Wednesday, August 5, 2020

కరోనా వైరస్ - ప్రపంచం- మన దేశం - మన టెలికం రంగం (మొదటి భాగం)

కరోనా వైరస్ అనుభవం చెప్పిన నిజంప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ రంగం లోనే వుండాలి

కరోనా వైరస్ వ్యాధి సోకిన వారి సంఖ్య ప్రకారం అమెరికా మొదటి స్థానం లో,  బ్రెజిల్ 2వ స్థానంలో, భారత దేశం మూడో స్థానంలో వున్నాయి. ఈ 3 దేశాలను పరిపాలించే ప్రభుత్వాలు మితవాదాన్ని ( కార్పొరేట్సుకు  పూర్తి అనుకూలం, ప్రజల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం) నియంతృత్వ వైఖరిని అవలంబిస్తున్నాయి.

ఈ వ్యాది  ప్రారంమయున దేశమైనప్భపటికి దీనిని నియంత్రించటంలో చైనా సఫలమయింది.  క్యూబాలో ఈ వ్యాధి వలన మరణించిన వారి  సంఖ్య 100 లోపే. ఇంతేగాక ఆ దేశం,  ఇతర అనేక దేశాలకు కరోనా కట్టడి చేయటంలో సహకరించేందుకు డాక్టర్లను పంపింది. వియత్నాం , లావోస్   లలో ఇంత వరకు ఎవరూ చని పోలేదు. ఉత్తర కొరియా లో కూడా  ఈ వ్యాధి వలన ఇంత వరకు ఎవరూ చనిపోలేదు.  కరోనాని నియంత్రించటంలో ఈ విధముగా సోషలిస్టు దేశాల ఆధిక్యత రుజువయింది.

సార్వత్రిక ఆరోగ్య  సంరక్షణ వ్యవస్థ మెరుగుగా వున్న    దక్షిణ కొరియా, సింగపూర్, న్యూజిలాండ్, తైవాన్ తదితర దేశాలలో కోవిడ్ నియంత్రణ, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే  కొంత మెరుగుగా వున్నది.

మన దేశంలో సిపిఎం నాయకత్వంలో వున్న కేరళ వామపక్ష  ప్రజాస్వామిక ఫ్రంట్ ప్రభుత్వము కరోనా వ్యాధిని నియంత్రించటం లో సాధించిన విజయాన్ని  కేరళ మోడల్గా  అందరూ ప్రశంసిస్తున్నారు. .ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది.

లాభాల కోసమే  పని చేసే పెట్టుబడిదారీ విధానం  మరింతగా వికటించిన దశలో నేడున్నాము. ఈ దేశాలు ప్రజారోగ్య రంగాన్ని కూడా  ప్రయివేటు పరం చేసి  ఆరోగ్యాన్ని లాభాలు  తెచ్చే  వ్యాపారముగా మార్చాయి. కాబట్టి  ప్రజా ఆరోగ్య రంగం ప్రభుత్వ రంగం లో వుండాల్సిన అవసరాన్ని కరోనా వైరస్ అనుభవం రుజువు చేసింది.

( మిగతాది  రెండవ భాగం లో తెలుసుకుందాం)

..... పి.అశోకబాబు

No comments:

Post a Comment