Wednesday, January 22, 2014

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ సంపాదించే అక్రమ అవకాశం ఇచ్చినందుకు డి ఓ టి అధికారులను తప్పు పట్టిన సి ఏ జి

ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే టెలికాం కంపెనీ వున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఆ సంస్థ 2010 లో జరిగిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ వేలములో పాల్గొన్నది. దేశం మొత్తం అన్నీ సర్కిల్సుకు కలిపి రు. 12750 కోట్లకు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను వేలములో కొన్నది. జూన్ 2010 లో ఈ విధముగా బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను పొందిన  వెంటనే ఈ కంపెనీని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొన్నది. ఈ లావా దేవీ లో ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్సుకు రు. 4800 కోట్లు లాభం వచ్చింది. కానీ డి ఓ టి రూల్సు ప్రకారం ఒక సంస్థ ప్రమోటర్లు స్పెక్ట్రమ్ ను కొన్న వెంటనే సంస్థను అమ్మి వేయ కూడదు. కనీసం మూడు సంవత్సరాలపాటు ఇటువంటి అమ్మకం నిషేధం. కానీ డి ఓ టి అధికారులు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ వేలము కు సంబంధించిన టెండరు డాక్యుమెంటులో ఈ నిబంధనను పెట్టకుండా వదిలి వేశారు. ఆ విధముగా ప్రభుత్వ ఖజానాకి రు. 4800 కోట్లు నష్టం కలిగించారు. వేలం ముగిసిన కొద్ది గంటలలోనే అందులో పాల్గొనని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ లభించింది. డి ఓ టి అధికారుల ఈ అక్రమాన్ని సి ఏ జి (కమ్ప్ ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ) తమ ఆడిట్ రిపోర్టులో తీవ్రముగా ఖండించారు.

 

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఈ విధముగా 2010 లో అక్రమ మార్గములో బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ (4 జి స్పెక్ట్రమ్) ను సంపాదించి ఇప్పుడు ఫిబ్రవరిలో జరిగే వేలము లో 2 జి స్పెక్ట్రమ్ ను సంపాదించి 4గ స్పెక్ట్రమ్ తో హై స్పీడ్ డేటా స్సర్వీసులను, 2 జి స్పెక్ట్రమ్ తో వాయిస్ సర్వీసులను దేశ వ్యాపితముగా ప్రారంభించబోతున్నది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ముకేష్ అంబానిది. ఇప్పుడు నడుస్తున్న రిలయన్స్ కమ్యూనికేషన్సు అతని తమ్ముడు అనిల్ అంబానీది.

అక్రమ పద్ధతిలో కాకినాడ దగ్గర సహజ వాయు నిక్షేపాలు సంపాదించి ఆ సహజ వాయువు  ధర ను ప్రభుత్వము అడ్డగోలుగా రెట్టింపు పెంచేలా చేసిన ఘనుడు ముకేష్ అంబానీ. ఈ అంబానీ సోదరులు నరేంద్ర మోడీని మహాత్మా గాంధీతో, వల్లభాయి  పటేల్ తో పోలుస్తూ తమ టి వి చానల్సు ద్వారా విపరీత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాములోనే వీరు ఇంత దోపిడి చేస్తుండగా ఇక వారు మహా నాయకుడని పొగుడుతున్న మోడీ అధికారములోకి వస్తే ఇక దేశాన్ని ఎంత తీవ్రముగా దోచుకుంటారో ఆలోచించండి.

No comments:

Post a Comment