ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీ 2010 లో జరిగిన 4జి స్పెక్ట్రమ్
(2300 ఏం హెచ్ జడ్ బ్యాండ్) వేలం లో ఈ స్పెక్ట్రమ్ ను దేశ వ్యాపితముగా అన్నీ సర్కిల్సుకు
కొన్నది. ఇది ఐ ఎస్ పి అనగా ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్ మాత్రమే. ఆ తరువాత ఈ వేలం
ముగిసిన కొన్ని రోజులలోనే ఈ కంపెనీని ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్
లిమిటెడ్ రు. 12750 కోట్లు పెట్టి కొన్నది.
2013 మార్చి లో ప్రభుత్వము ఈ రిలయన్స్ జియో
ఇన్ఫోకామ్ లిమిటెడ్ ను తన ఐ ఎస్ పి లైసెన్సు ను యూనిఫైడ్ లైసెన్సుగా మార్చుకుని 4జి
స్పెక్ట్రమ్ పై డేటా సర్వీసులనేగాక వాయిస్ కాల్స్ సర్వీసులను కూడా అందించేందుకు అనుమతించిది.
ఇందుకు రిలయన్స్ జియో ప్రభుత్వానికి చెల్లించింది రు.1658 కోట్లు మాత్రమే. ఇది టెలికాం సర్వీసు కంపెనీలు దేశం లో అన్నీ సర్కిల్సులో
సర్వీసులందించేందుకు చెల్లించాల్సిన లైసెన్సు ఫీజు. ఇది 2001 లో నిర్ణయించబడిన ఫీజు.
2008లో కూడా ఇంత తక్కువ లైసెన్సు ఫీజు తో టెలికాం సర్వీసు కంపెనీలకు కొత్తగా లైసెన్సు
ఇవ్వటం దానితోపాటు 2జి స్పెక్ట్రమ్ ఇవ్వటం అక్రమమని చెప్పి సుప్రీం కోర్టు 122 లైసెన్సులను
రద్దు చేసింది. అయినప్పటికి ప్రభుత్వము 2013 లో ఇదే స్వల్ప మొత్తం రు.1658 కోట్లు తీసుకుని
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు తన 4జి స్పెక్ట్రమ్ పై 2జి వాయిస్ సర్వీసులిచ్చేందుకు అనుమటించింది.
దీనిని సి ఏ జి (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)
తప్పు పట్టింది. 2010 లో అన్నీ సర్కిల్సులో 3 జి డేటా అండ్ వాయిస్ స్పెక్ట్రమ్ కోసం ఇతర టెలికాం
కంపెనీలు రు.33000 కోట్లు చెల్లించగా రిలయన్స్ జియో కు రు.12750 కోట్లతో అన్నీ సర్కిల్సు
లో 4జి స్పెక్ట్రమ్ ను డేటా కె గాక వాయిస్ కాల్స్ సర్వీసులకు కూడా అనుమతించటం అక్రమమని
సి ఏ జి అన్నది. దీనివలన ప్రభుత్వ ఖజానాకి సుమారు రు.20,000 కోట్లు నష్టం వచ్చిందని సి ఏ జి అన్నది.
ప్రభుత్వ ఖజానాకి ఈ అక్రమం వలన జరిగిన నష్టాన్ని సుప్రీం కోర్టు దృష్టికి
తెస్తూ “సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్” ఒక పిఐఎల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్
కేసు) ను దాఖలు చేసింది. దీనిపై న్యాయ మూర్తులు హెచ్ ఎల్ దత్తు మరియు ఎస్ ఏ బొబ్డే
లతో కూడుకున్న ద్విసభ్య ధర్మాసనం 9.5.2014 న ప్రభుత్వానికి, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు, టి ఆర్ ఏ ఐ కి నోటీసులు జారీ చేసింది.
No comments:
Post a Comment