బి ఎస్ ఎన్ ఎల్ మొబైల్
రెవెన్యూ లో పెరుగుదల
జి ఎస్ ఏం మొబైల్ సర్వీసులపై బి ఎస్
ఎన్ ఎల్ కు వచ్చిన రెవెన్యూ 2012 ఏప్రిల్-డిసెంబరు కాలము తో పోలిస్తే 2013
ఏప్రిల్-డిసెంబరు కాలం లో పెరిగింది. వివరాలు:
వివరం
|
2012 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు మొత్తం ఆదాయం
(కోట్ల రూపాయిలు)
|
2013 ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు మొత్తం ఆదాయం
(కోట్ల రూపాయిలు)
|
పెరుగుదల శాతం
|
బి ఎస్ ఎన్ ఎల్ మొత్తముగా
|
7391.72
|
7894.39
|
6.8 శాతం
|
సౌత్ జోన్ లో
|
|||
ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్
|
80.98
|
87.33
|
7.85శాతం
|
చెన్నై సర్కిల్
|
18.62
|
18.68
|
0.33 శాతం
|
కర్ణాటక సర్కిల్
|
55.61
|
71.16
|
27.96 శాతం
|
కేరళ సర్కిల్
|
79.37
|
96.79
|
21.95
|
తమిళనాడు సర్కిల్
|
67.01
|
72.55
|
8.27 శాతం
|
ఆదాయము తగ్గిన సర్కిల్సు=అస్సామ్
(0.29 శాతం), బీహార్(4.35 శాతం), ఝార్ఖండ్ (32.23 శాతం), మధ్యప్రదేశ్(2.62 శాతం), మహారాష్ట్ర(1.40 శాతం), హర్యానా(4.11 శాతం), ఉత్తరాంచల్(11.91 శాతం).
దేశ సంపద, ప్రజాప్రయోజనాలు, రాజకీయ కర్తవ్యం
ప్రపంచీకరణ షరతులతో అమలవుతున్న పథకాల వల్ల
దేశంలో సహజ వనరుల దోపిడీ తీవ్రమయింది. విధానాలలో భాగమే సహజవనరుల దోపిడీ. అన్నీ రంగాలలో
విదేశీ పెట్టుబడులను అనుమతించే విషయములో కాంగ్రెస్, బి జె పి లు ఒకే వైఖరితో ఉండటాన్ని ప్రజలు
గమనించాలి. దేశం లోని గనులు, జలాలు, సహజ
సంపదలను దోపిడీ వర్గాలకు కట్టబెట్టటం లో వాటి వైఖరి ఒకటే. ఈ విధానాల పట్ల ప్రాంతీయ
పార్టీలకు కూడా భిన్నాభిప్రాయం లేదు. ఈ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగేకొద్దీ
వారిని పక్కదారి పట్టించేందుకు కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి కాలం గడుపుకోవాలాని ప్రయత్నిస్తున్నాయి. బి
జె పి కి అదనముగా మరో వ్యూహమున్నది. మాట తత్వాన్ని రెచ్చగొట్టటం తో పాటు దేశాన్ని ముక్కలు
చేసి రాష్ట్రాలను బలహీనం చేసి కేంద్రీకృత నిరంకుశ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహం
తో అది వుంది. అది దేశానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది.
దేశములో వున్న ప్రధాన సమస్యలకి పరిష్కారం ఏమిటో చెప్పకుండా కేవలం అవినీతికి వ్యతిరేకాముగా
మాట్లాడుతూ ఆదేసందర్భములో అవినీతికి, అన్నీ సమస్యలకు మూలమయిన కార్పొరేట్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించకుండా
అవినీతికి వ్యతిరేకముగా పోరాడుతున్నామని చెప్పే కబుర్లు నమ్మదగినవి కావు.
అందుకనే కాంగ్రెస్, బి జె పి లను ఓడించటం
కర్తవ్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రపంచీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాడుతున్న వామ పక్ష ప్రజాతంత్ర శక్తులను
బలపరచాలి.
‘సైనిక’ న్యాయం
పుష్కర కాలం కిందట దేశాన్ని కుదిపేసిన పత్రిబల్
ఎన్‌కౌంటర్ వివాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. సైన్యం 2000
సంవత్సరంలో జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన ఐదుగురిని ఉగ్రవాదుల
ముద్రవేసి ఎన్‌కౌంటర్ పేరిట కాల్చి చంపింది. దాన్ని నిరసించిన జనంపై పోలీసులు
జరిపిన కాల్పుల్లో మరో తొమ్మిది మంది బలయ్యారు. అనంతరం సిబిఐ చేపట్టిన దర్యాప్తులో
డిఎన్‌ఎ పరీక్షల్లో మృతులు పాకిస్థాన్‌కు చెందిన వారు కాదని, జమ్మూకాశ్మీర్
పౌరులేనని నిర్థారణయ్యింది. అందుకు కారణమైన ఐదుగురు సైనికాధికారులు నిందితులుగా
అత్యున్నత దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చింది. అయితే సిబిఐ ఛార్జిషీటు దాఖలు
చేయడానికి ఉన్నత సైన్యాధికారుల ముందస్తు అనుమతిని పొందాలని సాయుధ దళాల (ప్రత్యేక
అధికారాల) చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఎ) చెబుతున్న నిబంధన పాటించనందున అది చెల్లదని సదరు
నిందితులు న్యాయస్థానాల్లో అభ్యంతరం లేవనెత్తడం తీవ్రమైన విషయం. కింది కోర్టులన్నీ
ఈ వాదనను తిరస్కరించినా ఇటీవల సుప్రీంకోర్టు నిందితులైన సైనికాధికారులను
నిర్దోషులుగా తేల్చడం ఇప్పుడు తాజా వివాదమైంది. మరోవైపు సైనిక న్యాయస్థానం (కోర్ట్
మార్షల్) కూడా సైనికాధికారుల తప్పు లేదని చెప్పడం మరో వింత. డిఎన్‌ఎ పరీక్షలో
మృతులు జమ్మూకాశ్మీర్‌కు చెందినవారని నిర్ధారణ కాగా కోర్టు మార్షల్ వారిని
పాకిస్తానీయులని చెప్పడం మరోవింత. ఎఎఫ్‌ఎస్‌పి చట్టం తొలి నుంచీ వివాదాస్పదమే.
జమ్మూకాశ్మీర్‌లోని ప్రజలు వ్యతిరేకించటమే గాక దేశమంతటా గల లౌకిక, ప్రజాతంత్రవాదులు
ఆ చట్టం పట్ల అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ నిరసనల సెగతో కేంద్ర ప్రభుత్వం
నియమించిన జస్టిస్ జీవన్‌రెడ్డి కమిటీ కూడా ఆ చట్టం అమానవీయమైనదని, దాన్ని
రద్దు చేయాలని సిఫార్సు చేసింది. కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ప్రత్యేక
పరిస్థితుల్లో మాత్రమే దాన్ని ఉపయోగిస్తే కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ భారతీయ
పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపేసిన సైనికాధికారులకు ఆ చట్టమే రక్షణ కవచంగా
ఉపయోగపడడం ఘోరం. ఆ చట్టంలోని లొసుగులే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా నిందితులు
నిర్దోషులుగా బయటపడడానికి దోహదపడడం దురూహ్యం. తమవారిని దారుణంగా చంపేస్తున్నారనీ, రకరకాల
సాకులతో తమను వేధిస్తున్నారని జమ్మూకాశ్మీర్ ప్రజల్లో సైన్యం పట్ల తీవ్ర
వ్యతిరేకత నెలకొన్నది. ఇలాటి నేపథ్యంలో ఈ తీర్పుతో పరిస్థితి మరింత దిగజారుతుంది.
ఎఎఫ్‌ఎస్‌పిఎను అడ్డం పెట్టుకొని పత్రీబల్ ఎన్‌కౌంటర్ కేసును మూసేయడానికి
వీలులేదు. ఇప్పటికైనా కేంద్రం తగు విధంగా జోక్యం చేసుకుని ఆ కేసులో విచారణ
కొనసాగించి శిక్షాస్మృతి ప్రకారం దోషులకు శిక్షలు పడేలా చూడాలి. అలా చేస్తేనే
జమ్మూకాశ్మీర్ ప్రజానీకానికి భారత ప్రభుత్వం పట్ల కొంతైనా విశ్వాసం కలుగుతుంది.(ప్రజాశక్తి 29.1.2014 తేదీ సంపాదకీయం)
No comments:
Post a Comment