి. బెంగాల్ లో చిన్న
తరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఫ్యాక్టరీ
రంగం లో ఉద్యోగాలు పెద్ద మొత్తం లో సృష్టించగలిగామని వామ పక్ష ప్రభుత్వము లో ఆర్థిక
మంత్రిగా పని చేసిన అసిమ్ దాస్ గుప్తా అన్నారు. వామ పక్ష ప్రభుత్వము జ్యోతిబసు ముఖ్య
మంత్రిగా వున్నప్పుడు నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించిన అనంతరం 1991 నుండి 2011
వరకు 2531 పారిశ్రామిక సంస్థలను కొత్తగా నెలకొల్పటం జరిగింది. (ది హిందూ పత్రిక 26.4.2014
సంచిక లో ప్రచురించిన వార్త ఆధారంగా)
No comments:
Post a Comment