ఈ రోజు(4.8.2014) మోడీ ప్రభుత్వము రాజ్యసభలో తాను ప్రవేశ పెట్టాలనుకునే ఇన్సూరెన్సు బిల్లు( ఇన్సూరెన్సు రంగం లో ఎఫ్ డి ఐ పరిమితిని 26% నుండి 49%కు పెంచేందుకు) పై ఏకాభిప్రాయం సాధించేందుకు అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో ఏకాభిప్రాయం రానందున మరలా ఒక సారి 5.8.2014 లేదా 6.8.2014న సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఈ బిల్లును వామపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్ సి పి మరియు బి జె డి లు సమర్థించాలని ఇప్పటికే నిర్ణయించాయి. కాంగ్రెస్ సూత్ర రీత్యా ఇందుకు అనుకూలమే అయినా కొన్ని మార్పులు కోరుతున్నది. రాజ్యసభలో తనకి మెజారిటీ లేనందున వామపక్షేతర పార్టీల మద్దతుకోసం మోడీ ప్రభుత్వము ప్రయత్నిస్తున్నది. అందుకోసమే రాజ్యసభలో ఈ రోజు ప్రవేశ పెట్టాల్సిన ఈ బిల్లును వాయిదా వేసింది.
కాంగ్రెస్ లేదా వామపక్షేతర పార్టీలు కోరే సవరణలు ఇన్సూరెన్సు అమృయు పెన్షన్ రంగం లో ఎఫ్ డి ఐ అప్రిమితిని 49 శాతం కు పెంచటాన్ని వ్యతిరేకించేందుకు కాదు. కాబట్టి వాటి మద్దతును ఏదో ఒక విధముగా పొంది బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నములో మోడీ ప్రభుత్వము వున్నది.
ఇన్సూరెన్సు అమృయు పెన్షన్ రంగం పై జరుగుతున్నా ఈ దాడిని ప్రతిఘటించాల్సిన అవసరం వున్నది. ఒక వేల ఈ బిల్లును గనుక రాజ్యసభ ఆమోదిస్తే ఆ తరువాత రోజు సమ్మె చేయాలని ఏ ఐ ఐ ఈ ఏ (ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్) నిర్ణయించింది. ఈ సమ్మె జరిగే రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి సంఘాలు ఇందుకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించాల్సిన అవసరం వున్నది. ఈ ప్రదర్శనల నిర్వహణకు బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఏ ఐ బి డి పి ఏ లు ఇప్పటికే పిలుపునిచ్చాయి.
ఇన్సూరెన్సు, పెన్షన్, బ్యాంకింగు రంగాల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధము కండి

No comments:
Post a Comment