Monday, January 20, 2014

2012-13 కు సంబంధించి బి ఎస్ ఎన్ ఎల్ ఆర్థిక పరమయిన పని తీరు తెన్నులు, మేనేజిమెంటు చెపుతున్న పరిష్కార మార్గాలు


1.     మొత్తముగా చూస్తే బి ఎస్ ఎన్ ఎల్ నగదు లోటుతో వున్నది.  2012-13 లో బి ఎస్ ఎన్ ఎల్ కార్పొరేట్ ఆఫీసుకు జమ అయిన నగదు= రు.14959 కోట్లు;  నిర్వహణ కు, పెట్టుబడికి సర్కిల్సుకు కేటాయించినది=రు.15388 కోట్లు. మొత్తముగా నగదు లోటు=రు.429 కోట్లు.
2.    సర్కిల్సు కు కేటాయించిన దానిలో పెట్టుబడికి(నెట్ వర్క్ విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు) కేటాయించినది=రు.1165 కోట్లు. కాబట్టి 2012-13 లో అభివృద్ధికి పెట్టిన పెట్టుబడి రు. 1165 కోట్లు మాత్రమే.
3.    సర్కిల్సుకు కేటాయించినదానిలో నిర్వహణకు (ఉద్యోగుల జీత భత్యాలు, కరెంటు, డీజీలు, కార్లకు అద్దెలు, పెట్రోలు, అద్దెలు తదితర రోజువారీ ఖర్చు )=రు.14223 కోట్లు.
4.    కాబట్టి మొత్తం నగదు రు.14959 కోట్లలో నిర్వహణకు అయినది రు. 14223 కోట్లు. నిర్వహాణ వరకూ చూస్తే నగదు కొద్దిగా మిగులుతుంది.(రు.14959 కోట్లు-రు.14223 కోట్లు=రు.736 కోట్లు.). కానీ పెట్టుబడి ఖర్చు కూడా కలిపితే పైన తెలిపిన విధముగా రు.429 కోట్లు నగదు లోటు ఏర్పడింది. ఈ లోటును అప్పు చేయటం ద్వారా పూడ్చినట్లే.
5.    2012-13 లో మొత్తం ఆదాయం=రు.27128 కోట్లు ; ఉద్యోగుల జీత భత్యాలకు=రు.13758 కోట్లు; మొత్తం ఆదాయములో జీతభత్యాలపై ఖర్చు శాతం=51 శాతం;
6.    మొత్తం ఆదాయములో జీతాల ఖర్చు శాతం బి ఎస్ ఎన్ ఎల్ లో 51 శాతం, ఏం టి ఎన్ ఎల్ లో 152 శాతం, ఎయిర్ టెల్ లో 3 శాతం, ఐ డి యా లో 5శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్సు లో 2 శాతం.
7.    మొత్తం ఆదాయములో అరుగుదల ఖర్చు శాతం (అరుగుదల ఖర్చు అంటే భవనాలు, ఎక్విప్మెంటు, కేబుల్,టవర్సు, యంత్రాలు తదితరాలు అవి కట్టినప్పుడు/స్థాపించినప్పుడు/కొన్నప్పుడు వాటి విలువ ఎంత వుంటుందో అది ప్రతి సంవత్సరమూ కొంత అరుగుదల వలన తగ్గుతుంటుంది.దీనినే అరుగుదల ఖర్చు అంటారు) బి ఎస్ ఎన్ ఎల్ లో 31 శాతం, ఏం టి ఎన్ ఎల్ లో 40 శాతం,  ఎయిర్టెల్ లో 15 శాతం, ఐడియా లో 14 శాతం, రిలయన్సు లో 13 శాతం వున్నది.
8.    మొత్తం ఆదాయములో పాలన, నిర్వహణ ఖర్చు బి ఎస్ ఎన్ ఎల్ లో 38 శాతం, ఏం టి ఎన్ ఎల్ లో 32 శాతం, ఎయిర్ టెల్ లో 54 శాతం, ఐడియా లో 61 శాతం, రిలయన్స్ లో 58 శాతం వున్నది.
9.    2013-14 లో బి ఎస్ ఎన్ ఎల్ కు పెట్టుబడి ఖర్చు రు.5600 కోట్లు అవుతుంది. అంటే నెట్ వర్క్ విస్తరణ/అప్ గ్రేడేషన్ కు ఇంతమొత్తం అవసరమవుతుంది. కంపెనీ నష్టాలలో వున్నది కాబట్టి ఇది ప్రభుత్వము ఉచితముగా ఇస్తే లేదా అప్పు తెస్తే సమకూరుతుంది.(2012-13 సంవత్సరములో 4 ప్రధాన ప్రయివేటు టెలికాం కంపెనీలు మొత్తం ఋ. 26,000 కోట్లు పెట్టుబడి ఖర్చు పెడతామని అన్నాయి)
10.  ప్రపంచములో ఆర్థిక స్థితి గడ్డుగా వున్నందున విదేశీ అప్పు దొరకటం కష్టం. బ్యాంకు అప్పు కావాలన్నా అది కంపెనీ నగదు ప్రవాహపు స్థాయి పై ఆధార పడి  వుంటుంది. నగదు ప్రవాహపు స్థాయి ప్రోత్సాహకారముగా లేదు కాబట్టి బ్యాంకు అప్పు కష్టం. నగదు ప్రవాహం సరిగా లేనందున ప్రభుత్వ రంగ హోదా గాని,ఆస్తులు బాగా వుండటం గాని, అప్పు తెచ్చుకోటానికి అంతగా ఉపయోగపడవు.
11.   2011-12, 2012-13 లో వివిధ టెలికాం కంపెనీల మొత్తం ఆదాయాలు(కోట్ల రూపాయిలలో)
కంపెనీ పేరు
2011-12
2012-13
పెరుగుదల శాతం
బి ఎస్ ఎన్ ఎల్
27934
27128
-3%
ఏం టి ఎన్ ఎల్
3624
3714
-2%
ఎయిర్ టెల్
42229
46813
11%
ఐడియా
19322
22087
14%
రిలయన్స్ కమ్యూనికేషన్స్
11863
12820
8%

ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ ల ఆదాయాలు పడి పోగా ప్రయివేటు రంగ సంస్స్థలయిన ఎయిర్టెల్, ఐడియా, రిలయన్స్ ల ఆదాయాలు పెరిగాయి.
12.  2012-13 సంవత్సరములో బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి
అ) ఆదాయం: సర్వీసులపై ఆదాయం=రు. 25655 కోట్లు; ఇతర ఆదాయం రు. 1473 కోట్లు; మొత్తం రు.  27128 కోట్లు
ఆ) ఖర్చు: ఉద్యోగులకు=రు. 13758 కోట్లు; పాలన మరియు నిర్వహణకు=రు.  10402 కోట్లు; లైసెన్సు ఫీజు మరియు స్పెక్ట్రమ్ ఫీజు  చెల్లింపుకు=రు.  2052 కోట్లు; ఆర్థిక పరమయిన ఖర్చులు=రు. 351 కోట్లు; తరుగుదల ఖర్చు=రు. 8336 కోట్లు; మొత్తం ఖర్చు=రు. 34900 కోట్లు;
ఇ) ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్సు కు ముందు నష్టం= రు. 34900 కోట్లు- రు.  27128 కోట్లు=ఋ.7772కోట్లు;
ఈ) ప్రయర్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్=రు. 183 కోట్లు
ఉ) పన్ను చెల్లింపుకు ముందు నష్టం= రు. 7772కోట్లు+ రు.  183 కోట్లు=రు. 7955 కోట్లు
ఋ) వాయిదా పడిన పన్ను=రు.  71 కోట్లు
ఌ) నికర నష్టం = రు. 7955 కోట్లు-రు. 71కోట్లు=రు. 7884 కోట్లు
13. బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు రావటం ఇది వరుసగా 4 వ సంవత్సరం. ఈ నాలుగు సంవత్సరాల మొత్తం నష్టం:
2009-10=రు. 1823 కోట్లు; 2010-11=రు. 6384 కోట్లు; 2011-12=రు. 8851 కోట్లు; 2013-13=రు. 7884 కోట్లు; మొత్తం నష్టం =రు. 24942 కోట్లు.
13.  నష్టాలతో కొనసాగుతున్న ఈ పరిస్థితిలో పెట్టుబడులకు ఖర్చు  సాధారణముగా చేయకూడదు. ఏదయినా ప్రాజెక్టు తక్కువకాలములో ఎక్కువ రిటర్న్సు ఇచ్చేది వుంటే, లేదా ప్రభుత్వము తన పెట్టుబడిని పెంచాలని అనుకుంటే, లేదా దీర్ఘ కాలిక రుణము అందుబాటులో వుంటే సాధ్యమవుతుంది. ఈ పరిస్థితిలో వున్న వనరుల నుండి అధిక ఆదాయము పొందటాము చాలా ముఖ్యము. రోజువారీ ఖర్చుకు కూడా ఆదాయము సరిపోనీ పరిస్థితిలో , పెట్టుబడి ఖర్చుకు వున్న అవకాశం వాణిజ్య అప్పు తీసుకోటమే . కానీ వాణిజ్య అప్పును కూడా బ్యాంకులు ప్రాజెక్టు నాణ్యత, మార్కెట్ పరిస్తితి, అందులో బి ఎస్ ఎన్ ఎల్ పరిస్తితి-ఇవన్నీ చూసే ఇస్తాయి.
14.  గత 7 సంవత్సరాలలో బి ఎస్ ఎన్ ఎల్ ఆర్థిక పరిస్తితి:
గత 7 సంవత్సరాలలో బి ఎస్ ఎన్ ఎల్ స్థూల ఆదాయం 32 శాతం తగ్గింది. మొత్తం ఖర్చు 11 శాతం పెరిగింది, కానీ ఉద్యోగుల పై కాకుండా ఇతరాల పై ఖర్చు 12 శాతం తగ్గింది, ఉద్యోగులపై ఖర్చు 88 శాతం పెరిగింది.
టెలికాం సర్వీసుల రంగం లో వున్న అన్నీ కంపెనీలకు కలిపి మొత్తం ఆదాయం 2008-09 లో రు.  1,52,359 కోట్లు రాగా 2012-13 లో అది  రు. 2,15,590 కోట్లు అయింది.కానీ ఈ కాలములో బి ఎస్ ఎన్ ఎల్ ఆదాయము రు. 40,000 కోట్లనుండి రు. 27000 కోట్లకు పడి పోయింది.
2006-07 నుండి 2012-13 కాలములో బి ఎస్ ఎన్ ఎల్ కు ఎలక్ట్రిసిటీ మరియు ఇంధనం (పెట్రోల్, డీజెల్)పై ఖర్చు రు. 1522 కోట్ల నుండి రు.  2532 కోట్లకు పెరిగింది.
15.  నిర్వహణ ఖర్చులో ముఖ్యమయినదయిన ఉద్యోగులపై ఖర్చును తగ్గించటం సాధ్యము కాదు. రిటైర్మెంట్సు వలన ఈ ఖర్చులో తగ్గేదానికన్నా సర్వీసులో మిగిలిన వారికి ఇంక్రిమెంట్లు, డి ఏ లకు దాని ప్రకారం ఇ పి ఎఫ్ కు పెరిగే ఖర్చు ఎక్కువ వుంటుంది. కాబట్టి ఖర్చు తగ్గే అవకాశం నామ మాత్రం.

16.  పరిష్కారం:
అ) బ్రాడ్ బ్యాండ్ పై ఆదాయం మరింత పెరిగేలా చూడాలి. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు సరేన్డర్ కాకుండా కాపాడుకోవాలి. కనెక్షన్లు మరింత పెరిగేలా చూడాలి. (బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు సరేన్డర్ అవటం బి ఎస్ ఎన్ ఎల్ కు ప్రాణాంతకమని గుర్తించాలి)
ఆ) వినియోగదారులనుండి బకాయిలను వసూలు చేయటం మరింతగా చేయాలి. గతములో బకాయిల వసూలు సగటున 6 నెలలు కాగా ఇప్పుడు 3.7 అయింది. ఈ గడువును ఇంకా తగ్గించాలి.
ఇ) 7 సంవత్సరాల క్రితం ఒక ఉద్యోగి పై రూపాయి ఖర్చు పెడితే ఆదాయం రు. 5.4 వుండేది. ఇప్పుడది రు. 1.97 కు పదడి పోయింది. దీనిని కనీసం రు. 3 కు పెంచాలి.
ఈ) ఆదాయము, నిర్వహణ ఖర్చుల(ఉద్యోగుల జీతాల ఖర్చు మినహా) నిష్పత్తి 7 సంవత్సరాల క్రితం 3.63:1 కాగా ఇప్పుడది 2.61:1 అయింది.
ఉ) కాబట్టి మనుగడ కొనసాగాలాంటే ఆదాయం పెంచుకోటం తప్ప మరో మార్గం లేదు.
(ఈ వివరాలు బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు 30.11.2013 న కార్పొరేట్ ఆఫీసులో అన్నీ యూనియన్ల ప్రతినిధులతో జరిపిన సమావేశములో తెలియ పరచినవి)







No comments:

Post a Comment