9.1.2014 న జరిగిన
కేబినేట్ సమావేశం బి ఎస్ ఎన్ ఎల్, ఏం
టి ఎన్ ఎల్ లకు అవి తమకు ఇచ్చిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను వాపసు ఇచ్చాయి
కాబట్టి , అందు కోసం అవి చెల్లించిన సొమ్మును వాటికి తిరిగి
ఇవ్వాలని నిర్ణయించింది. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక,
తమిళనాడు, మరియు కోల్కటా-ఈ ఆరు సర్కిల్సు లో బి డబ్ల్యూ ఏ
స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ వాపసు చేసింది. ఏం టి ఎన్ ఎల్ తనకు ఢిల్లీ, బొంబాయిల కు కేటాయించిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ మొత్తం వాపసు చేసింది.
ఈ విధముగా వాపసు చేసిన స్పెక్ట్రమ్ కు బి ఎస్
ఎన్ ఎల్ కు ఋ.6724.51 కోట్లు చెల్లించాలని(అన్నీ
సర్కిల్సుకు కలిపి బి ఎస్ ఎన్ ఎల్ చెల్లించింది
ఋ. 8313.80 కోట్లు),
ఏం టి ఎన్ ఎల్ కు ఋ. 4533.97 కోట్లు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈ చెల్లింపు మొత్తం ఒకేసారిగా కాకుండా వాయిదాలలో చేయాలని నిర్ణయించింది. నష్టాలతో వున్న బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లు కోలుకోటానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వము అంటున్నది.
ఇంతేగాక ఈ సంస్థలు తమ నెట్ వర్క్సు
ఆపరేషన్, మెయింటెనెన్సు లకు అయిన ఖర్చుకు చెల్లించాల్సిన
బకాయిలను చెల్లించటానికి కూడా ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వము అంటున్నది.
డి ఓ టి నుండి ఏం టి ఎన్ ఎల్ లో విలీనమయిన
ఉద్యోగుల పెన్షన్ భారాన్ని ప్రభుత్వము భరిస్తుందని కూడా కేబినెట్ నిర్ణయించింది.
బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ ల పునరుద్ధరణ
సమస్య పై ఆర్థిక మంత్రి చిదంబరం అధ్యక్షతన
నియమించబడిన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు కేబినెట్ ఈ నిర్ణయాలు
తీసుకున్నది.
కానీ ఈ సహాయం చాలా
స్వల్పం మాత్రమే. 2012-17 మధ్య కాలం లో బి ఎస్ ఎన్ ఎల్ అభివృద్ధికి ఋ. 40,000 కోట్లు పెట్టుబడి అవసరమని బి
ఎస్ ఎన్ ఎల్ సి ఏం డి అన్నారు. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ కు ప్రభుత్వము నుండి మరింత
సహకారం అవసరం.
బి ఎస్ ఎన్ ఎల్ లో వి ఆర్ ఎస్ పై ఇంకా నిర్ణయం
తీసుకోలేదు
బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ ల పునరుద్ధరణ
సమస్య పై ఆర్థిక మంత్రి చిదంబరం అధ్యక్షతన
నియమించబడిన మంత్రివర్గ ఉపసంఘం 8.1.2014 న సమావేశమయింది. బి ఎస్ ఎన్ ఎల్ లో లక్ష
మండి ఉద్యోగులకు వి ఆర్ ఎస్ ఇవ్వాలనే ప్రతిపాదనను అది పరిశీలించింది. లక్ష మందికి
ఎక్స్ గ్రేషియా ఋ.11,276 కోట్లు అవుతుందని అంచనా. దీనికి
తోడు వి ఆర్ ఎస్ తీసుకున్న వారికి మామూలుగా ఇచ్చే రిటైర్మెంటు బెనెఫిట్సు పెన్షన్, డి సి ఆర్ జి, లీవు ఎన్ క్యాష్మెంట్ లకు కూడా
ఖర్చు అవుతుంది. ఈ సమస్య పై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం ఒక నిర్ణయానికి రాలేదు.
మళ్ళీ ఒక వారం రోజుల తరువాత సమావేశం కావాలని తీర్మానించింది.
తమ తప్పుడు
విధానాలకు ఉద్యోగులను బలి చేసేందుకే వి ఆర్ ఎస్ ను ప్రభుత్వము ముందుకు తెస్తున్నది.
బి ఎస్ ఎన్ ఎల్ నుండి టవర్సు ను విడగొట్టి ఒక
విడి కంపెనీగా మార్చే ప్రతిపాదన
ఈ ప్రతిపాదన కూడా
మంత్రివర్గ ఉప సంఘం పరిశీలించబోతునంది.
- వీటన్నింటినిబట్టి తేలేదేమిటంటే బి డబ్ల్యూ
ఏ స్పెక్ట్రమ్ వాపసు తీసుకుని అందుకు చెల్లించిన సొమ్మును బి ఎస్ ఎన్ ఎల్ కు వాపసు చెయ్యటం
మినహా బి ఎస్ ఎన్ ఎల్ కు ప్రభుత్వము చేసిన సహాయం ఏమీ లేదు. బి ఎస్ ఎన్ ఎల్
నుండి టవర్సును విడగొట్టి ఒక కంపెనీగా రూపొందించి, ఆ విధముగా బి ఎస్ ఎన్ ఎల్
ను ముక్కలు ముక్కలు చేసి అమ్మాలని చూస్తున్నది.ఇటువంటి అమ్మకాలు తేలికగా
జరగాలంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగులుంటేనే సాధ్యమవుతుంది. అందు కోసమే వి ఆర్
ఎస్ ఆలోచన మళ్ళీ ముందుకు వస్తున్నది. ఇటువంటి కుట్రలను ఉద్యోగులు ఐక్యముగా
ఎదిరించాలి.
No comments:
Post a Comment