Thursday, January 16, 2014

బి ఎస్ ఎన్ ఎల్ ఆర్థిక పరిస్థితి: 2006-7 , 2011-12 మరియు 2012-13 సంవత్సరాలలో


                                                                               (కోట్ల రూపాయిలలో)
విషయం
2006-07
2011-12
2012-13

మొత్తం ఆదాయం
39715
27934
27128

ఇందులో




అ) సర్వీసులపై ఆదాయం
34616
25999
25655

సర్వీసేతర ఆదాయం
5099
1935
1473

సర్వీసులపై ఆదాయం లో




అ)టెలిఫోన్స్ పై
16605
5653
4947

ఆ) సెల్ ఫోన్స్ పై
9265
9741
10121

ఇ)బ్రాడ్ బ్యాండ్ పై
514
3569
3975

ఈ)లీజ్డు లైన్స్ పై
512
1804
1797

ఉ)ఇతర ఆపరేటర్లనుండి
6146
3220
3182

సర్వీసేతర ఆదాయంలో




అ)యు ఎస్ ఓ ఫండ్ నుండి
1719
------
1139

ఆ)నగదు నిలవలపై వడ్డీ
2788
113
68

నగదు నిలవలు
37452
(31.3.2007 నాటికి)
1885
(31.3.2012 నాటికి)
1161
(31.3.2013 నాటికి)

ఉద్యోగుల జీతాలపై ఖర్చు
(జీతం, పెన్షన్ కంట్రిబ్యూషన్, ఇపిఎఫ్ కంట్రిబ్యూషన్, లీవ్ ఎంక్యాష్మెంట్, మెడికల్ తదితరాలు)
7309
13406
13758

మొత్తం ఖర్చు
31466
36586
34900

లాభం/నష్టం
7806(లాభం)
8851(నష్టం)
7884 (నష్టం)


గమనించాల్సిన అంశాలు:
  1. 2006-07 లో టెలిఫోన్సు పై రు. 16605 కోట్లు రాగా 2012-13 లో అది రు. 4947 కోట్లకు పడి పోయింది.
  2. సెల్ ఫోన్స్ పై ఆదాయం 2006-07 లో రు. 9265కోట్లు కాగా అది 2012-13 నాటికి రు. 10121 కోట్లు మాత్రమే అయింది.
  3. ఈ విధముగా ఈ కాలములో టెలిఫోన్సు పై ఆదాయము రు.11658 కోట్లు తగ్గగా  సెల్ ఫోన్సు పై ఆదాయము కేవలము రు. 856 కోట్లు మాత్రమే పెరిగింది.
  4. బ్రాండ్ బ్యాండ్ పై ఆదాయం రు. 514 కోట్లనుండి ఈ కాలములో రు. 3975 కోట్లకు పెరిగింది, అనగా రు. 3461 కోట్లు పెరిగింది.
  5. నగదు నిల్వలు ఈ కాలం లో రు. 37452 కోట్లనుండి రు. 1161కోట్లకు తగ్గింది. దానిపై వడ్డీ రు. 2788 కోట్లనుండి రు. 68 కోట్లకు తగ్గింది. ఆ విధముగా ఈ కాలములో వడ్డీ ఆదాయము రు.2720 కోట్లు తగ్గింది.
  6. ఉద్యోగుల జీతాలపై ఖర్చు ఈ కాలం లో రు. 7309 కోట్లనుండి రు. 13758 కోట్లకు పెరిగింది, అనగా రు. 6449 కోట్లు పెరిగింది.
  7. టెలిఫోన్సు పై ఆదాయము రు.11658 కోట్లు తగ్గటం టెలిఫోన్సు నుండి వినియోగదారులు సెల్ ఫోన్సు కు వెళ్ళినందువలన అయినప్పుడు ఇంత ఆదాయం సెల్ ఫోన్సులో పెరగాలి. కానీ దాని ఆదాయం దాదాపు ఏమీ పెరగలేదు.( ఎయిర్టెల్ ఆదాయం 2006-07 లో రు.18420 కోట్లు వుండగా అది 2012-13 లో రు. 80311 కోట్లు అయింది. )ఇందుకు కారణం బి ఎస్ ఎన్ ఎల్ ను 2006 అనంతరం మొబైల్ ఫోన్స్ సర్వీసుల విస్తరణకు అవసరమయిన ఎక్విప్మెంటు కొనకుండా ప్రభుత్వము ఆపు చేయటమే. మేనేజిమెంటు మార్కెటింగు విధానాల లోపం దీనికి తోడయింది. టెలిఫోన్సు పై తగ్గిన ఆదాయం సెల్ ఫోన్స్ పై వస్తే బి ఎస్ ఎన్ ఎల్ కు నష్టాలు వచ్చేవి కావు. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు ప్రధాన కారణం అవసరమయిన సమయములో మొబైల్ ఎక్విప్మెంటు కొననీయకుండా ప్రభుత్వము అడ్డు పుల్లలు వేయటమే. దీనికి తోడు బి ఎస్ ఎన్ ఎల్ ల్యాండ్ లైంసుకు ఇతర టెలికమ్ కంపెనీలు చెల్లించే ఏ డి సి ని వాటి ఒత్తిడివలన రద్దు చేయటం, గ్రామీణ ప్రాంతాలలో ల్యాండ్ లైంసు కు ఇస్తున్న సబ్సిడీని ప్రయివేటు కంపెనీల ఒత్తిడివలన రద్దు చేయటం, 3జి మరియు బి డబ్ల్యూఏ స్పెక్ట్రమ్ కు ఋ.18500 కోట్లు చెల్లించి ఆ తరువాత ఆ స్పెక్ట్రమ్ ను తగు విధముగా ఉపయోగించుకోలేక పోవటం తదితర కారణాలున్నాయి.
  8. బి ఎస్ ఎన్ ఎల్ లో ఉద్యోగులందరూ కలిసి ఐక్యముగా చేసే పోరాటం చాలా ఆవసరమే. దానివలన బి ఎస్ ఎన్ ఎల్ నష్టాల సమస్యకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ పోరాటం ఒత్తిడి వలన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ వాపసు ఇచ్చినందుకు గాను ఆ స్పెక్ట్రమ్ కోసం చెల్లించిన ఋ.6700 కోట్లు తిరిగి బి ఎస్ ఎన్ ఎల్ కు ఇచ్చేందుకు ప్రభుత్వము అంగీకరించింది.  ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం వున్నది.
  9. ఇప్పుడు బి ఎస్ ఎన్ ఎల్ ను టవర్సు కంపెనీ, సర్వీసుల కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీలుగా విడగొట్టి దేనికది డిజిన్వేస్తుమెంటు చేయాలని ప్రభుత్వము ఆలోచిస్తున్నది. ఈ దివాళా కోరు విధానాలు సరళీకరణ విధానాలలో భాగముగా అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధానాలను త్రిప్పి కొట్టాల్సిన అవసరం వున్నది. ఇందుకు కార్మికవర్గ విశాల ఐక్య పోరాటాన్ని బలపరచాలి. అందులో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు భాగస్వాములు కావాలి. ప్రజా వ్యతిరేక సరళీకరణ విధానాలకు బదులు ప్రజలకి అనుకూలముగా వుండే ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకు వెళ్ళే బలగాన్ని నిర్మించటం లో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు పాల్గొనాల్సిన అవసరం వున్నది.








No comments:

Post a Comment