Wednesday, November 30, 2011

గురజాడ దేశభక్తి గేయం "దేశమును ప్రేమించుమన్నా"

నేడు నవంబరు 30, మహాకవి గురజాడ వర్ధంతి. 53 సంవత్సరాల వయసులో 1915 నవంబరు 30 న ఆయన మరణించారు.ఆయన దేశ భక్తి గేయం ప్రపంచ సాహిత్యంలో ఒక ఆణి ముత్యం. ఈ గేయం పై వకుళాభరణం  రామకృష్ణ  గారి ప్రసంగం పాఠాన్ని, ఈ గేయం పూర్తి పాఠాన్ని ఈ సందర్భంగా మీకు అందిస్తున్నాను.


దేశభక్తి బాగా పెల్లుబుకుతున్న ఈ దేశంలో, మాటకి ముందర దేశభక్తి దేశభక్తి...అంటూ ఏదైనా అనుమానం వస్తే వీడికి దేశభక్తి లేదు. పలానా పార్టీకి దేశభక్తి లేదు. పలానా వాళ్ళు దేశభక్తులు కారు అనేటువంటి సంప్రదాయం ఉండేటువంటి మన దేశంలో సాహితీస్రవంతి, సుందరయ్య విజ్ఞానకేంద్రం సంయుక్తంగా 'దేశభక్తి గేయం వందేళ్ల పండుగ' సభ జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రదేశంలో 1940 దశకంలో, ఆ తర్వాత కూడా తెలుగువాళ్ళ సాంస్కృతిక జీవితానికి, సాంస్కృతిక సంపదకు జీవం పోసింది కమ్యూనిస్టు పార్టీ మన ఆంధ్రదేశంలో. వాళ్ళని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి సాంస్కృతిక సంపదను మొత్తం ప్రజల ముందు ఉంచినటువంటిది కమ్యూనిస్టు పార్టీ. గురజాడ రచనలు అన్నీ ఎక్కడో ఏమూలనో పడి దుమ్ముకొట్టుకుంటుంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వాటికోసం కృషిచేసి, వాటిని సంపాయించి వెలికితీసి, అవసరాల సూర్యారావుగారితోటి సంపాదకత్వం చేసి గురజాడ రచనల మొత్తాన్ని ప్రచురించింది ఆ రోజుల్లో ఉండేటటువంటి ప్రజాశక్తి ప్రచురణాలయం లేదా విశాలాంధ్ర ప్రచురణాలయం.
వీరేశలింగాన్ని కూడా కామ్రేడ్‌ వీరేశలింగం అనే మన దేశంలో గురజాడని కామ్రేడ్‌ అనలేదు. కానీ గురజాడ రాసినటువంటి దేశభక్తి గీతంలోని కొన్ని పదాల్ని కమ్యూనిస్టులు తీసుకొచ్చి ఇందులో చేర్చారు అని ఒక అభాండం వేశారు. ఇది నిజంగా గురజాడ రాసిన గేయమేనా? ఇది కమ్యూనిస్టులు రాసినటువంటి గేయంలాగా వుందే! అంటే కమ్యూనిస్టులే చాలా గొప్ప గేయాలు రాస్తారా? లేకపోతే కమ్యూనిస్టులే ఆ భావజాలంతో రాస్తారా? ఇంకెవరూ రాయకూడదా సమాజంలో? 'నరుడి చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోరు' ఎంత గొప్ప భావన ఉంది ఇందులో. అంటే నీకు సంపదంతా ఎలా వస్తుంది? నీ సంపదంతా ఈ కష్టపడేటువంటి కష్టజీవుల స్వేదం నుండి, చెమట నుండి, రక్తం నుండి ఈ సంపద పుడుతుంది అని గురజాడ అనగలిగాడు. సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మళ్ళీ బతికించి మనముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్టు ఉద్యమం. సాంస్కృతిక పునరుజ్జీవనం మిగిల్చిపోయినటువంటి వారసత్వాన్ని సూర్యరశ్మిని ఏ విధంగా చెట్ల ఆకులు స్వీకరించి ప్రాణవాయువుగా ఆ చెట్లు బతుకుతాయో ఆ విధంగా కమ్యూనిస్టు ఉద్యమం దాన్ని స్వీకరించి దానికి మళ్ళీ ప్రాణం పోసి ముందుకు తీసుకొచ్చింది.

వీరేశలింగం గానీ, గుర జాడ గానీ, గిడుగు కానీ, చిలకమర్తి గానీ మీరెవరైనా చెప్పండి సాంస్కృతిక పునరుజ్జీవన శకంలో వచ్చిన మహామహులు వాళ్ళెవరూ కమ్యూనిస్టులు కాదు. ఏ కోశాన చూసినా వాళ్ళు కమ్యూనిస్టులు కాదు. వాళ్ళు హేతువాదులు. సమాజం బాగుపడాలని కోరుకున్నటువంటి వారు. సమాజ పురోగతికి తోడ్పడినటువంటి వారు. తెలుగువాళ్ళ సాహిత్య జీవితంలోగానీ,
సాంస్కృతిక జీవితంలో గానీ, ఆధునికత అనేటువంటి దినుసుని, ఆధునికత అనే భావాన్ని గుర జాడ ప్రవేశ పెట్టాడు. ఆధునికత అంటే మనం మోడర్నిటీ అంటాం ఇంగ్లీషులో. 
ఇది కలోనియల్‌ మోడర్నిటీయా? లేకపోతే పోస్ట్‌ కలోనియల్‌ మోడర్నిటీయా? అనేది కాదిక్కడ. వలసపాలనతోటి వచ్చిన ఆధునికతలో వుండేటువంటి కొన్ని అంశాలు వలసపాలనకి ముందుకూడా మన భారతీయ సమాజంలో ఉన్నాయనేది పరిశోధనల్లో తేలింది. ఈ ఆధునికత అనేటువంటి ఒక భావాన్ని, అంటే ఒక హేతువాద దృక్పథాన్ని, ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, ఒక మానవతా దృక్పథాన్ని, ఈ మూడింటినీ కలగలపినటువంటి ఒక భావాన్ని గురజాడ పూర్తిగా ప్రవేశపెట్టాడు. భావజాలంలో, సాహిత్యంలో ప్రవేశపెట్టాడు. కొత్త గేయాన్ని, ముత్యాలసరాలు వంటి గేయాన్ని ఆయన మనికిచ్చిపోయాడు. 'మెచ్చవంటా నీవు, మెచ్చకుంటే మించిపోయేవు.కొయ్యబొమ్మల మెచ్చుకళ్ళకు కోమలుల సౌరెక్కునా' సింపుల్‌గా ఆయన ఈ పొయెట్రీని రాసాడు. ఇవాళ కేంద్రబిందువుగా కులం మీద చర్చ జరుగుతుంది. ఎవరిని చూసినా అతన్ని వ్యక్తిగా చూడడం లేదు. అతనికి ఉండేటువంటి భావజాలం ఏమిటి? అతనికుండేటువంటి నేపధ్యం ఏమిటి? ఏం చేస్తున్నారు? అని చూడట్లేదు. 
కులం అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలుగు కవిత్వంలో 'మంచి చెడ్డలు ఎంచి చూడగ, మంచి యన్నది మాలయైతే మాలనే యగుదున్‌' అన్నాడు గురజాడ. అంటే మంచే గనక మాల అయితే నేను దళితుడ్ని, నేను మాలవాడ్ని అని ఎవరు చెప్పగలిగారు. మతాన్ని గురించి చెప్పాడు. మతములన్నియు మాసిపోవును, ఎల్లలోకంబు వొక్క యిల్లై... ఎవరూ ఊహించలేదు. గురజాడకు ఇంత గొప్ప విజన్‌ వుందా? భవిష్యత్‌ మీద ఇంత గొప్ప ఒక ఆలోచన ఉన్నదా? సమాజంలో ఇవాళ మతంతోటి మనం ఎంత కుస్తీ పడుతున్నాం. ఒక వంద సంవత్సరాల క్రితం 'మతములన్నియు మాసిపోవును' అంటే ఒక రిలీజియస్‌ సొసైటీ, మతం లేనటువంటి సమాజం, ఒక లౌకికమైనటువంటి సమాజం గురుజాడ ఊహించగలిగాడు.
'తిండి కలిగితే కండ కలదోరు, కండ కలవాడేను మనిషోరు' అంటే తిండి, మనిషి బతకడానికి, మనుగడకు కావలసినటువంటి తిండిని గురించి చెప్పినటువంటి మొట్టమొదటి తెలుగు కవి గురజాడ. కొశాంబిని అందరూ ఉత్పత్తి ఏమిటి. సంపద ఉత్పత్తి ఏమిటి? పంటల ఉత్పత్తి ఏమిటి? పంటలు ఏమిటి? అని అడుగుతుంటే కొశాంబి ఒకటే మాటన్నాడు. 'తిండి లేకుండా బ్రతికే మార్గం మనిషికి ఏదైనా ఉంటే చెబితే నేను సంతోషిస్తాను' అన్నాడు. 'తిండికి బదులుగా ఏదన్నా గాలి మేసో, ఏదో అట్టాంటిది తిని బతికే అవకాశం ఉంటే చెప్పండి' అన్నాడు. అంటే ఏంటి? ఉత్పత్తి ఎలా జరుగుతుంది సమాజంలో . కొశాంబి చెప్పింది అదే. అసలు అతను చెప్పింది చరిత్ర సారాంశం. ఇట్‌ ఈస్‌ ఏ కొశ్చన్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌. సమాజంలో ఉత్పత్తి సంబంధాలు. 
అంతకంటే చరిత్ర ఇంక ఏం లేదు. కొశాంబి ఒకే సెంటెన్స్‌ చెప్పాడు. ఇట్‌ ఈస్‌ ఏ కొశ్చన్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఇన్‌ ద సొసైటీ అంటాడు. ఎవరు ఉత్పత్తి చేస్తారు. ఏమి ఉత్పత్తి చేస్తారు.ఉత్పత్తి చేసిందాన్ని ఎవడు తీసుకుంటాడు. ఎవడు ఎంత భాగం తీసుకుంటాడు. దేంతో ఉత్పత్తి చేస్తాడు. ఏ సాధనాలతో, టెక్నాలజీతో చేస్తాడు. మతం వేరయితేనేమోరు మనసులొకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించెన్‌, ఇవన్నీ ఇందులో ఒక్కొక్క పదం ఒక మణిపూస లాంటిది. ఇంత గొప్ప దేశభక్తి గేయం. చాలా మంది సాహిత్యకారులు చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఇంత గొప్ప దేశభక్తి గేయం రాలేదు. మన గురజాడ అని, మనం గురజాడను అభిమానిస్తున్నవాళ్ళం కాబట్టి చెప్పుకుంటున్న విషయం కాదిది. ఇది మామూలుగా అందరూ గొప్పవాళ్ళు చెప్పినటువంటి మాట. ఇంత గొప్ప గేయం రాసినటువంటి గురజాడ. ఆ గురజాడను మనం ఇవ్వాళ స్మరించుకోవడం. ఎంతటి ఆధునిక భావాలకయినా కూడా గురజాడ నుంచి ఉదాహరణలు తీసుకోవచ్చు. 'మగడు వేల్పన పాతమాటది' నీ మొగుడు కాస్తా దేవుడనుకుంటున్నావు. అది చాలా పాతమాట. కాలం చెల్లిపోయిన మాట.వాడు నీ సహచరుడు. స్నేహితుడు. ఎవడు చెబుతాడు ఈ మాటలు ఆనాడు. పందొమ్మిదో శతాబ్దంలో ఇంత ఆధునిక భావాల్ని చెప్పినవాడు గురజాడ మాత్రమే.
(Prajasakti, 9/12/2009)

దేశమును ప్రేమించుమన్నా





దేశమును ప్రేమించుమన్నా కవితను మహాకవి గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించెను.

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌
పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్‌
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌
మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
(te.wikisource.org)

గురజాడ దేశభక్తి గేయం "దేశమును ప్రేమించుమన్నా"


నేడు నవంబరు 30, మహాకవి గురజాడ వర్ధంతి. 53 సంవత్సరాల వయసులో 1915 నవంబరు 30 ఆయన మరణించారు.ఆయన దేశ భక్తి గేయం ప్రపంచ సాహిత్యంలో ఒక ఆణి ముత్యం. గేయం పై  వకుళాభరణం  రామకృష్ణ  గారి ప్రసంగం పాఠాన్ని, గేయం పూర్తి పాఠాన్ని సందర్భంగా మీకు అందిస్తున్నాను.

దేశభక్తి బాగా పెల్లుబుకుతున్న దేశంలో, మాటకి ముందర దేశభక్తి దేశభక్తి...అంటూ ఏదైనా అనుమానం వస్తే వీడికి దేశభక్తి లేదు. పలానా పార్టీకి దేశభక్తి లేదు. పలానా వాళ్ళు దేశభక్తులు కారు అనేటువంటి సంప్రదాయం ఉండేటువంటి మన దేశంలో సాహితీస్రవంతి, సుందరయ్య విజ్ఞానకేంద్రం సంయుక్తంగా 'దేశభక్తి గేయం వందేళ్ల పండుగ' సభ జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రదేశంలో 1940 దశకంలో, తర్వాత కూడా తెలుగువాళ్ళ సాంస్కృతిక జీవితానికి, సాంస్కృతిక సంపదకు జీవం పోసింది కమ్యూనిస్టు పార్టీ మన ఆంధ్రదేశంలో. వాళ్ళని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి సాంస్కృతిక సంపదను మొత్తం ప్రజల ముందు ఉంచినటువంటిది కమ్యూనిస్టు పార్టీ. గురజాడ రచనలు అన్నీ ఎక్కడో ఏమూలనో పడి దుమ్ముకొట్టుకుంటుంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ వాటికోసం కృషిచేసి, వాటిని సంపాయించి వెలికితీసి, అవసరాల సూర్యారావుగారితోటి సంపాదకత్వం చేసి గురజాడ రచనల మొత్తాన్ని ప్రచురించింది రోజుల్లో ఉండేటటువంటి ప్రజాశక్తి ప్రచురణాలయం లేదా విశాలాంధ్ర ప్రచురణాలయం.
వీరేశలింగాన్ని కూడా కామ్రేడ్‌ వీరేశలింగం అనే మన దేశంలో గురజాడని కామ్రేడ్‌ అనలేదు. కానీ గురజాడ రాసినటువంటి దేశభక్తి గీతంలోని కొన్ని పదాల్ని కమ్యూనిస్టులు తీసుకొచ్చి ఇందులో చేర్చారు అని ఒక అభాండం వేశారు. ఇది నిజంగా గురజాడ రాసిన గేయమేనా? ఇది కమ్యూనిస్టులు రాసినటువంటి గేయంలాగా వుందే! అంటే కమ్యూనిస్టులే చాలా గొప్ప గేయాలు రాస్తారా? లేకపోతే కమ్యూనిస్టులే భావజాలంతో రాస్తారా? ఇంకెవరూ రాయకూడదా సమాజంలో? 'నరుడి చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోరు' ఎంత గొప్ప భావన ఉంది ఇందులో. అంటే నీకు సంపదంతా ఎలా వస్తుంది? నీ సంపదంతా కష్టపడేటువంటి కష్టజీవుల స్వేదం నుండి, చెమట నుండి, రక్తం నుండి సంపద పుడుతుంది అని గురజాడ అనగలిగాడు. సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మళ్ళీ బతికించి మనముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్టు ఉద్యమం. సాంస్కృతిక పునరుజ్జీవనం మిగిల్చిపోయినటువంటి వారసత్వాన్ని సూర్యరశ్మిని విధంగా చెట్ల ఆకులు స్వీకరించి ప్రాణవాయువుగా చెట్లు బతుకుతాయో విధంగా కమ్యూనిస్టు ఉద్యమం దాన్ని స్వీకరించి దానికి మళ్ళీ ప్రాణం పోసి ముందుకు తీసుకొచ్చింది.
వీరేశలింగం గానీ, గుర జాడ గానీ, గిడుగు కానీ, చిలకమర్తి గానీ మీరెవరైనా చెప్పండి సాంస్కృతిక పునరుజ్జీవన శకంలో వచ్చిన మహామహులు వాళ్ళెవరూ కమ్యూనిస్టులు కాదు. కోశాన చూసినా వాళ్ళు కమ్యూనిస్టులు కాదు. వాళ్ళు హేతువాదులు. సమాజం బాగుపడాలని కోరుకున్నటువంటి వారు. సమాజ పురోగతికి తోడ్పడినటువంటి వారు. తెలుగువాళ్ళ సాహిత్య జీవితంలోగానీ,
సాంస్కృతిక జీవితంలో గానీ, ఆధునికత అనేటువంటి దినుసుని, ఆధునికత అనే భావాన్ని గుర జాడ ప్రవేశ పెట్టాడు. ఆధునికత అంటే మనం మోడర్నిటీ అంటాం ఇంగ్లీషులో. 
ఇది కలోనియల్‌ మోడర్నిటీయా? లేకపోతే పోస్ట్‌ కలోనియల్‌ మోడర్నిటీయా? అనేది కాదిక్కడ. వలసపాలనతోటి వచ్చిన ఆధునికతలో వుండేటువంటి కొన్ని అంశాలు వలసపాలనకి ముందుకూడా మన భారతీయ సమాజంలో ఉన్నాయనేది పరిశోధనల్లో తేలింది. ఆధునికత అనేటువంటి ఒక భావాన్ని, అంటే ఒక హేతువాద దృక్పథాన్ని, ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, ఒక మానవతా దృక్పథాన్ని, మూడింటినీ కలగలపినటువంటి ఒక భావాన్ని గురజాడ పూర్తిగా ప్రవేశపెట్టాడు. భావజాలంలో, సాహిత్యంలో ప్రవేశపెట్టాడు. కొత్త గేయాన్ని, ముత్యాలసరాలు వంటి గేయాన్ని ఆయన మనికిచ్చిపోయాడు. 'మెచ్చవంటా నీవు, మెచ్చకుంటే మించిపోయేవు.కొయ్యబొమ్మల మెచ్చుకళ్ళకు కోమలుల సౌరెక్కునా' సింపుల్‌గా ఆయన పొయెట్రీని రాసాడు. ఇవాళ కేంద్రబిందువుగా కులం మీద చర్చ జరుగుతుంది. ఎవరిని చూసినా అతన్ని వ్యక్తిగా చూడడం లేదు. అతనికి ఉండేటువంటి భావజాలం ఏమిటి? అతనికుండేటువంటి నేపధ్యం ఏమిటి? ఏం చేస్తున్నారు? అని చూడట్లేదు. 
కులం అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలుగు కవిత్వంలో 'మంచి చెడ్డలు ఎంచి చూడగ, మంచి యన్నది మాలయైతే మాలనే యగుదున్‌' అన్నాడు గురజాడ. అంటే మంచే గనక మాల అయితే నేను దళితుడ్ని, నేను మాలవాడ్ని అని ఎవరు చెప్పగలిగారు. మతాన్ని గురించి చెప్పాడు. మతములన్నియు మాసిపోవును, ఎల్లలోకంబు వొక్క యిల్లై... ఎవరూ ఊహించలేదు. గురజాడకు ఇంత గొప్ప విజన్‌ వుందా? భవిష్యత్‌ మీద ఇంత గొప్ప ఒక ఆలోచన ఉన్నదా? సమాజంలో ఇవాళ మతంతోటి మనం ఎంత కుస్తీ పడుతున్నాం. ఒక వంద సంవత్సరాల క్రితం 'మతములన్నియు మాసిపోవును' అంటే ఒక రిలీజియస్‌ సొసైటీ, మతం లేనటువంటి సమాజం, ఒక లౌకికమైనటువంటి సమాజం గురుజాడ ఊహించగలిగాడు.
'తిండి కలిగితే కండ కలదోరు, కండ కలవాడేను మనిషోరు' అంటే తిండి, మనిషి బతకడానికి, మనుగడకు కావలసినటువంటి తిండిని గురించి చెప్పినటువంటి మొట్టమొదటి తెలుగు కవి గురజాడ. కొశాంబిని అందరూ ఉత్పత్తి ఏమిటి. సంపద ఉత్పత్తి ఏమిటి? పంటల ఉత్పత్తి ఏమిటి? పంటలు ఏమిటి? అని అడుగుతుంటే కొశాంబి ఒకటే మాటన్నాడు. 'తిండి లేకుండా బ్రతికే మార్గం మనిషికి ఏదైనా ఉంటే చెబితే నేను సంతోషిస్తాను' అన్నాడు. 'తిండికి బదులుగా ఏదన్నా గాలి మేసో, ఏదో అట్టాంటిది తిని బతికే అవకాశం ఉంటే చెప్పండి' అన్నాడు. అంటే ఏంటి? ఉత్పత్తి ఎలా జరుగుతుంది సమాజంలో . కొశాంబి చెప్పింది అదే. అసలు అతను చెప్పింది చరిత్ర సారాంశం. ఇట్‌ ఈస్‌ కొశ్చన్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌. సమాజంలో ఉత్పత్తి సంబంధాలు. 
అంతకంటే చరిత్ర ఇంక ఏం లేదు. కొశాంబి ఒకే సెంటెన్స్‌ చెప్పాడు. ఇట్‌ ఈస్‌ కొశ్చన్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఇన్‌ సొసైటీ అంటాడు. ఎవరు ఉత్పత్తి చేస్తారు. ఏమి ఉత్పత్తి చేస్తారు.ఉత్పత్తి చేసిందాన్ని ఎవడు తీసుకుంటాడు. ఎవడు ఎంత భాగం తీసుకుంటాడు. దేంతో ఉత్పత్తి చేస్తాడు. సాధనాలతో, టెక్నాలజీతో చేస్తాడు. మతం వేరయితేనేమోరు మనసులొకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించెన్‌, ఇవన్నీ ఇందులో ఒక్కొక్క పదం ఒక మణిపూస లాంటిది. ఇంత గొప్ప దేశభక్తి గేయం. చాలా మంది సాహిత్యకారులు చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఇంత గొప్ప దేశభక్తి గేయం రాలేదు. మన గురజాడ అని, మనం గురజాడను అభిమానిస్తున్నవాళ్ళం కాబట్టి చెప్పుకుంటున్న విషయం కాదిది. ఇది మామూలుగా అందరూ గొప్పవాళ్ళు చెప్పినటువంటి మాట. ఇంత గొప్ప గేయం రాసినటువంటి గురజాడ. గురజాడను మనం ఇవ్వాళ స్మరించుకోవడం. ఎంతటి ఆధునిక భావాలకయినా కూడా గురజాడ నుంచి ఉదాహరణలు తీసుకోవచ్చు. 'మగడు వేల్పన పాతమాటది' నీ మొగుడు కాస్తా దేవుడనుకుంటున్నావు. అది చాలా పాతమాట. కాలం చెల్లిపోయిన మాట.వాడు నీ సహచరుడు. స్నేహితుడు. ఎవడు చెబుతాడు మాటలు ఆనాడు. పందొమ్మిదో శతాబ్దంలో ఇంత ఆధునిక భావాల్ని చెప్పినవాడు గురజాడ మాత్రమే.(Prajasakti, 6/12/2009)

దేశమును ప్రేమించుమన్నా

 దేశమును ప్రేమించుమన్నా కవితను మహాకవి గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించెను.

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్తలపెట్టవోయ్
పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
చెట్టపట్టాల్పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
 (