Tuesday, February 4, 2014

అమెరికా ప్రజా గాయకుడు పీట్ సీగర్ కు నివాళి

కష్ట కాలం లో ఆశలను రేకెత్తించి భవిష్యత్తు పై విశ్వాసాన్ని  కలిపించే పాట “we shall overcome” (మేము అధిగమిస్తాము). ఈ పాట ఈ విధముగా వుంటుంది:
1.     Weshall overcome
We shall overcome
We shall overcome some day
CHORUS
 Oh, deep in my heart

I do believe
We shall overcome
Some day
2.    We’ll walk in hand
We’ll walk in hand
We’ll walk in hand some day
           CHORUS
3.    We shall all be free
We shall all be free
We shall all be free some day
            CHORUS
4.    We are not afraid
We are not afraid
We are not afraid some day
            CHORUS

5.    We are not alone
We are not alone
We are not alone some day
            CHORUS
6.    The whole wide world around
The whole wide world around
The whole wide world around some day
           CHORUS
7.    We shall overcome
We shall overcome
We shall overcome some day
“వుయ్ షల్  ఓవర్ కం”- ఇవి మూడు మాటలే. కానీ ఇవి ఆత్మ విశ్వాసం కలిగిస్తాయి. అమెరికాలో నల్ల జాతి ప్రజల పౌరహక్కుల కోసం మార్టిన్ లూథర్ కింగ్ ఆద్వర్యం లో జరిగిన ఉద్యమం సందర్భం గా ప్రతి సమావేశములో ఈ పాట పాడే వాళ్ళు. ఇదే పాటను భారతదేశములో విద్యార్థి ఉద్యమం, కార్మికోద్యమం తమ సమావేశాలలో అనేక సందర్భాలలో ఆలాపిస్తున్నది. దీనిని “హామ్ హోంగే కామ్ యాబ్” అనే పేరుతో హిందీలోకి అనువదించారు.
దీనిని “ ఐ విల్ ఓవర్ కం “ అనే క్రైస్తవ గీతం ఆధారముగా రూపొందించారు. దీనిని ప్రజలలో విస్తృతముగా ప్రచారం లోకి తెచ్చింది అమెరికా ప్రజా గాయకుడు పీట్ సీగర్. తన పాటలు ఎప్పటినుండో ప్రజలు పాడుకునే పాటలేనని, అయితే తాను వాటిని పాడి మరింత ప్రచారం లో పెడుతున్నానని ఆయన అనే వాడు. అమెరికా లో కమ్యూనిస్టు వ్యతిరేకతని మెకార్థే రెచ్చగొట్టిన కాలము లో పీట్ సీగర్ ను, మరో గాయకుడు పాల్ రాబ్సోన్ ను, ప్రసిద్ధ నటుడు చార్లీ చాప్లిన్ ను అనేక వేధింపులకు గురి చేశారు. ఆయనను కమ్యూనిస్టు అని చెప్పి బ్లాక్ లిస్టు లో పెట్టారు. అమెరికా పార్లమెంటును ధిక్కరించారనే పేరుతో ఆయనకు ఒక సంవతరం జైలు శిక్ష విధించారు. అమెరికా జానపద గేయాలను వెలికి తెచ్చి వాటిని తాను పాడి ప్రసిద్ధి కలిపించారు. అమెరికా కార్మికోద్యమానికి, పౌర హక్కుల ఉద్యమానికి, వియత్నాం లో అమెరికా యుద్ధానికి వ్యతిరేకముగా జరిగిన ఉద్యమానికి  మద్దతుగా ఆయన పాటలు పాడారు. చివరికి ఆయన ప్రతిభను అమెరికా ప్రభుత్వము కూడా గుర్తించక తప్ప లేదు. ఆనాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమెరికా లో కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం “నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్తో ఆయనను సన్మానించారు. అణగారిన ప్రజల హక్కుల కోసం జరిగిన పోరాటాలలో ఆయన పాల్గొన్నారు. హడ్సన్ నది కాలుష్యానికి వ్యతిరేకముగా ఆయన నాయకత్వములో జరిగిన 4 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఫలితముగా చివరికి ఆ కాలుష్యానికి కారణమయిన  జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ దిగివచ్చి ఆ నదిని శుద్ధి చేస్సేందుకు 50 కోట్ల డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.
2011 లో “ఆక్యుపై వాల్ స్ట్రీట్” ఉద్యమములో తన వయసు అప్పటికి 90 సంవత్సరాలయినా తన పాటలు వినిపించి ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించారు.
ఈ గొప్ప ప్రజా గాయకుడు 27.1.2014న 94 సంవత్సరాల వయసులో  మరణించారు. వారికి శ్రద్ధాంజలి.
పీట్ సిగార్ పాట “వుయ్ షల్ ఓవర్ కం” ను ఇక్కడ క్లిక్ చేసి వినండి.http://youtu.be/QhnPVP23rzo


No comments:

Post a Comment